S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిన్న పరిశ్రమలకు ప్రోత్సాహం

విజయవాడ (స్పోర్ట్స్), జూన్ 6: చిన్న పరిశ్రమలకు ప్రభుత్వం ప్రోత్సాహాన్నిస్తోందని పరిశ్రమల స్థాపనకు 14 రోజుల్లో ఆన్‌లైన్‌లో అనుమతులిస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు తెలిపారు. నవనిర్మాణ దీక్ష వారోత్సవాల్లో భాగంగా సోమవారం ఎ కనె్వన్షన్ సెంటర్‌లో పరిశ్రమలు, సేవా రంగం రెగ్యులేటరీ, సెక్టార్‌లో ప్రగతి, భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికపై ఆయా శాఖలకు సంబంధించిన అధికారులు రెండేళ్లలో ప్రభుత్వం సాధించిన ప్రగతి, భవిష్యత్ ప్రణాళికపై కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ అభివృద్ధికి మూలాలు గ్రామాలేనని, గ్రామాలు అభివృద్ధి జరిగినప్పుడే దేశాభివృద్ధి జరుగుతుందన్నారు.

ప్రయాణికుల సౌకర్యాల కల్పనలో ఆర్టీసీ ముందంజ

విజయవాడ (స్పోర్ట్స్), జూన్ 6: ప్రయాణికుల సౌకర్యాల కల్పనలో అత్యున్నతస్థాయి ప్రమాణాలతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ముందంజలో ఉందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అన్నారు. నగరంలోని పండిట్ నెహ్రూ బస్‌స్టేషన్‌లో సోమవారం ఎన్టీఆర్ పరిపాలనా భవనం సిటీబస్ పోర్ట్, వైస్క్రీన్స్‌లను ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధునాతన సౌకర్యాలకు తోడు సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడించి అత్యుత్తమ పద్ధతుల ద్వారా ప్రయాణికులకు సేవలందించడం ప్రశంసనీయమన్నారు. బస్‌స్టేషన్లను ఎయిర్‌పోర్ట్‌ల మాదిరిగా ఆధునీకరించడం మంచి పరిణామమన్నారు.

భారత్‌పై దాడులకు పాకిస్తాన్ సిద్ధం

ఇస్లామాబాద్, జూన్ 6: పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తున్న జమాత్ ఉద్ దవా (జెయుడి) ఉగ్రవాద సంస్థ అధినేత, కరడుగట్టిన ఉగ్రవాది హఫీజ్ సరుూద్ మరోసారి భారత్‌ను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశాడు. భారత్ పాకిస్తాన్‌పై దాడికి దిగితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవలసి వస్తుందని అతను హెచ్చరించాడు. ‘్భరత గడ్డ మీది నుంచి పాకిస్తాన్‌పైకి ద్రోన్ దాడులు జరిగితే, మొత్తం భారతదేశం మీద దాడి చేసేందుకు అవసరమైన ద్రోన్లు మా వద్ద ఉన్నాయి’ అని హఫీజ్ సరుూద్ ఇటీవల పాకిస్తాన్‌లో నిర్వహించిన ఒక ర్యాలీలో మాట్లాడుతూ వ్యాఖ్యానించినట్లు ఒక టివి న్యూస్ చానల్ తెలిపింది.

భారత్‌తో చర్చలకు పాకులాడటం లేదు: పాక్

ఇస్లామాబాద్, జూన్ 6: పాకిస్తాన్‌తో సుహృద్భావ చర్చల ప్రక్రియ క్రమంగా మూసుకుపోతోందని, ఇందుకు ఎలాంటి సానుకూలత లేదంటూ భారత రక్షణ మంత్రి మనోహర్ పారికర్ చేసిన ప్రకటనపై పాకిస్తాన్ ప్రధాని విదేశాంగ వ్యవహారాల సలహాదారు సర్తాజ్ అజీజ్ తీవ్రంగా స్పందించారు. భారత్‌తో చర్చలు జరపాలని తామెంత మాత్రం పాకులాడటం లేదని, చివరి క్షణంలో ఏదో సాకుతో తప్పించుకుంటున్నది ఆ దేశమేనని స్పష్టం చేశారు. గత ఏడాది డిసెంబర్ 9న భారత్-పాక్ చర్చలకు సిద్ధమైన వేళ పఠాన్‌కోట్ సంఘటన జరగడంతో మొత్తం వ్యవహారం మొదటికి వచ్చిందని సర్తాజ్ అజీజ్ పేర్కొన్నారు.

జరిమానా చెల్లించిన ఆర్ట్ ఆఫ్ లివింగ్

న్యూఢిల్లీ, జూన్ 6: ఢిల్లీలోని యమునా నడి ఒడ్డున నిర్వహించిన ఒక అంతర్జాతీయ కార్యక్రమంలో అక్కడ జీవవైవిధ్యానికి నష్టం కలిగిందన్న ఆరోపణల నేపథ్యంలో పరిహారంగా మిగిలిన నాలుగు కోట్ల 75లక్షల రూపాయలను ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్ చెల్లించింది. జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్‌జిటి) ఆదేశం మేరకు ఈ మొత్తాన్ని ఢిల్లీ అభివృద్ధి అథారిటీ (డిడిఏ) వద్ద డిపాజిట్ చేసింది. మార్చి నెలలో యమునా నది ఒడ్డున ప్రపంచ సాంస్కృతిక ఉత్సవాన్ని శ్రీశ్రీ రవిశంకర్ సారథ్యంలోని ఆర్ట్ ఆఫ్ లివింగ్ నిర్వహించింది.

ఏపిఎన్‌జివోస్ గచ్చిబౌలి హౌసింగ్ సోసైటీ విభజన చేపట్టాలి

హైదరాబాద్, జూన్ 6: ఏపిఎన్‌జీవోస్ గచ్చిబౌలి హౌసింగ్ సోసైటీ విభజన వెంటనే చేపట్టాలని భాగ్యనగర్ టిఎన్‌జివోస్ అసోసియోషన్ అధ్యక్షుడు ఎం.సత్యనారాయణ గౌడ్, కార్యదర్శి పి.బాలరామ్ డిమాండ్ చేశారు. సోమవారం నారాయణగూడలోని అసోసియోషన్ కార్యలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ ఏపిఎన్‌జివోస్ గచ్చిబౌలి హౌసింగ్ సోసైటీని విభజించాలని కోరుతూ తెలంగాణ ప్రాంతానికి చెందిన 1800 మంది ఉద్యోగులు సోసైటీ కార్యదర్శి చంద్రశేఖర్‌రెడ్డికి వినతి పత్రాన్ని అందజేసినట్లు తెలిపారు. డిసిఒ ఏపిఎన్‌జివోస్ గచ్చిబౌలి హౌసింగ్ సోసైటీ అధ్యక్షునిగా గతంలో ఉమ్మడి రాష్ట్రంలో రెండు ప్రాంతాలకు చెందిన ఉద్యోగులు ఉన్నారని తెలిపారు.

దశలవారీగా ఎస్సీ వర్గీకరణకు ఉద్యమం

ఖైరతాబాద్, జూన్ 6: ఎస్సీ వర్గీకరణ సాధించేందుకు దశలవారీగా ఉద్యమిస్తామని ఎస్సీ కార్పోరేషన్ చైర్మన్ పిడమర్తి రవి తెలిపారు. సోమవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో మాదిగ జెఏసి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ ఎ, బి, సి, డి వర్గీకరణ అయ్యేంత వరకు పోరాటం కొనసాగుతూనే ఉంటుందని చెప్పారు. ఏళ్ల తరబడి నానుతున్న ఈ సమస్యను కేంద్రం వెంటనే పరిష్కరించి, మాదిగలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. వర్గీకరణ అవశ్యకతను తెలిపేందుకు జిల్లా, మండల, గ్రామీణ స్థాయిలో సదస్సు నిర్వహించనున్నట్టు తెలిపారు. వర్గీకరణ జరగక పోవడంతో మాదిగ జాతికి తీవ్ర అన్యాయం జరుగుతుందని ఆవేదన చెందారు.

చేప ప్రసాదానికి ప్రత్యేక ఆర్టీసి బస్సులు

అల్వాల్, జూన్ 6: హైదరాబాద్‌లోని ఎగ్జిబిషన్ మైదానంలో ఉబ్బస వ్యాధిగ్రస్తుల కోసం బత్తిని సోదరులు పంపిణీ చేస్తున్న చేప ప్రసాదానికి జూన్ 8, 9 తేదీలలో నగరంలోని ప్రధాన కేంద్రాల నుంచి ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసినట్లు ఆర్టీసీ హైదరాబాద్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎ.పురుషోత్తమ నాయక్ చెప్పారు. సికింద్రబాద్, కాచిగూడ, నాంపల్లి రైల్వే స్టేషన్‌తోపాటు, మహత్మగాంధీ బస్‌స్టేషన్, జూబ్లీ బస్‌స్టేషన్ నుంచి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌కు 46 ప్రత్యేక బస్సులను జూన్ 8న ఏర్పాటు చేశామని వివరించారు. నగర శివారులో నుంచి 32 బస్సులను ఏర్పాటు చేశామని పేర్కొన్నారు.

‘గీత’ దాటడం లేదు

కోల్‌కతా, జూన్ 6: ఈశాన్య రాష్ట్రాల్లో సాయుధ దళాల ప్రత్యేక అధికారాల చట్టం (ఎఎఫ్‌ఎస్‌పిఏ) దుర్వినియోగం అయిన దాఖలాలు లేవని సైన్యం ప్రకటించింది. ఎఎఫ్‌ఎస్‌పిఏ దుర్వినియోగానికి సంబంధించి ఇటీవల ఎక్కడా ఫిర్యాదులు లేవని స్పష్టం చేశారు. ఈస్ట్రన్ కమాండెంట్ దీనిపై మాట్లాడారు. చట్టం సమర్థవంతంగానే అమలవుతోందని, దుర్వినియోగం అవుతున్న సంఘటన ఎక్కడా ఒక్కటి కూడా లేదని ఈస్ట్రన్ ఆర్మీ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ ప్రవీణ్ భక్షి తెలిపారు. మిలిటెన్సీని అదుపుచేసే క్రమంలో అవసరమైతేనే ఎఎఫ్‌ఎస్‌పిఏ అవసరం తమకు కలుగుతోందితప్ప మిగతా సమయాల్లో దాన్ని వాడుకోవవడం లేదని ఆయన అన్నారు.

ప్రభుత్వ పథకాలను వికలాంగులు సద్వినియోగం చేసుకోవాలి

హైదరాబాద్, జూన్ 6: ప్రభుత్వం అందజేస్తున్న పథకాలను వికలాంగులు సద్వినియోగం చేసుకుని అభివృద్ధి చెందాలని హైదరాబాద్ జాయింట్ కలెక్టర్ భారతి హోళీకేరి సూచించారు. నాంపల్లిలోని హైదరాబాద్ కలెక్టర్ కార్యాలయంలో సోమవారం జరిగిన మీకోసం కార్యక్రమంలో విభిన్న ప్రతిభ గల వికలాంగులకు లాప్‌టాప్‌లను, వినికిడి యంత్రాలను, మూడు చక్రాల మోటారు వాహానాలను వికలాంగుల సంక్షేమం శాఖ ద్వారా లబ్దిదారులకు అమె అందజేశారు.

Pages