S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రూ.10 లక్షలు విలువైన గుట్కా ప్యాకెట్లు స్వాధీనం

మచిలీపట్నం, జూన్ 6: అక్రమంగా నిల్వ చేసిన గుట్కా ప్యాకెట్లపై విజిలెన్స్ అధికారులు సోమవారం దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో రూ.10లక్షలు విలువ చేసే గుట్కా ప్యాకెట్లను సీజ్ చేశారు. పెద్ద ఎత్తున గుట్కా ప్యాకెట్లు నిల్వ చేసిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. స్థానిక బెల్లంకొట్ల సందులో గిల్లి కిషోర్ అనే వ్యక్తి గత కొంత కాలంగా పట్టణంలోని బడ్డీ కొట్లకు అక్రమంగా గుట్కా ప్యాకెట్లను సరఫరా చేస్తున్నారు. అందిన సమాచారం మేరకు దాడి చేసినట్లు విజిలెన్స్ డియస్‌పి ఆర్ విజయపాల్ తెలిపారు.

లోటు బడ్జెట్‌లో ఉన్న రాష్ట్రానికి చంద్రబాబు ఆలోచనలే పెట్టుబడి

గుడివాడ, జూన్ 6: లోటు బడ్జెట్‌లో ఉన్న రాష్ట్రానికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆలోచనలే పెట్టుబడి అని రాష్ట్ర వ్యవసాయశాఖా మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. సోమవారం స్థానిక పిన్నమనేని కళ్యాణ మండపంలో వ్యవసాయం, పారిశ్రామికాభివృద్ధిపై జరిగిన అవగాహన సదస్సుకు ఆయన ముఖ్యఅతిథిగా విచ్చేసి మాట్లాడారు. రాష్ట్ర సమగ్రాభివృద్ధే ప్రభుత్వ ధ్యేయమన్నారు. వ్యవసాయానికి సంబంధించి ఎరువుల ధరలు పెరగకుండా, కొరత లేకుండా చేశామన్నారు. వచ్చే సార్వా సీజన్‌ను దృష్టిలో పెట్టుకుని 8.90లక్షల క్వింటాళ్ళ విత్తనాలను, 8.50లక్షల క్వింటాళ్ళ ఎరువులను సిద్ధం చేశామన్నారు.

ఇక ఇంటింటికీ ఇంటర్నెట్

విజయవాడ, జూన్ 6: ప్రభుత్వ కార్యక్రమాల్లో ప్రజల భాగస్వామ్యం రోజురోజుకూ పెరుగుతోందని, ఇది హర్షణీయమని ఆంధ్రప్రదేశ్ సిఎం చంద్రబాబు నాయుడు అన్నారు. సోమవారం తన నివాసం నుంచి ప్రభుత్వ యంత్రాంగంతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం అమలుచేసే అభివృద్ధి, సంక్షేమ పథకాల పూర్తి సమాచారం ప్రతి గ్రామ పంచాయతీలో అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. ఫైబర్ గ్రిడ్ ద్వారా ప్రతి ఇంటికీ ఇంటర్నెట్ వచ్చే సమయం చాలా దగ్గరలోనే ఉందన్నారు. ఇదే సమయంలో ప్రతి మహిళా ఇ-లిటరేట్ కావాలని కోరారు. రాష్ట్రంలో ఇది ఒక విప్లవమని చెప్పారు.

రుతుపవనాల కదలికకు అనుకూలం

విశాఖపట్నం, జూన్ 6: నైరుతి రుతుపవనాల కదలిక ఆశాజనకంగా ఉంది. అన్నీ అనుకూలిస్తే మరో 24 గంటల తర్వాత రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనావేస్తోంది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశాను ఆనుకుని ఏర్పడిన ఉపరితల ఆవర్తనం స్థిరంగా కొనసాగుతోందని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు సోమవారం రాత్రి వెల్లడించారు. దీని ప్రభావంతో రాగల 24 గంటల్లో కోస్తాంధ్రలో పలు చోట్ల ఒక మోస్తరు వర్షాలు కురిసే అకవాశం ఉందని, కోస్తాలో ఒకటి, రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. రాయసీమ జిల్లాల్లో కూడా చెదురుమదురు వర్షాలు కురుస్తాయి.

‘అమరావతి ఇటుక’కు బేరాలు నిల్!

గుంటూరు, జూన్ 6: ఆంధ్రప్రదేశ్ సిఎం చంద్రబాబు నాయుడు అట్టహాసంగా ప్రారంభించిన ‘నా ఇటుక- నా అమరావతి’కి బేరాలు కరువయ్యాయి. కొత్త రాజధానిలో అందరినీ భాగస్వాములను చేసేందుకు సిఆర్‌డిఎ నేతృత్వంలో గత ఏడాది అక్టోబర్ 15న ‘నా ఇటుక - నా అమరావతి’ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఒక్కో ఇటుకకు 10 రూపాయల చొప్పున వసూలు చేస్తూ ఆన్‌లైన్‌లో కొనుగోలుదారుల వివరాలను సిఆర్‌డిఎ పొందుపర్చింది. కార్యక్రమం ప్రారంభమైన మూడురోజుల్లోనే ఔత్సాహికులు 18 లక్షల ఇటుకలు కొనుగోలు చేశారు. ఎన్నారైలు సైతం ఆన్‌లైన్ ద్వారా ఇటుకలను విరాళంగా అందించేందుకు ముందుకొచ్చారు.

ముందే రిటైర్ చేశారు..

హైదరాబాద్, జూన్ 6: మహానగర పాలక సంస్థలో పరిపాలన రోజురోజుకు గాడితప్పుతోంది. ఎవరుపడితే వారు ఆయా రాం.. గయా రాం అన్నట్టు తయారైంది పరిస్థితి. రెగ్యులర్, కాంట్రాక్టు, ఔట్‌సోర్సు ప్రాతిపదికన పనిచేసే ఉద్యోగులు, కార్మికుల జీతభత్యాలు మొదలుకుని ఇతర ప్రయోజనాలు, పదవీ విరమణ వంటి కీలకమైన అంశాలను చూసుకునే పరిపాలన విభాగం ఉన్నతాధికారుల నిర్లక్ష్యం కారణంగా ఓ రెగ్యులర్ ఉద్యోగి పదవీ విరమణ పొందాల్సిన తేదీ కన్నా ముందే రిటైర్ అయ్యారు. నెల నెలా రావల్సిన జీతం రాకపోవటంతో ఆందోళనకు గురైన స్వీపర్ రాములమ్మ సర్కిల్, జోనల్, ప్రధాన కార్యాలయాల చుట్టు తిరిగితే గానీ అసలు విషయం బయటపడలేదు.

గ్లోబల్ ఆసుపత్రిపై చర్య తీసుకోవాలి

హైదరాబాద్, జూన్ 6: గ్లోబల్ ఆసుపత్రిపై చట్ట పరమైన చర్యలు తీసుకోవాలని తెలంగాణ రాష్ట్ర బిజెపి శాసనసభా పక్ష నేత కిషన్‌రెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం సుచిత్ర, ఎంఎన్ రెడ్డినగర్‌లోని నిఖిల్‌రెడ్డిని పరామర్శించారు. శస్త్ర చికిత్సకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. కిషన్‌రెడ్డి మాట్లాడుతూ విద్యార్థి నిఖిల్‌రెడ్డిని రెండు నెలల్లో నడిపిస్తామని మోసపూరిత మాటలు చెప్పి వైద్య వృత్తికే కళంకం తెచ్చిన డాక్టర్ల గురించి ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి ఆపరేషన్ చేసిన డాక్టర్ పట్టాని రద్దు చేసేలా చర్యలు చేపట్టి కుటుంబానికి నష్టపరిహారం చెల్లించేలా కృషి చేస్తామని అన్నారు.

భావ స్వేచ్ఛకు మతోన్మాద ముప్పు

హైదరాబాద్, జూన్ 6: దేశ సమైక్యత భావస్వేచ్ఛకు మతోన్మాదం వల్ల ముప్పు వాటిల్లే ప్రమాదముందని, దీన్నుంచి దేశాన్ని కాపాడుకోవాలని మాజీ కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి పిలుపునిచ్చారు. మతోన్మాదుల ఆట కట్టించేదుకు ప్రగతిశీల దేశంగా భారత్‌ను పరిరక్షించుకోవాలన్నారు. సోమవారం బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో సిఆర్ ఫౌండేషన్ అధ్వర్యంలో చండ్ర రాజేశ్వరరావు102 జయంతి సందర్భంగా జరిగిన సభలో ఆయన మాట్లాడారు. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన జైపాల్ రెడ్డి మాట్లాడుతూ దేశం ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటున్నప్పటికీ మతోన్మాదం వల్ల మరింత ప్రమాదంలో పడిందన్నారు.

కొండ నాలుకకు మందేస్తే!

రాజమహేంద్రవరం, జూన్ 6: రాష్ట్రంలో భూ రికార్డుల ఆధునికీకరణ వ్యవహరం ‘కొండ నాలుకకు మందేస్తే’ అన్న చందంగా మారిపోయింది. రాష్టవ్య్రాప్తంగా ఉన్న అన్ని రకాల భూ రికార్డుల వెబ్‌ల్యాండ్ తయారీకి ప్రభుత్వం చర్యలు తీసుకున్న నేపథ్యంలో దశాబ్దాల నాటి సర్వే నెంబర్లు మారిపోయి, రిజిస్ట్రేషన్ల సమయంలో తలనొప్పులు మొదలయ్యాయి. రాష్ట్రంలో 2012-13లోనే భూ రికార్డులు కంప్యూటరీకరించారు. అయితే అప్పట్లో ఎటువంటి సమస్యలు తలెత్తలేదు. తాజాగా వెబ్‌ల్యాండ్ పేరుతో సాఫ్ట్‌వేర్‌కు అనుసంధానం చేసిన తర్వాత భూ రికార్డులు తీవ్ర గందరగోళంగా మారాయి. వివరాలన్నీ తప్పుల తడకగా మారాయి.

‘అగ్రోహ’ బ్యాంకులో అవకతవకలు

హైదరాబాద్, జూన్ 6: నగరంలోని ‘అగ్రోహ’ సహకార పట్టణ బ్యాంకు లిమిటెడ్‌కు భారతీయ రిజర్వ్ బ్యాంకు (ఆర్‌బిఐ) లక్ష రూపాయల జరిమానా విధించింది. బ్యాంకింగ్ రెగ్యులేషన్ చట్టం 1949 సెక్షన్-47ఎ (1) (బి)ను అనుసరించి, డెరెక్టర్లకు, వారి బంధువులకు రుణాలు, అడ్వాన్స్‌ల చెల్లింపులలో అవకతవకలను గుర్తించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నామని ఆర్‌బిఐ డిప్యూటీ జనరల్ మేనేజర్ బి. రమేష్ సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇదివరకే అగ్రోహ బ్యాంకుకు నోటీసు జారీ చేయడం జరిగిందని, ఆ బ్యాంకు ఇచ్చిన సమాధానాన్ని పరిశీలించిన తర్వాతే ఈ జరిమానా విధించినట్లు ఆయన తెలిపారు.

Pages