S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

06/13/2017 - 01:10

పారిస్, జూన్ 12: ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్ శ్లామ్ టెన్నిస్ టోర్నమెంట్ పురుషుల సింగిల్స్ టైటిల్‌ను రికార్డు స్థాయిలో పదోసారి కైవసం చేసుకొని, ప్రపంచ ర్యాంకింగ్స్‌లో రెండు స్థానాలను మెరుగుపరచుకొని, రెండో స్థానానికి చేరుకున్న ‘స్పెయిన్ బుల్’ రాఫెల్ నాదల్ ఇప్పుడు టాప్ ర్యాంక్‌ను లక్ష్యంగా ఎంచుకున్నాడు. గతంలో ప్రపంచ నంబర్ వన్‌గా కొనసాగినప్పటికీ, ఆతర్వాత తరచు గాయాల బారిన పడడంతో ర్యాంక్ పతనం కొనసాగింది.

06/12/2017 - 01:34

చిత్రం.. చాంపియన్స్ ట్రోఫీ క్రికెట్ టోర్నమెంట్‌లో ఆదివారం తన చివరి గ్రూప్ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాను ఎనిమిది వికెట్ల తేడాతో చిత్తుచేసి, సెమీస్ చేరిన టీమిండియా

06/12/2017 - 01:04

దక్షిణాఫ్రికాతో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో నెగ్గిన భారత్ సెమీ ఫైనల్‌లో బంగ్లాదేశ్‌ను ఢీకొననుంది. గ్రూప్ టాపర్‌గా ఉన్న టీమిండియా ఫైనల్‌లో స్థానం కోసం, మరో గ్రూప్‌లోని రెండో స్థానంలో నిలిచిన బంగ్లాదేశ్‌తో తలపడాలి.

06/12/2017 - 01:01

ఫిట్నెస్ సమస్యలు లేకపోతే, తనను నిలువరించడం కష్టమని క్లే కోర్టు వీరుడు రాఫెల్ నాదల్ మరోసారి రుజువు చేశాడు. ఆదివారం జరిగిన ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్ శ్లామ్ టెన్నిస్ టోర్నమెంట్ పురుషుల సింగిల్స్ ఫైనల్‌లో ప్రత్యర్థి స్టానిస్లాస్ వావ్రిన్కాను వరుస సెట్లలో చిత్తుచేసిన విధానమే అతని శక్తిసామర్థ్యాలకు నిదర్శనం.

06/12/2017 - 01:05

పారిస్: ఫ్రెంచ్ ఓపెన్ మహిళల డబుల్స్ టైటిల్‌ను బెథానీ మాటెక్ సాండ్స్ (అమెరికా), లూసీ సఫరోవా (చెక్ రిపబ్లిక్) జోడీ కైవసం చేసుకుంది. ఫైనల్‌లో వీరు ఆస్ట్రేలియాకు చెందిన ఆష్లే బాటర్టీ, కాసీ డెలాక్వా జోడీపై 6-2, 6-1 తేడాతో గెలిచారు. పురుషుల డబుల్స్ విభాగంలో ర్యాన్ హారిసన్ (అమెరికా), మైఖేల్ వీనస్ (న్యూజిలాండ్) జోడీకి టైటిల్ దక్కింది.

06/12/2017 - 00:55

లండన్, జూన్ 11: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్)లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఫ్రాంచైజీకి మాజీ యజమాని, ఫోర్స్ ఇండియా ఫార్ములా వన్ జట్టు సహ భాగస్వామి విజయ్ మాల్యకు కెన్నింగ్టన్ ఓవల్ మైదానంలో అవమానం ఎదురైంది. భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరిగిన చాంపియన్స్ ట్రోఫీ కీలక మ్యాచ్‌ని తిలకించేందుకు మరో వ్యక్తితో కలిసి మాల్య స్టేడియానికి వచ్చినప్పుడు చేదు అనుభవాన్ని ఎదుర్కొన్నాడు.

06/12/2017 - 00:53

లండన్, జూన్ 11: రష్యా టెన్నిస్ బ్యూటీ మరియా షరపోవా ఈసారి వింబుల్డన్‌లో పాల్గొనడం లేదు. గాయం కారణంగా తాను క్వాలిఫయర్స్‌లో ఆడలేకపోతున్నానని ఆమె ఒక ప్రకటనలో తెలిపింది. నిషిద్ధ మాదక ద్రవ్యాం మాల్డోనియంను వినియోగించిన కారణంగా సస్పెన్షన్‌కు గురైన ఆమె, శిక్షా కాలాన్ని పూర్తి చేసుకున్న తర్వాత మళ్లీ అంతర్జాతీయ కెరీర్‌ను మొదలుపెట్టింది.

06/11/2017 - 01:31

సెయింట్ లూసియా, జూన్ 10: వెస్టిండీస్‌తో మూడు మ్యాచ్‌ల వనే్డ సిరీస్‌లో అఫ్గానిస్తాన్ బోణీ చేసింది. 213 పరుగుల విజయ లక్ష్యంతో ఇన్నింగ్స్ ఆడిన వెస్టిండీస్ యువ స్పిన్నర్ రషీద్ ఖాన్ ఏడు వికెట్లు పడగొట్టడంతో 44.4 ఓవర్లలో 149 పరుగులకే కుప్పకూలి, 63 పరుగుల భారీ తేడాతో ఓటమిపాలైంది. సిరీస్‌పై అఫ్గానిస్తాన్ 1-0 ఆధిక్యాన్ని సంపాదించింది.

06/11/2017 - 01:30

ఎడ్జిబాస్టన్, జూన్ 10: చాంపియన్స్ ట్రోఫీ క్రికెట్ టోర్నమెంట్ నుంచి టైటి ల్ ఫేవరిట్ ఆస్ట్రేలియా నిష్క్రమించింది. అత్యంత కీలకమైన గ్రూప్ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ చేతిలో 40 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. మొదటి రెండు మ్యా చ్‌లకు వర్షం కారణంగా న్యూజిలాండ్, బంగ్లాండ్‌తో జరగాల్సిన మ్యాచ్‌లు ర ద్దుకాగా, చివరి మ్యాచ్‌లో గెలిస్తేగానీ ముందంజ వేయలేని స్థితిని ఎదుర్కొన్న ఆసీస్‌ను మరోసారి వర్షం దెబ్బతీసింది.

06/11/2017 - 02:00

పారిస్, జూన్ 10: ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్ శ్లామ్ టెన్నిస్‌లో కొత్త చాంపియన్ అవతరించింది. ప్రపంచ నాలుగో సీడ్ సిమోనా హాలెప్‌ను ఓడించిన 20 ఏళ్ల జెలెనా ఒస్టాపెన్కో టైటిల్‌ను కైవసం చేసుకుంది. మొదటి సెట్‌ను 4-6 తేడాతో కోల్పోయిన జెలెనా ఎదురుదాడికి చేసి, రెండో సెట్‌ను 6-4 తేడాతో సొంతం చేసుకుంది.

Pages