S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

06/06/2017 - 02:31

ఎడ్జిబాస్టన్, జూన్ 5: చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఆదివారం పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో మెరుపు వేగంతో అర్ధ శతకాన్ని సాధించి, ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అందుకున్న భారత మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మన్ యువరాజ్ సింగ్‌పై అభినందనల జల్లు కురుస్తున్నది. యువీ 29 బంతుల్లోనే అర్ధ శతకాన్ని నమోదు చేసి, ఈ టోర్నీలో వేగంగా ఈ మైలురాయిని చేరిన భారత బ్యాట్స్‌మన్‌గా రికార్డు సృష్టించాడు.

06/06/2017 - 02:30

ఎడ్జిబాస్టన్, జూన్ 5: చాంపియన్స్ ట్రోఫీలో డిఫెండింగ్ చాంపియన్ టీమిండియా అద్భుతంగా ఆడిందని పాకిస్తాన్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిదీ వ్యాఖ్యానించాడు. నిజమైన ఫేవరిట్‌లా ఆడిందని కితాబునిచ్చాడు. ఉత్కంఠ భరితంగా, హోరాహోరీగా సాగుతుందనుకున్న మ్యాచ్ తమ జట్టు నీరుగారిపోవడంతో ఎంతో నిరుత్సాహాన్ని మిగిల్చిందని ఐసిసి పత్రికకు రాసిన తన వ్యాసంలో వాపోయాడు.

06/06/2017 - 02:28

పారిస్, జూన్ 5: ప్రపంచ మూడో ర్యాంక్ క్రీడాకారిణి సిమోనా హాలెప్ ఇక్కడ జరుగుతున్న ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్ శ్లామ్ టెన్నిస్ టోర్నమెంట్ మహిళల సింగిల్స్‌లో క్వార్టర్ ఫైనల్స్ చేరింది. నాలుగో రౌండ్‌లో ఆమె 21వ ర్యాంకర్ కార్లా సౌరెజ్ నవరోను 6-1, 6-1 తేడాతో వరుస సెట్లలో చిత్తుచేసింది. హాలెప్ విజృంభణకు నవరో నుంచి ఏ దశలోనూ పోటీ లేకుండా పోయింది.

06/06/2017 - 02:26

పారిస్: ఫ్రెంచ్ ఓపెన్ పురుషుల సింగిల్స్‌లో ప్రపంచ నంబర్ వన్ ఆటగాడు ఆండీ ముర్రే సులభంగా క్వార్టర్స్ చేరాడు. నాలుగో రౌండ్‌లో అతను కరెన్ కాచనొవ్‌ను 6-3, 6-4, 6-4 తేడాతో ఓడించాడు. కాగా, టైటిల్ వేటలో అతనికి రెండో ర్యాంక్ ఆటగాడు నొవాక్ జొకోవిచ్ నుంచి పోటీ తప్పకపోవచ్చు. మరో నాలుగో రౌండ్ మ్యాచ్‌లో జొకోవిచ్ 7-6, 6-1, 6-3 తేడాతో అల్బర్ట్ రామోస్ వినోలస్‌ను ఓడించాడు.

06/06/2017 - 02:24

కెన్నింగ్టన్ ఓవల్ (లండన్), జూన్ 5: చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా సోమవారం బంగ్లాదేశ్, ఆస్ట్రేలియా జట్ల మధ్య ఆరంభమైన మ్యాచ్‌ని వర్షం వెంటాడుతున్నది. 183 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు ఇన్నింగ్స్‌ను మొదలుపెట్టిన ఆస్ట్రేలియా 16 ఓవర్లలో ఆరోన్ ఫించ్ (19) వికెట్ కోల్పోయ 83 పరుగులు చేసింది. డేవిడ్ వార్నర్ 40, కెప్టెన్ స్టీవెన్ స్మిత్ 22 పరుగులతో అప్పటికి నాటౌట్‌గా ఉన్నారు.

06/06/2017 - 02:22

సిడ్నీ, జూన్ 5: చాలాకాలంగా తాము చేస్తున్న డిమాండ్లను అంగీకరిస్తూ, కొత్త కాంట్రాక్టు కుదుర్చుకోవాలని క్రికెట్ ఆస్ట్రేలియా (సిఎ) అధికారులకు ఆ జట్టు ఓపెనర్, వైస్-కెప్టెన్ డేవిడ్ వార్నర్ సూచించాడు. కాంట్రాక్టు కుదరితేనే ప్రతిష్ఠాత్మక యాషెస్ సిరీస్‌ను ఆడేందుకు సిద్ధమవుతానని, లేకపోతే, అందులో పాల్గొనే ప్రసక్తే లేదని ఒక చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వార్నర్ స్పష్టం చేశాడు.

06/05/2017 - 02:47

బ్యాంకాక్, జూన్ 4: థాయిలాండ్ ఓపెన్ బాడ్మింటన్ టైటిల్‌ను భారత ఆటగాడు సాయి ప్రణీత్ గెల్చుకున్నాడు. ఆదివారం జరిగిన ఫైనల్‌లో అతను జొనథాన్ క్రిస్టీని 17-21, 21-18, 21-19 తేడాతో ఓడించాడు. మొదటి సెట్‌ను కోల్పోయినప్పటికీ, ఆతర్వాత రెండు సెట్లలో చివరి వరకూ పోరాటం సాగించి అతను విజయాన్ని నమోదు చేశాడు. కాగా మహిళల సింగిల్స్ టైటిల్‌ను ప్రపంచ నంబర్ వన్ రచానొక్ ఇంతనాన్ తన ఖాతాలో వేసుకుంది.

06/05/2017 - 02:47

ఎడ్జిబాస్టన్: భారత్, పాకిస్తాన్ జట్లతో వర్షం ఓ ఆట ఆడుకుంది. ఆదివారం నాటి చాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్‌లో ఈ రెండు జట్లు తలపడగా, మొదట బ్యాటింగ్‌కు దిగిన భారత్ 9.5 ఓవర్లలో వికెట్ నష్టం లేకుండా 46 పరుగులు సాధించింది. ఈ దశలో వర్షం కురవడంతో ఆటకు అంతరాయం ఏర్పడింది. జల్లులు తగ్గడంతో ఆట కొనసాగింది. ఒక వికెట్ నష్టినికి 173 పరుగులకు చేరుకున్నప్పుడు మరోసారి భారీ వర్షం కురిసింది.

06/05/2017 - 02:46

ఎడ్జిబాస్టన్: చాంపియన్స్ ట్రోఫీ టోర్నమెంట్‌లో శిఖర్ ధావన్, రోహిత్ శర్మ జోడీ మూడో సెంచరీ భాగస్వామ్యాన్ని నమోదు చేయడం ఇది మూడోసారి. ఈ టోర్నీలో ఎక్కువ సెంచరీ పార్ట్‌నర్‌షిప్స్ వీరివే. క్రిస్ గేల్, శివనారైన్ చందర్‌పాల్ (వెస్టిండీస్), హెర్చెల్ గిబ్స్, గ్రేమ్ స్మిత్ (దక్షిణాఫ్రికా) రెండేసి పర్యాయాలు సెంచరీ భాగస్వామ్యాలను సాధించారు.

06/05/2017 - 02:45

ఎడ్జిబాస్టన్, జూన్ 4: చాంపియన్స్ ట్రోఫీలో డిఫెం డింగ్ చాంపియన్ టీమిండియా తన మొదటి మ్యాచ్ లో వీరవిహారం చేసింది. చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌పై తిరుగులేని ఆధిపత్యాన్ని కనబరచి 124 పరుగుల తే డాతో విజయభేరి మోగించింది. కెప్టెన్ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, యువరాజ్ సింగ్ అర్ధ శత కాలతో రాణిస్తే, బౌలింగ్‌లో ఉమేష్ యాదవ్, హార్దిక్ పాండ్య, రవీంద్ర జడేజా రెచ్చిపోయారు.

Pages