S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అంధుల ‘శ్రీయా’భిలాషి

శ్రీయా అంటే కేవలం సినీనటి అని మాత్రమే అందరికీ తెలుసు. అయితే, ఆమె ఒక సోషల్ ఎంటర్‌ప్రిన్యూర్ అన్న సంగతి చాలామందికి తెలయదు. తాను కాలేజీలో వున్న రోజులలో ఒక అంధ విద్యార్థి ఆమెకు ఇచ్చిన షాక్, ఆమె నేడు సోషల్ ఎంటర్‌ప్రిన్యూర్‌గా మారడానికి కారణమై, ఎందరో అంధులకు జీవనభృతిని కల్పిస్తూన్నారు. ఐదు సంవత్సరాల క్రితం శ్రీయాశరన్ ఢిల్లీలో ‘స్పందన్’ పేరిట ఒక ‘స్పా’ను ఏర్పాటుచేశారు. ప్రస్తుతం సెలబ్రిటీలు వివిధ వ్యాపారాలను నిర్వహిస్తున్న విషయం సర్వవిదితమే. అయితే శ్రీయా మిగిలిన సెలబ్రిటీస్‌కు భిన్నంగా వ్యవహరించడం గమనార్హం.

-పి.హైమావతి

దగ్గరపడిన ముసాయిదా గడువు

హైదరాబాద్, జూన్ 4: కృష్ణా నదీ జలాల యాజమాన్య బోర్డు ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలకు పంపిన ముసాయిదా నోటిఫికేషన్ వివాదస్పదంగా మారింది. ముసాయిదాలోని మార్గదర్శకాలను అంగీకరించే ప్రసక్తిలేదని ముందుగా కేంద్రానికి ఫిర్యాదుచేసి, అవసరమైతే సర్వోన్నత న్యాయస్థానం తలుపులు తట్టాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఆంధ్ర ప్రభుత్వం మాత్రం ముసాయిదా నోటిఫికేషన్‌ను అంగీకరిస్తున్నట్టు ఇప్పటికే బహిరంగంగా ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన ఇరిగేషన్ మంత్రులను, సాగునీటి నిపుణులను ఢిల్లీకి పిలిపించి చర్చించనుంది.

కాలుష్యం కాటు.. గుండెకు చేటు

వాతావరణ కాలుష్యం మనిషి జీవనంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. వాహనాలు, ఫ్యాక్టరీలు వదిలే పొగ గాలిలో కలిసి అది తీవ్ర అనర్థాలకు దారితీస్తోంది. ఈ పొగ కాలుష్యం మనిషిలో అధిక రక్తపోటుకు కారణమవుతోందని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. ఇందుకోసం చైనాలోని గౌంగ్‌డాంగ్ ప్రొవిన్షియల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్‌వారు నిర్వహించిన పదిహేడు అధ్యయనాల్లో ఈ విషయం వెల్లడైంది. కలుషిత గాలిని పీల్చటం వల్ల ఊపిరితిత్తులు ఇన్‌ఫెక్షన్‌కు గురవతుంటాయని తెలుసు. కాని తాజా అధ్యయనాల వల్ల ఇది గుండెకు కూడా చేటు తెస్తుందని వెల్లడైంది. గాలిలోని కార్భన్‌డైఆక్సైడ్, దుమ్మూదూళీ తదితరమైనవి రక్తపోటుకు దారితీస్తున్నాయి.

బోర్డుపై తాడో పేడో

హైదరాబాద్, జూన్ 4: కృష్ణా నదీ యాజమాన్య బోర్డు ఏకపక్షంగా వ్యవహరిస్తూ తెలంగాణ ప్రయోజనాలు దెబ్బతినేలా వ్యవహరిస్తోందని, దీన్ని సీరియస్‌గానే ఎదుర్కోవాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించుకుంది. బోర్డు వ్యవహారంపై రాష్ట్రంలోని బిజెపి మద్దతు పొందేందుకు ప్రయత్నిస్తున్నారు. నగరంలో పర్యటిస్తున్న పార్లమెంటరీ కమిటీ దృష్టికి సైతం కృష్ణా బోర్డు వ్యవహారాన్ని తీసుకెళ్లారు. ఎంపీ హుకుంసింగ్ చైర్మన్‌గా ఉన్న పార్లమెంటరీ కమిటీ హైదరాబాద్‌లోని నోవాటెల్‌లో శనివారం సమావేశమైంది. కృష్ణా, గోదావరి బోర్డుల పనితీరును ఈ బృందం సమీక్షించింది.

ఐడియా

నిమ్మరసంలో కొంచెం ఆవనూనె, కొంచెం కర్పూరం కలిపి ఒంటికి రాసుకుని, గోరువెచ్చని నీళ్లతో స్నానం చేస్తే శరీరఛాయ పెరుగుతుంది.
-అజీర్తితో బాధపడుతుంటే రెండు మూడు చిన్న అల్లం ముక్కలను ఉప్పుతో కలిపి తీసుకోండి.
లెమన్‌గ్రాస్‌కు బదులుగా లెమన్ జెస్ట్ (నిమ్మ చెక్కను పొట్టుగా తురిమితే వస్తుంది)ను వాడుకోవచ్చు.
బొట్టు బిళ్ళలు వాడటం వల్ల ముఖంపై మచ్చపడితే తులసి రసం రాయండి.
విటమిన్ ‘ఏ’తో పాటు శరీరానికి మేలుచేసే యాంటీ ఆక్సిడెంట్లు క్యారెట్‌లో అధికం. ఇవి క్యాన్సర్‌ను నిరోధించడంలో సాయపడతాయి.
*

లాలాజలం తక్కువైతే?

లాలాజలం ఎక్కువైతే దానివల్ల కలిగే బాధలు, చికిత్స కిందటివారం చూసాం. ఇప్పుడు లాలాజలం తక్కువైతే దానివల్ల వచ్చే కష్టాలు ఏంటో చూద్దాం. లాలాజలం తక్కువైతే నోరు ఎండిపోతుంది. కొందరిలో అయితే లాలాజలం అసలు ఉత్పత్తే కాదు. వీరి బ్రతుకులు చాలా భయంకరంగా వుంటాయి. లాలాజలం తక్కువగా వున్నా అసలు లేకపోయినా ఈ క్రింది సమస్యలు ఎదురవుతాయి.
- నోరు ఎండిపోతుంది.
- వీరి పళ్లకి పుచ్చు చాలా తేలికగా వచ్చేస్తుంది.
- నాలిక, గొంతు మండటం.
- మింగడంలో కష్టాలు.
- నోరు పెదాలు పగలడం.
లాలాజలం
తక్కువయ్యే సందర్భాలు

-డాక్టర్ రమేష్ శ్రీరంగం

సర్జరీ చేయకుంటే తరువాత పోస్టుమార్టమే

హైదరాబాద్, జూన్ 4: రాష్ట్ర కాంగ్రెస్‌కు వెంటనే సర్జరీ చేయకపోతే, తరువాత పోస్టుమార్టం చేయాల్సి వస్తుందని ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో పార్టీ పరిస్థితిని చూస్తుంటే గుండె తరుక్కుపోతున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. కోమటిరెడ్డి శనివారం రాష్ట్ర మంత్రి టి. హరీశ్‌రావును కలిసి మంతనాలు జరిపిన అనంతరం అసెంబ్లీ ఆవరణలోని కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ (సిఎల్‌పి) కార్యాలయానికి వచ్చారు. ఈ సందర్భంగా కోమటిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ తాను రాష్ట్ర మంత్రి హరీశ్‌రావుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపేందుకే కలిసానన్నారు.

6.5 వేల కోట్లివ్వాలి

హైదరాబాద్, జూన్ 4: రాష్ట్రంలో పెండింగ్‌లోని సాగునీటి ప్రాజెక్టులను పూర్తికి 6500 కోట్లు మంజూరు చేయాలని తెలంగాణ ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. తెలంగాణ ప్రాజెక్టులపై కేంద్ర జలవనరుల పార్లమెంటరీ సభ్యుల బృందం శనివారం హైదరాబాద్‌లో సమావేశమైంది. తెలంగాణ విజ్ఞప్తిపై పార్లమెంటరీ బృందం సానుకూలంగా స్పందించింది. కేంద్రానికి ఈ అంశంపై తాము నివేదిక ఇస్తామని కమిటీ చైర్మన్ హుకుంసింగ్ హామీనిచ్చారు. సత్వర సాగునీటి ప్రయోజనాల పథకం (ఎఐబిపి) కింద 2,155 కోట్లు ఇవ్వాలని, నాబార్డు నుంచి 4280 కోట్లు మంజూరు చేయాలని తెలంగాణ ప్రభుత్వం కోరింది.

భవిష్య కాలం

షణ్ముఖప్రియ, కీరపండరీపురం (కృష్ణా)
ప్ర: మీరు నా పేరు కలం పేరుగా షణ్ముఖప్రియగా సూచించారు. అదే పేరుతో వ్యవహరిస్తున్నాను. ఆ పేరుతో కొన్ని బహుమతులు కూడా గెలుచుకున్నాను. గృహ సమస్యలు తీరేందుకు సులభమైన ఉపాయం చెప్పండి.
సమా: గృహ సమస్యలు తీరడానికి సులభోపాయం శ్రీమత్ భగవద్గీతా పారాయణం.
ఎమ్.సుదర్శనాబాయి, మనదనపల్లి (చిత్తూరు)
ప్ర: నా జీవితంలో చాలా విషయాలు మీరు చెప్పినట్లుగానే జరుగుతున్నాయి. నా కలం పేరు ‘దీపశ్రీ’గా మార్చుకున్నాను. చిన్న చిన్న పత్రికల్లో పడుతున్నాయి నా కథలు. ప్రముఖ పత్రికల్లో రావటంలేదు.

‘దివ్యజ్ఞాన విభూషణ’ ఉమాపతి బి.శర్మ

పరస్పర సహకారం

హైదరాబాద్, జూన్ 4: వివిధ రంగాల్లో పరస్పర సహకారం కోసం టి-హబ్ కాలిఫోర్నియా రాష్ట్రం ఎంఓయు కుదుర్చుకున్నాయి. ఈ అంశంపై కాలిఫోర్నియాతో గతంలోనే ఐటి మంత్రి కె తారక రామారావు ప్రాథమికంగా చర్చలు జరిపారు. అమెరికా పర్యటనలో ఉన్న కెటిఆర్ కాలిఫోర్నియా ప్రభుత్వంతో ఈమేరకు ఒప్పందం కుదుర్చుకున్నారు. కెటిఆర్ నాయకత్వంలోని బృందం, కాలిఫోర్నియ గవర్నర్ ఆఫీసు ఈమేరకు ఒప్పందం కుదుర్చుకున్నాయి. ప్రత్యామ్నాయ ఇంధనం, ఎన్విరాన్‌మెంటల్ టెక్నాలజీ, ఆరోగ్యం, వ్యవసాయం, టెక్నాలజీ ఆధారిత పరిశ్రమలు, రిసెర్చ్, డెవలప్‌మెంట్ తదితర అంశాల్లో పరస్పరం సహకరించుకుంటారు. ఈ ఒప్పందాల వల్ల పరస్పరం ప్రయోజనం పొందుతామని కెటిఆర్ చెప్పారు.

Pages