S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పారిశ్రామికవేత్తలుగా గిరిజన మహిళలకు శిక్షణ

హైదరాబాద్, జూన్ 6: గిరిజన మహిళలను పారిశ్రామిక వేత్తలుగా తీర్చి దిద్దేందుకు ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టినట్టు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి చందూలాల్ తెలిపారు. ఔత్సాహిక గిరిజన పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహించేందుకు ప్రైవేటు భాగస్వామ్యాన్ని ఆహ్వానిస్తున్నట్టు చెప్పారు. యునైటెడ్ నేషన్స్ డెవలప్‌మెంట్ ప్రోగ్రాం (యున్‌డిపి)తో ఈ మేరకు ఒప్పందం కుదుర్చుకున్నారు. సచివాలయంలో సోమవారం గిరిజనాభివృద్ధి అధికారులు, యుఎన్‌డిపి అధికారుల మధ్య ఒప్పందం కుదిరి, పరస్పరం ఒప్పంద పత్రాలను అందజేసుకున్నారు.

పిఎస్‌ఎల్‌వి-సి 34 ప్రయోగంపై నేడు షార్‌లో ఎంఆర్‌ఆర్ సమావేశం

సూళ్లూరుపేట, జూన్ 6: భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రం సతీష్ థావన్ స్పేస్ సెంటర్ షార్ కేంద్రం నుండి ఈనెల 20వ తేదీన ప్రయోగించే పిఎస్‌ఎల్‌వి-సి 34 ప్రయోగానికి సంబంధించిన మిషన్ రెడీనెస్ రివ్యూ సమావేశం (ఎంఆర్‌ఆర్) మంగళవారం షార్‌లో జరగనుంది. ఇప్పటికే ఈ ప్రయోగానికి సంబంధించిన మూడు దశల రాకెట్ అనుసంధాన పనులు షార్‌లో శాస్తవ్రేత్తలు పూర్తిచేశారు. ఈ రాకెట్ ద్వారా మన దేశానికి చెందిన 690 కిలోల బరువు గల కార్టోశాట్-2సి ఉపగ్రహంతోపాటు మరో 21 ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రవేశపెట్టనున్నారు. ఒకేసారి 22 ఉపగ్రహాలను పిఎస్‌ఎల్‌వి వాహక నౌక ద్వారా అంతరిక్షంలోకి పంపనున్నారు.

డబుల్ డెక్కర్ రైళ్లు రద్దు

హైదరాబాద్, జూన్ 6: కాచిగూడ-గుంటూరు, కాచిగూడ-తిరుపతి డబుల్ డెక్కర్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను రద్దు చేస్తున్నట్టు దక్షిణ మధ్య రైల్వే ఒక ప్రకటనలో తెలిపింది. ఈ నెల 12 నుంచి 30 వరకు రూట్ ట్రయల్స్, మరమ్మతుల కారణంగా డబుల్ డెక్కర్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను రద్దు చేస్తున్నట్టు దక్షిణ మధ్య రైల్వే సిపిఆర్వో ఎం ఉమాశంకర్ కుమార్ పేర్కొన్నారు. రద్దయిన రైళ్లలో ట్రైన్ నెం. 22118 కాచిగూడ-గుంటూరు, ట్రైన్ నెం. 22117 గుంటూరు-కాచిగూడ, ట్రైన్ నెం. 22120 కాచిగూడ-తిరుపతి, ట్రైన్ నెం. 2219 తిరుపతి-కాచిగూడ డబుల్ డెక్కర్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు ఉన్నాయి.

జూనియర్ ఆర్టిస్టు కిడ్నాప్

హైదరాబాద్, జూన్ 6: జూనియర్ ఆర్టిస్టు కిడ్నాప్‌కు గురైన సంఘటన కలకలం రేపింది. ఆలస్యంగా వెలుగుచూసిన సంఘటన హైదరాబాద్ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. జూబ్లీహిల్స్ సిఐ వెంకటరెడ్డి కథనం ప్రకారం వివరాలిలావున్నాయి. కృష్ణానగర్‌లో నివాసముంటున్న జూనియర్ ఆర్టిస్టు శ్రీనివాసరావు (48) గత కొంతకాలంగా గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచార గృహాన్ని నడుపుతున్నాడంటూ భయపెట్టి, తాము పోలీసులం, జర్నలిస్టులం అంటూ బెదిరించి గతనెల 31వ తేదీన కొందరు గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారు. రూ. 2 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేయడంతోపాటు డబ్బులివ్వకుంటే హతమార్చుతామని కూడా భయపెట్టారు.

నిఖిల్ రెడ్డి తండ్రికి టి మెడికల్ కౌన్సిల్ లేఖ

హైదరాబాద్, జూన్ 6: ఎత్తు పెరగడం కోసం గ్లోబల్ ఆస్పత్రిలో ఆపరేషన్ చేయించుకున్న నిఖిల్ రెడ్డి తండ్రి గోవర్ధన్‌రెడ్డికి తెలంగాణ మెడికల్ కౌన్సిల్ లేఖ రాసింది. గోవర్ధన్‌రెడ్డి ఫిర్యాదును ఎథిక్స్ కమిటీ పరిగణలోకి తీసుకుంది. నిఖిల్ పరిస్థితిపై తెలంగాణ మెడికల్ కౌన్సిల్ వివరణ కోరింది.

కళానికేతన్ ఎండి అరెస్టు

హైదరాబాద్, జూన్ 6: కళానికేతన్ మేనేజింగ్ డైరెక్టర్ లక్ష్మీశారదను పోలీసులు అరెస్టు చేశారు. ధర్మవరం చేనేత కార్మికుల నుంచి వస్త్రాలు కొనుగోలు చేసి డబ్బులివ్వలేదని ధర్మవరం పోలీసులకు కార్మికులు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సోమవారం రాత్రి హైదరాబాద్ ఫిల్మ్‌నగర్‌లోని ఆమె నివాసంలో ఆమెను అరెస్టు చేశారు. కేసు దర్యాప్తులో ఉందని ధర్మవరం ఎస్‌ఐ సునిత తెలిపారు.

మధుర కలెక్టర్‌ బదిలీ

లక్నో, జూన్ 6: ఘర్షణలతో అట్టుడుకుతున్న ఉత్తరప్రదేశ్‌లోని మధురలో ఆ జిల్లా కలెక్టర్‌తోపాటు సీనియర్ పోలీసు సూపరింటెండెంట్ (ఎస్‌ఎస్‌పి)పై బదిలీ వేటు పడింది. మధురలోని జవహర్‌బాగ్‌లో నాలుగు రోజుల క్రితం హింసాత్మక ఘర్షణలు చెలరేగి ఇద్దరు పోలీసులు సహా 29 మంది మృతిచెందగా, అనేకమంది గాయపడిన విషయం తెలిసిందే. దీంతో మధుర జిల్లా కలెక్టర్‌ను, ఎస్‌ఎస్‌పిని బదిలీ చేశామని, వీరి స్థానంలో కొత్త అధికారులు త్వరలోనే విధుల్లో చేరుతారని ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ నేతృత్వంలోని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం సోమవారం ప్రకటించింది.

ఆగిరిపల్లిలో తీవ్ర ఉద్రిక్తత

నూజివీడు, జూన్ 6: ఆగిరిపల్లి ఎస్‌ఐ రాజేంద్రప్రసాద్, కానిస్టేబుళ్ళపై తెలుగుతమ్ముళ్ళ దాడి సంఘటనతో ఆగిరిపల్లి గ్రామంలో ఉద్రిక్త పరిస్ధితులు నెలకొన్నాయి. దళితరత్న అవార్డు గ్రహీత, మంత్రి రావెల కిషోర్‌బాబు, దేశం నేత ముత్తంశెట్టి కృష్ణారావు అనుచరుడు పాలేటి మహేశ్వరరావు తో పాటు అతని అనుచరులు ఎస్‌ఐ రాజేంద్రప్రసాద్‌పై సోమవారం ఉదయం దాడి చేశారు. దాడిలో అడ్డుగా వచ్చిన కానిస్టేబుళ్ళలకు గాయాలు అయ్యాయి. ఈ సంఘటనతో ఆగిరిపల్లి గ్రామంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.

డెమోక్రటిక్ నామినేషన్‌కు అడుగు దూరంలో హిల్లరీ

లాస్ ఏంజెలిస్, జూన్ 6: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్ పార్టీ తరఫున ఆ దేశ విదేశాంగ మంత్రి హిల్లరీ క్లింటన్ పోటీ చేయడం దాదాపుగా ఖాయమైపోయింది. కాలిఫోర్నియాలో కీలక ప్రైమరీ ఎన్నికలకు ముందు జరిగిన రెండు ప్రైమరీల్లో హిల్లరీ క్లింటన్ తన ప్రత్యర్ధి బెర్నీ శాండర్స్‌ను ఓడించారు. ప్యూర్టోరికోతో పాటు వర్జిన్ ఐలెండ్స్‌లో జరిగిన ఈ ప్రైమరీల్లో శాండర్స్‌పై హిల్లరీ ఘన విజయం సాధించారు. దీంతో ఆమె అధ్యక్ష ఎన్నికలకు డెమోక్రటిక్ పార్టీ అభ్యర్ధిగా నామినేషన్‌ను కైవసం చేసుకునేందుకు మరో అడుగు దూరంలో నిలిచారు.

33వేల మందితో కృష్ణా పుష్కరాలకు బందోబస్తు

విజయవాడ (క్రైం), జూన్ 6: అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ప్రభుత్వం నిర్వహించ తలపెట్టిన కృష్ణా పుష్కరాలకు పోలీసుశాఖ అసాధారణ భద్రత ఏర్పాట్లు చేపడుతోంది. దీనిలో భాగంగా 33వేల మంది అధికారులు, సిబ్బందిని బందోబస్తు విధులకు వినియోగించనుంది. ఇందుకోసం పొరుగురాష్ట్రాల నుంచి అదనపు బలగాలు రప్పించడంతోపాటు, కేంద్ర బలగాల కోసం హోంశాఖకు విఙ్ఞప్తి చేస్తోంది. పూర్తిగా సాంకేతిక పరిఙ్ఞనాన్ని వినియోగించుకుంటూ నిఘా కోసం 1400 సిసి కెమేరాలతో నిఘా ఏర్పాట్లు చేస్తున్నట్లు రాష్ట్ర పోలీసు చీఫ్ డిజిపి జాస్తి వెంకట రాముడు తెలిపారు.

Pages