S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

06/09/2017 - 02:04

పారిస్, జూన్ 8: భారత సీనియర్ ఆటగాడు రోహన్ బొపన్న ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్ శ్లామ్ టెన్నిస్ చాంపియన్‌షిప్ మిక్స్‌డ్ డబుల్స్ విభాగంలో టైటిల్ సాధించాడు. కెనడాకు చెందిన గాబ్రియేల డబ్రోవ్‌స్కీతో కలిసి బరిలోకి దిగిన అతను ఫైనల్‌లో అన్నా లెనా గ్రొయెనెఫెల్డ్ (జర్మనీ), రాబర్ట్ ఫరా (కొలంబియా) జోడీపై 2-6, 6-2, 12-10 తేడాతో విజయం సాధించాడు.

06/09/2017 - 00:38

కెన్నింగ్టన్ ఓవల్ (లండన్), జూన్ 8: చాంపియన్స్ ట్రోఫీలో డిఫెండింగ్ చాంపియన్ టీమిండియా తన నిలకడలేమిని మరోసారి ప్రదర్శించుకుంది. తొలి మ్యాచ్‌లో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌ను చావుదెబ్బతీసిన విరాట్ కోహ్లీ నాయకత్వంలో భారత్, రెండో మ్యాచ్‌లో భారీ స్కోరు సాధించినప్పటికీ, పసలేని బౌలింగ్ కారణంగా శ్రీలంక చేతిలో పరాజయాన్ని ఎదుర్కొంది.

06/09/2017 - 00:33

పారిస్, జూన్ 8: ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్ శ్లామ్ టెన్నిస్ టోర్నమెంట్ ముగింపు దశకు చేరింది. అటు పురుషులు, ఇటు మహిళల విభాగాల్లో డిఫెం డింగ్ చాంపియన్లు పరాజయాలను చవిచూడడం, సెరెనా విలియమ్స్, ప్రపంచ మాజీ నంబర్ వన్, రష్యా టెన్నిస్ బ్యూటీ మరియా షరపోవా వంటి స్టార్ల పోరాటాలు లేకపోవడం అభిమానులను తీవ్ర నిరాశకు గురి చేస్తున్నాయ.

06/09/2017 - 00:30

న్యూఢిల్లీ, జూన్ 8: ఫోబ్స్ పత్రిక ప్రకటించిన వంద మంది అత్యంత ధనవంతులైన క్రీడాకారుల జాబితాలో భారత్ తరఫున క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీకి మాత్రమే చోటు దక్కింది. క్రిస్టియానో రొనాల్డో మొత్తం 93 మిలియన్ డాలర్లతో నంబర్ వన్ స్థానాన్ని ఆక్రమించాడు.

06/09/2017 - 00:10

ఢాకా, జూన్ 8: తనకు రెండో భార్య ఉందనే విషయాన్ని బంగ్లాదేశ్ ఎడమచేతి వాటం స్పిన్నర్ అరాఫత్ సన్నీ అంగీకరించారు. నస్రీన్ సుల్తానా అనే మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ ఏడాది జనవరిలో పోలీసులు సన్నీని అరెస్టు చేశారు. కేసు కోర్టులో విచారణకు వచ్చిన సమయంలో, తాను రెండో పెళ్లి చేసుకున్నానని 30 ఏళ్ల సన్నీ అంగీకరించాడు. కాగా, బంగ్లాదేశ్‌లో రెండో వివాహం చట్టబద్ధమైనదే.

06/09/2017 - 00:10

న్యూఢిల్లీ, జూన్ 8: పటియాలాలోని నేతాజీ సుభాష్ చంద్రబోస్ జాతీయ క్రీడా శిక్షణా సంస్థ (ఎన్‌ఐఎస్)లో కోచ్‌గా ఉన్న మహమ్మద్ కున్హీపై సస్పెన్షన్ వేటు పడింది. 400 మీటర్ల విభాగంలో అథ్లెట్లకు అతను శిక్షణనిస్తున్నాడు. కాగా, ఆ సంస్థలోని 400 మీటర్ల స్పెషలిస్టు జితిన్ పాల్ ఇటీవల డోప్ పరీక్షలో విఫలమయ్యాడు. దీనితో జాతీయ డోపింగ్ నిరోధక విభాగం (నాడా) అతనిని తాత్కాలికంగా సస్పెండ్ చేసింది.

06/09/2017 - 00:09

బర్మింగ్‌హామ్, జూన్ 8: ఎడ్జిబాస్టన్ స్టేడియానికి భారీగా తరలి వచ్చిన అభిమానులు ఇచ్చిన మద్దతే తమలో ఆత్మవిశ్వాసాన్ని పెంచిందని, అదే తమను గెలిపించిందని పాకిస్తాన్ కెప్టెన్ సర్ఫ్‌రాజ్ అహ్మద్ అన్నాడు.

06/08/2017 - 01:35

పారిస్, జూన్ 7: డిఫెండింగ్ చాంపియన్, ప్రపంచ రెండో ర్యాంక్ ఆటగాడు నొవాక్ జొకోవిచ్ ఇక్కడ జరుగుతున్న ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్ శ్లామ్ టెన్నిస్ టోర్నమెంట్ క్వార్టర్ ఫైనల్స్‌లోనే నిష్క్రమించాడు. టైటిల్ ఫేవరిట్‌గా బరిలోకి దిగిన అతనిని ఆరో సీడ్ డామినిక్ థియెమ్ 7-6, 6-3, 6-0 తేడాతో ఓడించి సంచలనం సృష్టించాడు. వర్షం కారణంగా ఆటకు అంతరాయం ఏర్పడగా, మంగళవారం నాటి మ్యాచ్ బుధవారం కొనసాగింది.

06/08/2017 - 01:31

న్యూఢిల్లీ, జూన్ 7: ప్రస్తుతం ఇంగ్లాండ్‌లో జరుగుతున్న చాంపియన్స్ ట్రోఫీ క్రికెట్ టోర్నమెంట్ ముగిసే లోపుగానే టీమిండియాకు కొత్త కోచ్‌ని నియమించే ప్రక్రియను పూర్తి చేయడానికి భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ) సన్నాహాలు చేస్తున్నట్టు సమాచారం. ఇప్పటికే కోచ్ పదవికి దరఖాస్తులను బోర్డు ఆహ్వానించింది. ప్రస్తుత కోచ్ అనిల్ కుంబ్లే కాంట్రాక్టు చాంపియన్స్ ట్రోఫీతో ముగుస్తుంది.

06/08/2017 - 01:30

లండన్, జూన్ 7: చాంపియన్స్ ట్రోఫీ క్రికెట్ టోర్నమెంట్‌లో భాగంగా గురువారం శ్రీలంకతో మ్యాచ్‌కి కోహ్లీ నాయకత్వంలోని టీమిండియా అన్ని విధాలా సిద్ధంగా ఉంది. మొదటి మ్యాచ్‌లో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌ను 124 పరుగుల భారీ తేడాతో చిత్తుచేసిన భారత్ అదే ఉత్సాహంతో లంక భరతం పట్టి, సెమీస్‌కు దూసుకెళ్లాలన్న పట్టుదలతో ఉంది.

Pages