S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సమస్యల సత్వర పరిష్కారమే లక్ష్యం!

విశాఖపట్నం, జూన్ 6: విద్యుత్ వినియోగదారులకు విశిష్ట సేవలందించే క్రమంలో ప్రతి సోమవారం నిర్వహిస్తున్న ‘డయల్ యువర్ సిఎండి’, స్పందన కార్యక్రమాలకు విశేష ఆదరణ లభిస్తోంది. ఎటువంటి జాప్యం లేకుండా సత్వర పరిష్కారానికి ప్రత్యేక చర్యలు చేపడుతున్నందునే ఫలితాలొస్తున్నాయని సంస్థ భావిస్తోంది. ఇందులోభాగంగా సోమవారం ఉదయం 9.30 గంటల నుంచి 10.30 గంటల వరకు జరిగిన డయల్ యువర్ సిఎండిలో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాలకు చెందిన అనేకమంది వినియోగదారులు తమ సమస్యలను నేరుగా సంస్థ చైర్మన్ కమ్ మేనేజింగ్ డైరెక్టర్ రేవు ముత్యాలరాజుకు విన్నవించుకున్నారు.

భారత్‌లో స్విట్జర్లాండ్లను నిర్మిస్తాం!

జెనీవా, జూన్ 6: భారత్‌ను స్విట్జర్లాండ్‌ల సమూహంగా మార్చాలనుకుంటున్నారు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ. తన స్విస్ పర్యటన సందర్భంగా సోమవారం మోదీ.. భారత్‌లో 2-3 స్విట్జర్లాండ్‌లను నిర్మించాలన్న ఆకాంక్షను వ్యక్తపరిచారు. ఇందులోభాగంగానే స్విస్ వ్యాపార, పారిశ్రామికవేత్తలతో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో భారత్‌లో పెట్టుబడులను పెట్టాలని వారిని ఆహ్వానించారు. రైల్వేలు తదితర వౌలికరంగాలను అభివృద్ధి పరిచేందుకు సహకరించాలని, 50 నగరాల్లో మెట్రో రైళ్ల నిర్మాణం, 5 కోట్ల చౌక గృహాల నిర్మాణానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు.

పొదుపు ఖాతాలపై 6 శాతం వడ్డీ ఇస్తున్నాం

హైదరాబాద్, జూన్ 6: పొదుపు ఖాతాలపై నానాటికీ వడ్డీ శాతం తగ్గిపోతున్న నేపథ్యంలో 6 శాతం వడ్డీకి కట్టుబడి ఉన్నామని దేశీయ ప్రైవేట్‌రంగ బ్యాంకుల్లో నాలుగో అతిపెద్ద బ్యాంకైన కొటక్ మహీంద్ర బ్యాంక్ స్పష్టం చేసింది. తమ ఖాతాదారుల సేవింగ్స్ అకౌంట్లలో లక్ష రూపాయలకుపైగా ఉన్న నగదు నిల్వలకు ఏడాదికి 6 శాతం వడ్డీరేటును ఇస్తున్నామని, లక్ష రూపాయల వరకు ఉన్న నగదు నిల్వలకు 5 శాతం వడ్డీని అందిస్తున్నామని సోమవారం ఇక్కడ కొటక్ మహీంద్ర బ్యాంక్ శాఖాధిపతి, సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఉపాధ్యక్షుడు విరాట్ దివాన్‌జీ తెలిపారు. నిజానికి చాలా బ్యాంకులు 4 శాతం వడ్డీరేటునే పొదుపు ఖాతాదారులకు ఇస్తున్నాయని చెప్పారు.

ఎయిర్‌సెల్‌లో ‘రంజాన్’ ఆఫర్లు

హైదరాబాద్, జూన్ 6: ముస్లీం సోదరుల పవిత్ర మాసం రంజాన్ సందర్భంగా ప్రైవేట్‌రంగ టెలికామ్ సంస్థ ఎయిర్‌సెల్ వినియోగదారులకు సరికొత్త ఆకర్షణీయమైన ఆఫర్లను ప్రకటించింది. లోకల్, ఎస్‌టిడి, ఐఎస్‌డి కాల్స్‌పై ఈ ఆఫర్లను ప్రకటించింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, సౌదీ అరేబియా, బంగ్లాదేశ్‌లకు చేసే కాల్స్‌పై రాయితీలుంటాయని చెప్పింది. కాగా, ఇతర వివరాల కోసం తమ ఎయిర్‌సెల్ ఔట్‌లెట్లు, కాల్ సెంటర్లు, కస్టమర్ కేర్లను వినియోగదారులు సంప్రదిస్తే పూర్తి వివరాలు అందుతాయని ఓ ప్రకటనలో సోమవారం సంస్థ స్పష్టం చేసింది.

పోర్టుల అభివృద్ధికి శ్రీకారం

విజయవాడ, జూన్ 6: ఆంధ్రప్రదేశ్‌లో పోర్టుల అభివృద్ధికి శ్రీకారం చుట్టామని, పోర్టులు అభివృద్ధి చెందితే పరిశ్రమలు వస్తాయని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. నవ నిర్మాణ దీక్ష వారోత్సవాల్లో భాగంగా సోమవారం పరిశ్రమలు, సేవారంగం, రెగ్యులేటరీ సెక్టార్‌లో ప్రగతి, గత రెండేళ్ల పాలనలో ప్రభుత్వం సాధించిన విజయాలు, భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికపై సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ రాజధానికి పక్కా ప్రణాళిక తయారు చేశామని, రైతుల త్యాగం తన జీవితంలో మర్చిపోలేనన్నారు. పోర్టుల నిర్మాణం జరిగితే పరిశ్రమలు వస్తాయని, పరిశ్రమలు వస్తే ఉద్యోగావకాశాలు పెరుగుతాయన్నారు.

ప్రయాణికులకు అందుబాటులో ఆర్టీసీ సేవలు

విజయనగరం (్ఫర్టు), జూన్ 6: ప్రయాణికులకు అందుబాటులోకి ఆర్టీసీ సేవలను విస్తృతం చేస్తున్నామని ఆర్టీసీ విజయనగరం రీజియన్ డిప్యూటీ చీఫ్ ట్రాఫిక్‌మేనేజర్ ఎన్‌విఆర్ వరప్రసాద్ తెలిపారు. స్థానిక ఆర్టీసీ బస్‌స్టేషన్‌లో సోమవారం ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా బస్సులను నడిపేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. విజయనగరం నుంచి భద్రాచలం వెళ్లేందుకు ఎక్స్‌ప్రెస్ బస్సును ప్రవేశపెట్టామని, అలాగే విజయవాడ వెళ్లేందుకు అదనంగా మరో బస్సును నడుపుతున్నామని అన్నారు. ముఖ్యంగా ఎస్.కోట డిపో నుంచి రెండు ఇంటర్‌స్టేట్ బస్సులను నడిపేందుకు ఏర్పాట్లు చేశామని తెలిపారు.

హ్యాకింగ్‌కు గురైన జుకర్‌బర్గ్ ట్విట్టర్ ఖాతా!

న్యూయార్క్, జూన్ 6: ఫేస్‌బుక్ సిఇఒ, వ్యవస్థాపకుడు మార్క్ జుకర్‌బర్గ్.. ట్విట్టర్, పింటెరెస్ట్ ఖాతాలు హ్యాకింగ్‌కు గురయ్యాయి. జుకర్‌బర్గ్ 2012 లింకెడిన్ ఖాతా నుంచి పాస్‌వర్డ్‌లను పొందినట్లు హ్యాకర్ గ్రూప్ ప్రకటించిందని మీడియా కథనాలు చెబుతున్నాయి. ‘అవర్‌మైన్ టీమ్’ అనే హ్యాకర్ గ్రూప్ ఈ చర్యకు పాల్పడగా, జుకర్‌బర్గ్ ట్విట్టర్ పేజ్ నుంచి 40,000 మందికిపైగా ట్విట్టర్ ఫాలోయర్స్‌కు సందేశాన్ని కూడా పంపిందీ గ్రూప్. ఇక జుకర్‌బర్గ్ పింటెరెస్ట్‌పై ‘అవర్‌మైన్ టీమ్ ద్వారా హ్యాకైంది’ అని ఓ కొత్త శీర్షికను పెట్టిందీ గ్రూప్.

అంగన్‌వాడీ భవనాలు త్వరితగతిన పూర్తి చేయండి

విజయనగరం(టౌన్), జూన్ 6: జిల్లాలో నిర్మిస్తున్న అంగన్‌వాడీ భవనాలు త్వరితగతిన పూర్తిచేసి పిల్లలను ఆయా కేంద్రాలలోకి మార్చాలని కలెక్టర్ ఎంఎం నాయక్ ఐసిడిఎస్ అధికారులను ఆదేశించారు. సోమవారం ఆయన మండల స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్సు సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ జిల్లాలో 596 అంగన్‌వాడీ భవనాలు మంజూరు చేసామని వీటిని సకాలంలో పూర్తిచేసేందుకు చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఉపాధి హామీ పథకం సహకారంతో నిర్మితమవుతున్న ఈ భవనాల పనులు తీరుపై పూర్తి సమాచారం ఇవ్వాలని ఆదేశించారు. పాఠశాలల్లో ఖాళీగా ఉన్న అదనపు వసతులను గుర్తించి అంగన్‌వాడీ కేంద్రాలు అక్కడికి తరలించాలని సూచించారు.

నష్టాల్లో స్టాక్ మార్కెట్లు

ముంబయి, జూన్ 6: దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం నష్టాల్లో ముగిశాయి. మంగళవారం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) ఈ ఆర్థిక సంవత్సరం (2016-17)లో రెండో ద్వైమాసిక ద్రవ్యపరపతి విధాన సమీక్ష జరపనున్న క్రమంలో మదుపరులు పెట్టుబడులకు ఆసక్తి కనబరచలేకపోయారు. దీంతో బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్ 65.58 పాయింట్లు కోల్పోయి 26,777.45 వద్ద స్థిరపడితే, నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీ 19.75 పాయింట్లు పడిపోయి 8,201.05 వద్ద నిలిచింది. ఐటి, కన్జ్యూమర్ డ్యూరబుల్స్, హెల్త్‌కేర్, చమురు, గ్యాస్ రంగాల షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి.

ప్రభుత్వ వైద్య కళాశాల ఇచ్చి తీరాల్సిందే

విజయనగరం(టౌన్), జూన్ 6: ప్రభుత్వ వైద్య కళాశాల మంజూరుకు నిధుల సమస్య ప్రతిబంధకంగా ఉందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి చేసిన ప్రకటనను లోక్‌సత్తా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భీశెట్టి బాబ్జీ తీవ్రంగా ఖండించారు. సోమవారం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వెనుకబడిన ప్రజలు నిరసించే విజయనగరం జిల్లా ప్రజల గోడు మంత్రికి ఎందుకు వినిపించటంలేదో అర్థం కావటంలేదని ఆవేదన వ్యక్తంచేసారు. ఇక్కడ ప్రభుత్వ వైద్య కళాశాల అవసరం ఉందని అందుకే తాము ప్రజల తరపున ఆందోళన చేస్తున్నామని తెలిపారు.

Pages