S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిఎంపై చంద్రగిరి పోలీస్‌స్టేషన్లో ఫిర్యాదు

చంద్రగిరి, జూన్ 6: ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను చంద్రబాబు నాయుడు నెరవేర్చలేదంటు చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి సోమవారం చిత్తూరు జిల్లా చంద్రగిరి పోలీసులకు రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. బాబు ఇచ్చిన హామీలు నెరవేర్చని కారణంగా ఈనెల 9వ తేదీన రాష్టవ్య్రాప్తంగా అన్ని పోలీస్‌స్టేషన్లలో ఫిర్యాదులు చేయాలని వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్‌రెడ్డి పిలుపు ఇచ్చిన విషయం తెలిసిందేనన్నారు. అయితే తాను మంగళవారం సింగపూర్‌కు వెళుతున్న కారణంగా 9వ తేదీన అందుబాటులో ఉండనని, అందుకే తాను ముందుగా ఫిర్యాదు చేస్తున్నట్లు చెవిరెడ్డి సోమవారం విలేఖర్లకు చెప్పారు.

భవన వ్యర్థాల రీసైక్లింగ్ ప్లాంట్లు

విశాఖపట్నం, జూన్ 6: పట్టణ ప్రాంతాల్లో గుట్టలు గుట్టలుగా పేరుకుపోతున్న భవన వ్యర్థాలను రీసైక్లింగ్ చేయడం ద్వారా కొంతమేర వ్యర్థాలను తగ్గించుకోవాలని కేంద్రం ఆలోచన చేస్తోంది. 10 లక్షల జనాభా దాటిన ప్రతి పట్టణంలోను భవన వ్యర్థాల రీసైక్లింగ్ ప్లాంట్‌లు ఏర్పాటు చేయాలని ఆదేశించింది. తొలిదశలో విశాఖపట్నం, రాజధాని అమరావతిలో రెండు ప్లాంట్‌లు ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంలో ఈ రెండు ప్రాంట్లను ఏర్పాటు చేయనున్నారు. స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసే ప్లాంట్‌లు భవన నిర్మాణ వ్యర్థాలను రీక్లైంగ్ చేస్తాయి.

అంతర్ రాష్ట్ర దోపిడీ దొంగల ముఠా అరెస్ట్

నెల్లూరు, జూన్ 6: ఆంధ్రప్రదేశ్‌తో పాటు ఇతర రాష్ట్రాల్లో దోపిడీ దొంగతనాలు, హత్యలకు పాల్పడుతున్న 8 మంది సభ్యుల ముఠాను నెల్లూరు సిసిఎస్ పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. నెల్లూరులో సోమవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో జిల్లా ఎస్‌పి విశాల్ గున్నీ ఈ ముఠా సభ్యుల అరెస్ట్, వారిపై నమోదైన కేసుల వివరాలను వివరించారు.

ఎఓబిలో పోలీసులు గాలింపు చర్యలు

సీలేరు, జూన్ 6: ఆంధ్రా- ఒడిశా సరిహద్దుల్లో మావోయిస్టుల కోసం పోలీసులు విస్తృతంగా గాలింపు చర్యలు చేపడుతున్నారు. సరిహద్దు ప్రాంతమంతా పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకుని అనువణువునా గాలిస్తున్నారు. ఇటీవల మావోయిస్టులకు గట్టి ఎదురుదెబ్బ తగిలి అగ్రనేతలను కోల్పోయిన విషయం తెలిసిందే. మరికొంతమంది మావోయిస్టులు స్వచ్ఛందంగా లొంగిపోయారు. దీంతో పోలీసులు మావోయిస్టుల దళాలను పూర్తిగా నిర్వీర్యం చేసే పనిలో నిమగ్నమయ్యారు. మావోలు స్వచ్ఛందంగా లొంగిపోతే వారిపై ఎటువంటి కేసులు నమోదు చేయమని ప్రకటనలు చేస్తున్నారు. మావోయిస్టు ఇన్‌ఫార్మర్ వ్యవస్థను పూర్తిగా రూపుమాపేందుకు చర్యలు చేపడుతున్నారు.

గంజాయి అక్రమ రవాణాపై నిఘా

నర్సీపట్నం,జూన్ 6: ఆంధ్రా-ఒడిశా సరిహద్దు ప్రాంతాల నుండి తరలిస్తున్న గంజాయి రవాణాపై గట్టి నిఘా ఏర్పాటుచేశామని నర్సీపట్నం ఎఎస్పీ ఐశ్వర్యరస్తోగి తెలిపారు. గంజాయి రవాణా నిరోధానికి ఇప్పటికే ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేశామన్నారు. సోమవారం పట్టణ పోలీస్ స్టేషన్‌లో ఆయన విలేఖరులతో మాట్లాడుతూ జిల్లాలో గంజాయి రవాణా, రోడ్డు ప్రమాదాల నివారణపై దృష్టి సారించాలని జిల్లా ఎస్పీ ఆదేశించారన్నారు. ఈమేరకు డివిజన్‌లోని పోలీస్ స్టేషన్ల సిఐలు, ఎస్సైలను అప్రమత్తం చేశామన్నారు. కొంతకాలంగా గంజాయి వ్యాపారం సాగిస్తున్న స్మగ్లర్ల జాబితాలను సిద్ధం చేస్తున్నామన్నారు.

గత పాలకుల వల్లే పరిశ్రమలు రాలేదు

కశింకోట, జూన్ 6: గత పాలకుల చలవ వల్లే నియోజకవర్గానికి పరిశ్రమలు రాకుండా పోయాయని ఎమ్మెల్యే పీలాగోవి ంద స్పష్టం చేశారు. సో మవారం స్థానిక ఆర్‌ఇసిఎస్ కార్యాలయం ప్రాంగణంలో నవనిర్మాణదీక్షలో ఎమ్మెల్యే ప్రసంగించారు. నియోజకవర్గంలోని సంపతిపురం, వల్లూరు, కోడూరు గ్రామ రెవెన్యూ పరిధిలో కంపెనీలు వస్తున్నాయన్నారు. స్థానికులకు ఉపాధి దొరుకుతుందన్నారు. కుటుంబ ఆదాయం పెరిగితే రాష్ట్ర ఆదాయం కూడా పెరుగుతుందని, విద్యకు ప్రభుత్వం ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుందని, తల్లిదండ్రులు వారి పిల్లలను బాగా చదివించాలన్నారు. స్థానిక శారదనదిపై సుమారు రెండుకోట్ల రూపాయలతో బ్రిడ్జి నిర్మాణానికి అన్ని ఏర్పాట్లు ఇప్పటికే చేశామన్నారు.

రాష్ట్భ్రావృద్ధికి చంద్రబాబు కృషి

దేవరాపల్లి, జూన్ 6: ఆంధ్రప్రదేశ్‌ను అగ్రగామిగా నిలిపేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు అహర్నిశలు కృషి చేస్తున్నారని బిసి సంక్షేమ శాఖ, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. స్ధానిక ద్రోణంరాజు ఆడిటోరియంలో సోమవారం నవ నిర్మాణ దీక్షలో ఆయన మాట్లాడుతూ స్వార్ధ రాజకీయాలకోసం కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అభాసుపాలు చేసిందన్నారు. సమన్యాయం చేయవల్సిన కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు ఆస్తులిచ్చి ఆంధ్రప్రదేశ్‌ను అప్పులు పాలుచేసిందని, క్లిష్ట పరిస్ధితుల్లో రాష్ట్రాన్ని అభివృద్ది పధంలో నడిపించడానికి చంద్రబాబు అహర్నిశలు కృషి చేస్తున్నారన్నారు.

చంద్రబాబుతోనే అభివృద్ధి సాధ్యం

నక్కపల్లి, జూన్ 6: ముఖ్యమంత్రి చంద్రబాబుతోనే రాష్ట్భ్రావృద్ధి సాధ్యమవుతుందని బిసి సంక్షేమం, ఎక్సైజ్ శాఖా మంత్రి కొల్లు రవీంద్ర స్పష్టం చేశారు. ఇక్కడి జెడ్పీ ఉన్నత పాఠశాలలో ఐదురోజులుగా జరుగుతున్న నవజీవన దీక్షాకి సోమవారం హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి రవీంద్ర మాట్లాడుతూ చంద్రబాబుసంక్షేమానికి పెద్దపీట వేస్తున్నారన్నారు. బడుగు, బలహీనవర్గాల అభ్యున్నతికి నిరంతరం కృషిచేస్తున్నారని, రాష్ట్రంలో 1.92లక్షల ఇళ్లు నిర్మాణ దశలో ఉన్నాయని చెప్పారు. రైతులకు 50వేల కోట్ల రూపాయల మేర రుణమాఫీ జరుగుతుందన్నారు.

కీలక ఔషధాల ధరలను తగ్గించిన ఎన్‌పిపిఎ

న్యూఢిల్లీ, జూన్ 6: కీలకమైన ఔషధాల ధరలను నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైసింగ్ అథారిటీ (ఎన్‌పిపిఎ) తగ్గించింది. క్యాన్సర్, డయాబెట్స్, రక్తపోటు, బ్యాక్టీరియల్ ఇనె్ఫక్షన్ల వ్యాధులకు చికిత్సగా అందించే 56 రకాల ఔషధాల ధరలను దాదాపు 25 శాతం మేర ఎన్‌పిపిఎ తగ్గించింది. అయినప్పటికీ మరికొన్ని రకాల ఔషధాల ధరలను పెంచుతూ ఎన్‌పిపిఎ నిర్ణయం తీసుకుంది. దీంతో గ్లూకోజ్, సోడియం క్లోరైడ్ ఇంజెక్షన్లు తదితర ఔషధాల ధరలు పెరిగాయి. కాగా, అబ్బోట్, సిప్లా, లుపిన్, అలెంబిక్, ఆల్కెమ్, నోవార్టీస్, బయోకాన్, ఇంటస్, హెటిరో, సన్ ఫార్మా సంస్థలు తయారు చేస్తున్న ముఖ్యమైన ఔషధాలు ధరలు తగ్గిన వాటిలో ఉన్నాయి.

నిధుల వేటలో ఎన్‌టిపిసి

న్యూఢిల్లీ, జూన్ 6: ప్రభుత్వరంగ విద్యుదుత్పాదక దిగ్గజం ఎన్‌టిపిసి.. ఈ ఆర్థిక సంవత్సరం (2016-17)లో దాదాపు 20,000 కోట్ల రూపాయల నిధులను సమీకరించాలని భావిస్తోంది. ఈ మేరకు ఇక్కడ ఎన్‌టిపిసి ఆర్థిక విభాగం డైరెక్టర్ కులమని బిస్వాల్ సోమవారం విలేఖరులకు తెలిపారు. విదేశీ బాండ్ల మార్కెట్ నుంచి 6,000 కోట్ల రూపాయలు, దేశీయ మార్కెట్ నుంచి 14,000 కోట్ల రూపాయల నిధులను రాబట్టాలని చూస్తున్నట్లు చెప్పారు. దేశీయ మార్కెట్ నుంచి బ్యాంక్ రుణాల కోసం వెళ్తామన్నారు.

Pages