S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

05/28/2017 - 07:01

పారిస్, మే 27: స్టేడియాలకు ప్రేక్షకులను ఆకర్షించే సత్తావున్న కీలక స్టార్లు లేకపోవడంతో ఈసారి ఫ్రెంచ్ ఓపెన్ కళావిహీనంగా మారే ప్రమాదం కనిపిస్తున్నది. ఆదివారం నుంచి మొదలయ్యే ఈ ‘క్లే కోర్టు’ గ్రాండ్ శ్లామ్ సమరంలో మరియా సెరెనా విలియమ్స్, మరియా షరపోవా, రోజర్ ఫెదరర్ తదితరులు ఆడకపోవడం సహజంగానే అభిమానులను నిరాశ పరుస్తున్నది.

05/28/2017 - 06:57

న్యూఢిల్లీ, మే 27: యువ జావెలిన్ త్రోయర్ రోహిత్ యాదవ్ డోప్ పరీక్షలో దోషిగా తేలాడు. దీనితో ఆసియా యూత్ అత్లెటిక్స్ చాంపియన్‌షిప్స్‌లో అతను సాధించిన రజత పతకాన్ని అధికారులు రద్దు చేశారు. 16 ఏళ్ల యాదవ్ నిరుడు జరిగిన ప్రపంచ స్కూల్ గేమ్స్‌లో స్వర్ణ పతకాన్ని సాధించడమేగాక, 76.11 మీటర్ల దూరానికి జావెలిన్‌ను విసిరి కొత్త మీట్ రికార్డు సృష్టించాడు.

05/28/2017 - 06:57

ఓవల్, మే 27: ‘మినీ వరల్డ్ కప్’ చాంపియన్స్ ట్రోఫీ క్రికెట్ టోర్నమెంట్‌కు డిఫెండింగ్ చాంపియన్ టీమిండియా సిద్ధమైంది. జూన్ ఒకటి నుంచి మెయిన్ డ్రాలో మ్యాచ్‌లు ఆరంభం కానుండగా, ఈలోగా భారత్ రెండు వామప్ మ్యాచ్‌లు ఆడుతుంది. వాటిలో మొదటి మ్యాచ్ ఆదివారం న్యూజిలాండ్‌తో జరుగుతుంది. 30న జరిగే రెండో వామప్ మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ను ఢీ కొంటుంది.

05/28/2017 - 06:56

ఓవల్, మే 27: భారత క్రికెటర్లు శనివారం నెట్స్‌లో ముమ్మరంగా ప్రాక్టీస్ చేశారు. అయతే, సీనియర్ బ్యాట్స్‌మన్ యువరాజ్ సింగ్ ప్రాక్టీస్ సెషన్‌కు జైర్హాజరు కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. అనారోగ్య కారణంగానే అతను నెట్స్‌కు రాలేదని జట్టు వర్గాలు తెలిపాయ. ఒకటిరెండు రోజుల్లో యువీ కోలుకుంటాడన్న ధీమా వ్యక్తం చేశాయ.

05/27/2017 - 06:18

పారిస్, మే 26: ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్ శ్లామ్ టెన్నిస్ టోర్నీ ఆదివారం నుంచి మొదలు కానుండగా, మరియా షరపోవాకు వైల్డ్‌కార్డ్ ఎంట్రీని ఇవ్వకుం డా నిర్వాహకులు గెలిచారా? ఆమెను ఆడించడానికి వీల్లేదని గగ్గోలు పెట్టిన ఇతర క్రీడాకా రిణులు గెలిచారా? ఫ్రెంచ్ ఓపెన్‌లో ఆడే అవకాశం రాకపో యనప్పటికీ, కోట్లాది మంది అభి మానుల మద్దతును సంపాదించు కున్న షరపోవా గెలిచిందా?

05/27/2017 - 06:14

గోల్డ్ కోస్ట్ (ఆస్ట్రేలియా), మే 26: సుదీర్మన్ కప్ బాడ్మింటన్ చాంపియన్‌షిప్ నుంచి భారత్ నిష్క్రమించింది. క్వార్టర్ ఫైనల్స్‌లో చైనాను ఢీకొన్న భారత్ 0-3 తేడాతో ఓటమిపాలైంది. మిక్స్‌డ్ డబుల్స్ విభాగంలో జరిగిన మొదటి మ్యాచ్‌లో అశ్వినీ పొన్నప్ప, సాత్విక్ సాయిరాజ్ జోడీ 21-16, 13-21, 16-21 తేడాతో ప్రపంచ రెండో ర్యాంక్ జోడీ లూ కయ్, హువాంగ్ యాక్వియాంగ్ చేతిలో ఓటమిపాలైంది.

05/27/2017 - 06:14

కొలంబో, మే 26: శ్రీలంక మాజీ బ్యాట్స్‌మన్ సనత్ జయసూర్య చిక్కుల్లో పడ్డాడు. మాజీ ప్రియు రాలితో అతని రాసలీల వీడియో ఇప్పుడు లంక సోషల్ మీడి యాలో హల్‌చల్ చేస్తుండగా, కేసు సైబర్ నేరాల విభాగానికి చేరింది. దీనితో అసలు దానిని ఎవరు పోస్ట్ చేశారో తెలుసుకునేందుకు అధికారులు రంగంలోకి దిగినట్టు సమాచారం.

05/27/2017 - 06:14

న్యూఢిల్లీ, మే 26: భారత బ్యాటింగ్ దిగ్గజం సచిన్ తెండూల్కర్ బయో పిక్ ‘సచిన్ - ఎ బిలియన్ డ్రీమ్స్’ చిత్రం ప్రీమియర్ షోకు అమితాబ్ బచ్చన్ నుంచి షారుఖ్ ఖాన్ వరకు, విరాట్ కోహ్లీ నుంచి జహీర్ ఖాన్ వరకు ఎంతో మంది హేమాహేమీలు హాజరయ్యారు. భారత ప్రస్తుత, మాజీ క్రికెటర్లు చాలా మంది హాజరైనప్పటికీ, మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేందర్ సెవాగ్ లేని లోటు స్పష్టంగా కనిపించింది.

05/27/2017 - 06:13

పారిస్, మే 26: ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్ శ్లామ్‌ను పదోసారి కైవసం చేసుకునేందుకు నిరుడు బరిలోకి దిగినప్పటికీ, మణికట్టు విరగడంతో మూడో రౌండ్‌లోనే ప్రత్యర్థికి వాకోవర్ ఇవ్వాల్సి వచ్చిందని ‘క్లే కోర్టు హీరో’ రాఫెల్ నాదల్ అన్నాడు. రొలాండ్ గారోస్‌లో తొమ్మిది పర్యాయాలు విజేతగా నిలిచిన అతను నిరుడు విజయంపై ఆశతోనే అడుగుపెట్టాడు. మొదటి రౌండ్‌లో శామ్ గ్రాత్‌ను 6-1, 6-1, 6-1 తేడాతో చిత్తుచిత్తుగా ఓడించాడు.

05/27/2017 - 06:12

న్యూఢిల్లీ, మే 26: పదో ఐపిఎల్‌లో అత్యధికంగా సొమ్ము చేస్తున్న క్రికెటర్లు తమకు లభించిన మొత్తానికి న్యాయం చేశారా లేదా అన్నది నిర్ణయించాలంటే, వారు ఆడిన తీరును పరిశీలించాలి. ఈసారి ఐపిఎల్‌లో అందరి కంటే ఎక్కువగా, 14.5 కోట్ల రూపాయలతో ఇంగ్లాండ్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ రికార్డు సృష్టించాడు. రైజింగ్ పుణే సూపర్‌జెయింట్ తరఫున ఆడిన అతను ప్లే ఆఫ్ కంటే ముందుగానే స్వదేశానికి వెళ్లిపోయాడు.

Pages