S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నేడు మహా సంకల్పం

శ్రీకాకుళం, జూన్ 7: నవ నిర్మాణం దీక్షా కార్యక్రమంలో భాగంగా ఆఖరి రోజైన బుధవారం ఇక్కడి కె ఆర్ స్టేడియంలో జరగనున్న మహా సంకల్పం కార్యక్రమం ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ పి.లక్ష్మీనృసింహం పరిశీలించారు. సమస్యలను అధిగమిస్తూ గత రెండు సంవత్సరాల కాలంలో ప్రభుత్వం సాధించిన ప్రగతిపై ఇక్కడ అంబేద్కర్ ఆడిటోరియంలో జూన్ 2 నుంచి 7వ తేదీ వరకు నిర్వహించిన సదస్సుల విజయవంతంగా జరిగాయని తెలిపారు. బుధవారం జరగనున్న మహాసంకల్పంను విజయవంతం చేయాలని ఆదేశించారు. కార్యక్రమానికి హాజరైన వారికి ఎటువంటి సౌకర్యం జరగకుండా తాగునీరు, మజ్జిగ ప్యాకెట్లు ఏర్పాటు చేయాలని మున్సిపల్ హెల్త్ ఆఫీసర్, కమీషనర్‌కు ఆదేశించారు.

పరిశ్రమలు నెలకొల్పేందుకు కృషి

శ్రీకాకుళం, జూన్ 7: జిల్లాలో పరిశ్రమలు నెలకొల్పేందుకు కృషి చేస్తున్నామని శ్రీకాకుళం ఎంపి కింజరాపు రామ్మోహన్‌నాయుడు అన్నారు. నవ నిర్మాణ దీక్షలో భాగంగా ఆరవ రోజు ఎస్సీ, ఎస్టీ, బీసీ తదితర సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించిన సదస్సు డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ ఆడిటోరియంలో జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంపి మాట్లాడుతూ యువత మంచి నైపుణ్యాలను సాధించాలన్నారు. పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాలు సాధించినప్పుడు ఉపాధి అవకాశాలు అధికంగా ఉంటాయన్నారు. ఐటిడిఏ ఆధ్వర్యంలో గిరిజన యువతకు శిక్షణ కార్యక్రమాలు జరుగుతున్నాయన్నారు. సీఎం చంద్రబాబునాయుడు పేదరిక నిర్మూళనకు కృషి చేస్తున్నారన్నారు.

సంక్షేమ పథకాల సమీక్షకే నవ నిర్మాణ దీక్ష

సారవకోట, జూన్ 7: రాష్ట్ర ప్రభుత్వం విభజన అనంతరం చేపడుతున్న ప్రజా సంక్షేమ కార్యక్రమాలను సమీక్షించి లోటుపాట్లను సవరించుకోవడానికి నవ నిర్మాణ దీక్షా సదస్సులను నిర్వహిస్తున్నామని శ్రీకాకుళం ఎంపి కింజరాపు రామ్మోహన్‌నాయుడు స్పష్టంచేశారు. మండల కేంద్రంలో పార్టీ కార్యాలయంలో మంగళవారం సాయంత్రం ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. సంకల్ప దీక్ష పేరుతో బుధవారం నియోజకవర్గం కేంద్రాలలో విస్తృత స్థాయి చర్చలు జరిపి ప్రభుత్వానికి తీర్మానాలు పంపించనున్నట్లు ఆయన వివరించారు.

జాతీయ రహదారిలో... 36 ప్రమాద జంక్షన్ల గుర్తింపు

నరసన్నపేట, జూన్ 7: జిల్లాలో ఇటీవల కాలంలో రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని దీనికి సంబంధించి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా ఎస్పీ జె బ్రహ్మారెడ్డి తెలిపారు. మంగళవారం మండల కేంద్రంలోని స్థానిక పోలీస్‌స్టేషన్, క్వార్టర్స్‌లను పరిశీలించేందుకు వచ్చిన ఆయన విలేఖర్లతో మాట్లాడారు. జిల్లాలో ప్రతీ ఏడాది సుమారు 532మందికి పైగా రోడ్డు ప్రమాదంలోనే మరణిస్తున్నట్లు గుర్తించామని దీని నివారణకు అన్ని విధాల చర్యలు తీసుకుంటామని స్పష్టంచేశారు. ఈమేరకు రణస్థలం నుంచి ఇచ్ఛాపురం వరకు జాతీయ రహదారిపై 36 ప్రమాద కూడళ్లను గుర్తించామని ఆయన పేర్కొన్నారు. ఆయా ప్రాంతాల్లో మరింత నిఘా పెంచుతామన్నారు.

సజావుగా ఎంసెట్ కౌనె్సలింగ్

ఎచ్చెర్ల, జూన్ 7: ఈ విద్యా సంవత్సరంలో ఇంజినీరింగ్ కోర్సుల ప్రవేశానికి నిర్వహించిన వెబ్‌కౌన్సిలింగ్ రెండవ రోజు సజావుగా సాగడంతో అభ్యర్థులు ఊపిరి పీల్చుకున్నారు. తొలి రోజు సర్వర్లు మొరాయించడంతో రాత్రి 7గంటల వరకు కౌన్సిలింగ్‌కేంద్రం వద్ద పడిగాపులు కాసిన విషయం తెలిసిందే. సమస్య పునరావృతమవుతుందని రెండవ రోజు కౌన్సిలింగ్‌కు వచ్చిన అభ్యర్థులు ఒకింత ఆందోళనకు గురయ్యారు. 20వేలు లోపు ర్యాంకు సాధించిన అభ్యర్థుల సర్ట్ఫికెట్ల పరిశీలన ప్రక్రియ ముందుకు సాగడంతో ఇటు అభ్యర్థులు, అటు అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. 423మంది వెబ్‌కౌన్సిలింగ్‌కు హాజరు కాగా ఓసీ, బీసీలు 408, ఎస్సీ, ఎస్టీలు 15మంది ఉన్నారు.

వృద్ధులకు ఆర్థిక భరోసా కల్పనే ధ్యేయం

గార, జూన్ 7: ఆర్ధికంగా కుదేలైన కుటుంబాల్లో వృద్ధుల జీవనోపాధికై వారు చింతన పడకుండా వారిలో ఆత్మవిశ్వాసం పెంపొందింపజేసేందుకు భరోసా కల్పించేందుకు ప్రభుత్వం పింఛన్లు అందజేస్తోందని స్థానిక ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి స్పష్టం చేసారు. స్థానిక మండల పరిషత్ కార్యాలయ సమావేశ మందిరంలో మంగళవారం అర్హులైన లబ్ధిదారులకు మంజూరైన పింఛను మొత్తాలను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే లక్ష్మీదేవి మాట్లాడుతూ బీదల కుటుంబాల్లో వెలుగులు నింపేందుకు, వారిలో ఆత్మవిశ్వాసం పెంపొందింపజేసే దిశగా వారికి భరోసా కల్పించేందుకు ప్రభుత్వం ఆహర్నిశలూ కృషి చేస్తుందన్నారు.

ప్రభుత్వ పథకాలు సద్వినియోగం చేసుకోవాలి

ఎచ్చెర్ల, జూన్ 7: ప్రభుత్వ పథకాలు సద్వినియోగంచేసుకుని మహిళలు ఆర్థిక స్వావలంభన సాధించాలని జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ చౌదరి ధనలక్ష్మీ అన్నారు. మండల కేంద్రంలోని మహిళా ప్రాంగణంలో నియోజకవర్గ స్థాయి నవ నిర్మాణ దీక్ష కార్యక్రమంలో మంగళవారం ఆమె ముఖ్య అతిథిగా మాట్లాడారు. రాష్ట్రం పునర్నిర్మాణానికి మహిళా సంఘాల సభ్యులు తనవంతు చేయూతనందించాలన్నారు. సీఎం చంద్రబాబునాయుడు సంఘ సభ్యులకు ఆర్థిక చేకూర్పు అందిస్తున్నారన్నారు. వెలుగు పథకంతో ఆర్థిక పురోగతి సాధించాలన్నారు. ప్రభుత్వ కార్యక్రమాలను అర్హులకు అందే బాధ్యతలను కూడా మహిళా సంఘాలు చేపట్టాలన్నారు. క్షేత్రస్థాయిలో పథకాలు చేరువ చేసేందుకు కృషి చేయాలన్నారు.

అభివృద్ధిపై దృష్టి సారించాలి

నరసన్నపేట, జూన్ 7: రాష్ట్రంలో 13వ జిల్లాగా ఉన్న శ్రీకాకుళం జిల్లా అట్టడుగు స్థాయికి దిగజారిపోయిందని దీనికి గల కారణం ప్రతీ ఒక్కరిలో అభివృద్ధి సాధించాలన్న ఆకాంక్ష లేకపోవటమే అని జిల్లా కలెక్టర్ పి.లక్ష్మీనృసింహం ఆవేదన వ్యక్తంచేశారు. మంగళవారం స్థానిక మండల ప్రజాపరిషత్ కార్యాలయ సమావేశ మందిరంలో ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అభివృద్ధి సాధించాలన్న కోరిక ప్రతీ ఒక్కరిలో కలిగిన నాడే గ్రామాలు, జిల్లాలు, రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు.

మూత్రంలో మంట (మీకు మీరే డాక్టర్)

ప్ర:తరచూ మూత్రం మంటగా అవుతోంది. ఎలా తగ్గించుకోవాలో వివరించగలరు?
పోతురాజు రంగయ్య, కాకుమాను
జ: మీరు వ్రాసిన వివరాలను బట్టి మీ శరీరంలో వేడి ఎక్కువగా వుంటోందని అర్థం అవుతోంది. శరీరంలో ఆమ్ల గుణాలు ఎక్కువగా ఉండటంవలన మూత్రంలో మంట కలగవచ్చు. ఆమ్లానికి వ్యతిరేకమైన మృదుక్షారాలను వాడితే మంట తగ్గుతుంది. తీక్షణమైన క్షారాలు తీసుకున్నపుడు కూడా మూత్రంలో మంట రావచ్చు. కాల్షియం ఆగ్జలేట్ రాళ్ళు మూత్రపిండాల్లో ఏర్పడటానికి కారణం ఇదే! శరీరంలో ఆమ్ల క్షార గుణాల సమతుల్యత ఉన్నపుడు ఏ ఇబ్బందీ రాదు. నీరు ఎక్కువగా త్రాగే అలవాటు చేసుకోండి. మజ్జిగ మీద తేరుకున్న నీటిని తాగితే ఇంకా మంచిది.

డా జి.వి.పూర్ణచందు

Pages