S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మూడు రోజులపాటు వానలే వానలు!

హైదరాబాద్, జూన్ 4: తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాలను మూడు రోజులపాటు జడివానలు ముంచెత్తనున్నాయి. రాగల 72 గంటలపాటు ఉరుములు, మెరుపులతో కూడిన వడగళ్ల వర్షం కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండి) ప్రకటించింది. కోస్తాంధ్రలో భారీ వర్షాలు ఉంటాయని ఐఎండి శాస్తవ్రేత్త ‘ఎఫ్’ (ఎన్‌డబ్ల్యుఎప్‌సి) డాక్టర్ రంజీత్ సింగ్ వెల్లడించారు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఇక వేడిగాడ్పులేమీ ఉండవన్నారు. బంగాళాఖాతం, దక్షిణ ఒడిశా నుండి ఏపీ తెలంగాణ మీదుగా తమిళనాడు వరకు ఉపరితలద్రోణి ఏర్పడి ఉందని, ఇది స్థిరంగా కొనసాగుతోందని వివరించారు.

లోకేష్‌కు లైన్ క్లియర్!

హైదరాబాద్, జూన్ 4: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనయుడు లోకేష్‌కు రూట్ క్లియరయింది. లోకేష్ చేరికపై బాబు పరోక్షంగా గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడంతో ఇక ఆయన క్యాబినెట్‌లో చేరడమే తరువాయి అని పార్టీ నేతలు చెబుతున్నారు. గత రెండు రోజుల నుంచి బాబు వివిధ చానెళ్లు, పత్రికలకు ఇంటర్వ్యూలు ఇస్తున్న విషయం తెలిసిందే. ఆ సందర్భంగా లోకేష్ రాజకీయ భవితవ్యం గురించి ప్రశ్నలు అడిగినప్పుడు ఇంకా సమయం ఉంది కదా? మీకు తెలియకుండా చేయనుకదా? అని వ్యాఖ్యానిస్తూ వచ్చారు. కానీ ‘ఆంధ్రభూమి’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాత్రం లోకేష్‌ను మంత్రిగా చూడటంలో తప్పేమిటి? అతను పార్టీ కోసం కష్టపడుతున్నాడు.

హద్దు లేనిది.. మన ఫ్రెండ్‌షిప్

హెరత్, జూన్ 4: ఎన్ని అడ్డంకులు ఎదురైనా భారతదేశం అఫ్గానిస్థాన్‌లోని అన్ని ప్రాంతాలకూ సహాయాన్ని కొనసాగిస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. శనివారం అఫ్గాన్ అధ్యక్షుడు అష్రాఫ్ ఘనీతో కలిసి అఫ్గాన్- ఇండియా ఫ్రెండ్‌షిప్ డ్యామ్ ప్రారంభించారు. ఇంతకుముందు సల్మా డ్యామ్‌గా పిలిచే ఈ డ్యామ్‌ను ఇరాన్‌ను ఆనుకుని ఉన్న హెరత్ రాష్ట్రంలోని చిస్త్-ఎ-షరీఫ్ వద్ద హరిరుద్ నదిపై భారత్ 1700 కోట్ల వ్యయంతో నిర్మించింది. ఈ డ్యామ్ ద్వారా 75 వేల ఎకరాలకు సాగు నీరు అందడంతోపాటుగా 42 మెగావాట్ల విద్యుదుత్పత్తి అవుతుంది. రాష్ట్రంలోని అనేక ప్రాంతాలకు తాగునీటి సౌకర్యం లభిస్తుంది.

‘అజేయుడు’ ఇక లేడు

లాస్ ఏంజిలిస్, జూన్ 4: ప్రపంచ హెవీవెయిట్ బాక్సింగ్ మాజీ చాంపియన్, ‘అజేయుడు’ మహమ్మద్ అలీ దీర్ఘకాల అనారోగ్యంతో మృతి చెందాడు. అతని మృతి వార్త ప్రపంచ క్రీడా రంగాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. 32ఏళ్లు పార్కిన్సన్స్ వ్యాధితో బాధపడిన 74ఏళ్ల అలీ తీవ్ర అస్వస్థతకు గురికావడంతో గత రాత్రి ఆస్పత్రిలో చేర్చారు. చికిత్స పొందుతూ ఆసుపత్రిలోనే కన్నుమూసినట్టు కుటుంబీకులు ప్రకటించారు. బాక్సింగ్ చరిత్రలోనే అత్యుత్తమ ఫైటర్ల జాబితాలో అలీది అగ్రస్థానం. అంతులేని ఆత్మవిశ్వాసానికి, లక్ష్యాన్ని సాధించే వరకూ విశ్రమించని పట్టుదలకు మారుపేరైన అలీ అమెరికాలో జాతి వివక్షకు వ్యతిరేకంగా పోరాడాడు.

ప్రజా స్పందన భేష్!

విజయవాడ, జూన్ 4: రెండేళ్ల తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో సాధించిన అభివృద్ధి, సంక్షేమ ఫలాలు అన్ని వర్గాలకు అందుతున్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. సంక్షేమ పథకాల అమలులో అధికారుల కృషి అభినందనీయమన్నారు. రాష్ట్ర ప్రజల నుండి 90శాతం సంతృప్తికర స్పందన వస్తోందన్నారు. శనివారం ఆయన తన నివాస గృహం ఉండవల్లి నుండి ప్రజాప్రతినిధులు, అధికార యంత్రాంగంతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. నవనిర్మాణ దీక్ష సందర్భంలో సంక్షేమ, అభివృద్ధిపై వారినుంచి లభిస్తున్న స్పందనతో మరింత ఉత్సాహంగా అధికారులు పని చేయాలని సూచించారు.

ఏపీలో పెట్రో కెమికల్ కాంప్లెక్స్

రాజమహేంద్రవరం, జూన్ 4: కెజి బేసిన్ పరిధిలో రూ.30వేల కోట్ల పెట్టుబడితో కొత్తగా పెట్రో కెమికల్ కాంప్లెక్స్‌ను ఏర్పాటుచేస్తున్నట్టు కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు. ఎన్‌డియే రెండేళ్ల పాలన నేపథ్యంలో బిజెపి చేపట్టిన పథకాలను ప్రజలకు వివరించేందుకు కేంద్ర మంత్రులు చేపట్టిన పర్యటనలో భాగంగా తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం వచ్చిన మంత్రి ధరేంద్ర ప్రధాన్ శనివారం విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. కెజి బేసిన్ కార్యాలయాన్ని రాజమహేంద్రవరానికి తరలించే అంశాన్ని పరిశీలిస్తున్నామన్నారు. విశాఖలో హెచ్‌పిసిఎల్ పెట్రో కాంప్లెక్సును రూ.20వేల కోట్లతో విస్తరిస్తున్నామని చెప్పారు.

కర్నాటక బస్సుకు తప్పిన ప్రమాదం

కర్నూలు/ఆదోని, జూన్ 4: కర్నూలు జిల్లాలో శనివారం ఉదయం కర్నాటక రోడ్డు రవాణా సంస్థ బస్సుకు పెనుప్రమాదం తప్పింది. హంద్రీనది వరదలో చిక్కుకున్న బస్సు ప్రయాణికులను సమీప గ్రామస్థులు సురక్షితంగా బయటకు తీసుకురావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. మరో సంఘటనలో కల్లేవంక వాగులో జొన్నల లారీ బోల్తా పడడంతో అందులోని ముగ్గురిని పోలీసులు రక్షించారు. శనివారం తెల్లవారుజామున జిల్లాలో భారీవర్షం కురిసింది. దీంతో వాగులు, వంకలు పొంగిపొర్లాయి. పత్తికొండ మండలం చిన్నహుల్తి గ్రామం వద్ద హంద్రీనదికి వరద పోటెత్తింది. వరదనీరు వంతెన మీదుగా ప్రవహించడంతో ఇరువైపుల వాహనాలు బారులుతీరాయి.

‘జోన్’ మర్చిపోలేదు

విజయవాడ, జూన్ 4: ఆంధ్రప్రదేశ్‌కు రైల్వే జోన్ పరిశీలనలో ఉందని రైల్వే మంత్రి సురేష్ ప్రభు చెప్పారు. ఎపి నుంచి రాజ్యసభ సభ్యునిగా ఎన్నికైన ప్రభు శనివారం విజయవాడకు చేరుకుని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని ఆయన క్యాంపు కార్యాలయంలో కలుసుకున్నారు. ఎపి నుంచి టిక్కెట్ ఇచ్చి గెలిపించినందుకు చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు. ఆ తరువాత రైల్వే అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, సురేష్ ప్రభు, కేంద్ర మంత్రి సుజనా చౌదరి, మంత్రులు కామినేని శ్రీనివాస్, పుల్లారావు, ఎంపీ నాని తదితరులు సమావేశమయ్యారు. రాష్ట్రంలో రైల్వే ప్రాజెక్ట్‌ల పురోగతిపై అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు.

అభినేత్రి భయపెట్టదు .... తమన్నా

ప్రభుదేవా, తమన్నా, సోనుసూద్ ప్రధాన పాత్రల్లో ఎ.ఎల్.విజయ్ దర్శకత్వంలో కోన ఫిలిం కార్పొరేషన్, బ్లూసర్కిల్ కార్పొరేషన్, బిఎల్‌ఎన్ సినిమా, ఎంవివి సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తోన్న చిత్రం ‘అభినేత్రి’. ఈ సినిమా ఫస్ట్‌లుక్, టీజర్ హైదరాబాద్‌లో రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా వి.వి.వినాయక్ మాట్లాడుతూ, సినిమా టీజర్ అద్భుతంగా ఉందని, ‘అభినేత్రి’ అని టైటిల్ తమన్నాకు బాగా సూట్ అవుతుందని అన్నారు. ఇంతకుముందు తనతో రెండు సినిమాలు చేసిన అనుభవంతో చెప్తున్నానని, కోన వెంకట్ ఒక రోజు ఈ సినిమా కథ చెప్పడానికి ఫోన్ చేశాడని, మంచి కథ, నాకు బాగా నచ్చిందని, తెలుగు ప్రేక్షకులకు నచ్చే సినిమా అవుతుందని అన్నారు.

గడువుపై గడబిడ!

హైదరాబాద్, జూన్ 4: సచివాలయం ఉద్యోగుల గుండెల్లో జూన్ 27 గడువుగుబులు రేకెత్తిస్తోంది. ఉండటానికి ఇల్లు లేదు...పిల్లల్ని చేర్పించేందుకు స్కూలు లేదు..ఉద్యోగం చేయడానికి సరైన వసతి లేదు...ఎలా వెళ్లాలి? అనే ప్రశ్న వారిని వేధిస్తోంది. ఉద్యోగుల ప్రశ్నలకు ప్రభుత్వం వద్ద సరైన సమాధానం లేదు. రాకపోతే ఊరుకోనంటూ తాజాగా ముఖ్యమంత్రి అల్టిమేటమ్ జారీ చేయడంతో ఉద్యోగులకు ఏం చేయాలో పాలుబోవడం లేదు.

Pages