S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆందోళన వద్దు.. ఆదుకుంటాం

న్యూఢిల్లీ, జూన్ 6: మొండి బకాయిల సమస్యతో సతమతమవుతున్న ప్రభుత్వరంగ బ్యాంకులకు బాసటగా నిలుస్తామని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ సోమవారం భరోసా ఇచ్చారు. నిరర్థక ఆస్తులు ప్రమాదకర స్థాయికి చేరిన నేపథ్యంలో గడచిన ఆర్థిక సంవత్సరం (2015-16) చివరి త్రైమాసికం, ఈ ఏడాది జనవరి-మార్చిలో 12 ప్రభుత్వరంగ బ్యాంకులు నష్టాలపాలయ్యాయి. ఇందులో పంజాబ్ నేషనల్ బ్యాంక్ మునుపెన్నడూ లేనివిధంగా రికార్డు స్థాయిలో దేశీయ బ్యాంకింగ్ రంగంలోనే గరిష్ఠంగా 5 వేల కోట్ల రూపాయలకుపైగా నష్టాలను చవిచూసింది. ఈ 12 బ్యాంకులు ఈ జనవరి-మార్చిలో 24 వేల కోట్ల రూపాయలకుపైగా నష్టపోవడం గమనార్హం.

వైభవంగా శివపార్వతుల కల్యాణం

విజయనగరం(టౌన్), జూన్ 6: పట్టణంలోని కంటోనె్మంట్ ఉడాకాలనీ ఫేజ్-3లో వేంచేసి ఉన్న ఉమామహేశ్వరస్వామివారి దేవాలయంలో సోమవారం శివపార్వతుల కళ్యాణం వైభవంగా నిర్వహించారు. శివాలయం కార్యదర్శి జగదీశ్వరరావు ఆధ్వర్యంలో ఆలయ అర్చకులు సంతోష్ శివపార్వతుల కళ్యాణం కమనీయంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షుడు కోట్ల సుగుణాకరరావు, కాలనీ ప్రజలు పాల్గొన్నారు.
రాష్ట్భ్రావృద్ధికి ముఖ్యమంత్రి విశేష కృషి

సుశీల్‌కు చుక్కెదురు!

న్యూఢిల్లీ, జూన్ 6: రియో ఒలింపిక్స్‌లో పాల్గొనే అవకాశాన్ని స్టార్ రెజ్లర్ సుశీల్ కుమార్ దాదాపుగా కోల్పోయాడు. నర్సింగ్ పంచమ్ యాదవ్‌తో ట్రయల్ బౌట్ కోసం డిమాండ్ చేస్తున్న సుశీల్ తనకు న్యాయం చేయాలని కోరుతూ దాఖలు చేసిన పిటిషన్‌ను సోమవారం ఢిల్లీ హైకోర్టు కొట్టేసింది. పురుషుల రెజ్లింగ్ 74 కిలోల విభాగంలో ఒకరిని రియో ఒలింపిక్స్‌కు పంపే అవకాశం భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యుఎఫ్‌ఐ)కి ఉంది. అయితే, ఒలింపిక్స్ ప్రాబబుల్స్‌కు నిర్వహిస్తున్న శిక్షణ శిబిరంలో సుశీల్‌కు చోటు కల్పించని డబ్ల్యుఎఫ్‌ఐ నర్సింగ్ పేరు పరోక్షంగా ఖరారు చేసింది.

మార్టినెజ్ కీలక గోల్

చికాగో, జూన్ 6: కోపా అమెరికా ఫుట్‌బాల్ టోర్నమెంట్‌లో భాగంగా జమైకాతో జరిగిన మ్యాచ్‌ని వెనెజులా 1-0 తేడాతో తన ఖాతాలో వేసుకుంది. జోసెఫ్ మార్టినెజ్ కీలక గోల్ చేసి, వెనెజులాను విజయపథంలో నడిపాడు. లీగ్ దశలో సాధారణంగా ప్రతి జట్టూ అనుసరించే యుద్ధ నీతినే వెనెజులా అమలు చేసింది. మ్యాచ్ 15వ నిమిషంలోనే మార్టినెజ్ గోల్ సాధించడంతో 1-0 ఆధిక్యాన్ని సంపాదించిన ఆ జట్టు రక్షణాత్మక విధానాన్ని అనుసరించింది. ఎక్కువ సేపు బంతిని తన ఆధీనంలోనే ఉంచుకోవడం ద్వారా సాధ్యమైనంత వరకూ సమయాన్ని వృథా చేయాలన్న సంకల్పంతోనే ఆడింది. దీనితో గోల్స్ కోసం జమైకా చేసిన పోరాటాలు ఫలించలేదు.

టీమిండియా కోచ్ పదవికి రవిశాస్ర్తీ దరఖాస్తు

న్యూఢిల్లీ, జూన్ 6: టీమిండియాకు డైరెక్టర్‌గా వ్యవహరించిన భారత మాజీ క్రికెటర్ రవిశాస్ర్తీ ఇప్పుడు కోచ్ పదవికి దరఖాస్తు చేశా డు. జట్టు డైరెక్టర్‌గా అతని కాంట్రాక్టు ఇటీవలే పూర్తయంది. అదే విధంగా సపో ర్టింగ్ స్టాఫ్ సంజయ్ బంగార్, రామకృష్ణన్ శ్రీధర్, భరత్ అరుణ్ పదవీకాలం కూడా ముగిసింది. ఇటీవలే కోచ్‌సహా సపోర్టింగ్ స్టాఫ్‌కు దరఖాస్తులను ఆహ్వానిస్తూ భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ) ఒక ప్రకటననిచ్చింది. వెంటనే స్పందించిన రవిశాస్ర్తీ మరోసారి డైరెక్టర్ పదవికి దరఖాస్తు చేసుకున్నాడు.

నాబార్డు నిధులతో గ్రామాల్లో అప్రోచ్ రోడ్లు: మంత్రి అయ్యన్న

ఏలూరు, జూన్ 6: రాష్ట్రంలో 700 కోట్ల రూపాయల నాబార్డు నిధులతో పల్లెసీమల్లో అప్రోచ్ రోడ్ల నిర్మాణానికి ఒక ప్రణాళిక అమలుచేస్తున్నామని రాష్ట్ర పంచాయితీరాజ్ శాఖ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు చెప్పారు. స్ధానిక జడ్పీ అతిథిగృహంలో సోమవారం ఏలూరు ఎంపి మాగంటి బాబు మంత్రిని కలిసి కైకలూరు, నూజివీడు, ఉంగుటూరు, దెందులూరు, పోలవరం అసెంబ్లీ నియోజకవర్గాల్లో గ్రామీణ రహదారుల అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించాలని కోరారు. దీనిపై మంత్రి మాట్లాడుతూ దేశచరిత్రలో ఎన్నడూ లేనివిధంగా గ్రామీణ రహదారుల అభివృద్ధికి పెద్దఎత్తున బడ్జెట్‌లో నిధులు కేటాయించామన్నారు.

వార్నర్ అర్ధ శతకం

పోవి డెన్స్ (గయానా), జూన్ 6: ముక్కోణపు వనే్డ క్రికెట్ సిరీస్‌లో భాగంగా వెస్టిండీస్‌తో జరిగిన లీగ్ మ్యాచ్‌ని ఆస్ట్రేలియా ఆరు వికెట్ల తేడాతో గెల్చుకుంది. ఓపెనర్ డేవిడ్ వార్నర్ అజేయ అర్ధ శతకంతో రాణించి ఆసీస్‌ను విజయపథంలో నడిపాడు. అతని విజృంభణతో, 117 పరుగుల లక్ష్యాన్ని ఆస్ట్రేలియా 25.4 ఓవర్లలోనే ఛేదించింది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన వెస్టిండీస్ 32.3 ఓవర్లలో 116 పరుగులకే కుప్పకూలింది. జాన్ జార్లెస్ 22 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా, లోయర్ మిడిల్ ఆర్డర్‌లో కార్లొస్ బ్రాత్‌వెయిట్ 21 పరుగుల సాధించాడు. డారెన్ బ్రేవో 19 పరుగులకు అవుటయ్యాడు.

పశ్చిమ డెల్టా ప్రధాన కాలువకు నీరు విడుదల

నిడదవోలు, జూన్ 6: పశ్చిమ డెల్టా ప్రధాన కాలువకు 500 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. మండలంలోని విజ్జేశ్వరం హెడ్ స్లూయిస్ నుండి సోమవారం ఉదయం 7 గంటలకు ప్రాజెక్టు కమిటీ ఛైర్మన్ రామాంజనేయరాజు, ఇరిగేషన్ ఎస్‌ఇ రమణ గోదావరి మాతకు పూజలు నిర్వహించి 500 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ఈ ప్రధాన కాలువ నుండి నర్సాపురం, ఏలూరు, అత్తిలి, కాకరపర్రు ప్రధాన కాలువలకు నీరు చేరనుంది. దశలవారీగా నీటి విడుదల పెంచుతామని ఎస్‌ఇ రమణ తెలిపారు. కార్యక్రమంలో కానూరు నీటి సంఘం అధ్యక్షుడు జుజ్జవరపు భాస్కరరావు, ఇరిగేషన్ అధికారులు, రైతులు పాల్గొన్నారు.

విమర్శలు తట్టుకోలేక తప్పుడు కేసులు

నరసాపురం, జూన్ 6: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అవినీతిని వైసిపి అధ్యక్షులు జగన్మోహన్‌రెడ్డి ఎండగడుతున్న తీరును తట్టుకోలేక టిడిపి నేతలు తప్పుడు కేసులు పెడుతున్నారని మాజీ మంత్రి, వైసిపి రాష్ట్ర నాయకులు బొత్స సత్యనారాయణ విమర్శించారు. సోమవారం స్థానిక తెలగా కల్యాణ మండపంలో నియోజకవర్గస్థాయి కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ముఖ్యఅతిధిగా బొత్స హజరై మాట్లాడారు. తెలుగుదేశం పార్టీ అధికారాన్ని అడ్డుపెట్టుకుని దోపిడీలకు పాల్పడుతోందని ఆరోపించారు. పేదవాడికి రాష్ట్రంలో న్యాయం జరగడం లేదన్నారు. టిడిపిప్రభుత్వ తీరుపై జగన్ న్యాయపోరాటం చేస్తున్నారన్నారు.

వికలాంగ ఉపకరణాలలో సాంకేతికత

మచిలీపట్నం, జూన్ 6: అర్హులైన మూగ, చెవిటి వారికి టచ్ ఫోన్‌లు.. పోస్ట్‌గ్రాడ్యుయేషన్, గ్రాడ్యుయేషన్ వికలాంగ విద్యార్థులకు మోటరైజ్డ్ సైకిల్స్.. 10వ తరగతి, ఇంటర్మీడియట్ విద్యార్థులకు బ్యాటరీ ఆపరేట్ సైకిల్స్.. అంధ విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు అందించేందుకు విభిన్న ప్రతిభావంతులు, వయోవృద్ధుల సహాయ సంస్థ (కార్పొరేషన్) ప్రణాళికలు తయారు చేస్తోంది. ఈ మేరకు 2016-17 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి నిధుల కేటాయింపు భారీగా జరిగింది.

Pages