S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

05/03/2017 - 00:38

న్యూఢిల్లీ, మే 2: అఖిల భారత ఫుట్‌బాల్ సమాఖ్య (ఎఐఎఫ్‌ఎఫ్) ఈ ఏడాది లెజెండరీ క్రీడాకారిణి బెంబెం దేవితో పాటు జెజె లాల్‌పెకులా, గుర్‌ప్రీత్ సంధులను అర్జున అవార్డులకు నామినేట్ చేసింది. 36 ఏళ్ల బెంబెం దేవి గత ఏడాది షిల్లాంగ్‌లో సౌత్ ఏషియన్ గేమ్స్ ముగిసిన తర్వాత అంతర్జాతీయ కెరీర్‌కు గుడ్‌బై చెప్పిన విషయం విదితమే.

05/03/2017 - 00:38

దుబాయ్, మే 2: అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసిసి) తాజాగా ప్రకటించిన ప్రపంచ టి-20 క్రికెట్ టీమ్ ర్యాంకింగ్స్‌లో భారత్ రెండు స్థానాలు కిందికి దిగజారి ఆరో ర్యాంకుకు పతనమైంది. ఆరు రేటింగ్ పాయంట్లు కోల్పయన భారత జట్టు ప్రస్తుతం 118 పాయంట్లతో ఈ జాబితాలో రెండో స్థానంలో నిలిచిన ఇంగ్లాండ్, మూడో ర్యాంకులో ఉన్న పాకిస్తాన్ జట్ల కంటే 3 పాయంట్లు వెనుకబడి ఉంది.

05/02/2017 - 00:57

ముంబయిలో ఎండలు తీవ్రంగా ఉండడంతో, టాస్ గెలిచిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఇటీవల బ్యాటింగ్ వైఫల్యాలతో అల్లాడిన కారణంగా, ముందు జాగ్రత్త చర్యగా ఈ మ్యాచ్‌లో శామ్యూల్ బద్రీ, సచిన్ బేబీ, స్టువర్ట్ బిన్నీని తప్పించి, వారి స్థానంలో షేన్ వాట్సన్, మన్దీప్ సింగ్, అనికేత్ చౌదరిని తుది జట్టులో తీసుకున్నాడు. కానీ, అతని ప్రయోగం ఫలించలేదు.

05/02/2017 - 00:52

పుణే, మే 1: ఐపిఎల్‌లో సోమవారం జరిగిన రెం డో మ్యాచ్‌లో రైజింగ్ పుణే సూపర్‌జెయంట్స్‌ను ఢీ కొన్న గుజరాత్ లయన్స్ 5 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. ఈ జట్టు 161 పరుగులకు ఆలౌట్‌కాగా, బెన్ స్టోక్స్ వీరోచిత సెంచరీతో రాణించడంతో పుణే మరో బంతి మిలిగి ఉండగా, ఐదు వికెట్ల నష్టంతో లక్ష్యాన్ని చేరుకొని, 5 వికెట్ల తేడాతో గెలిచింది.

05/02/2017 - 00:50

దుబాయ్, మే 1: వనే్డ ఇంటర్నేషనల్స్ విభాగంలో అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) జారీ చేసిన విడుదల ర్యాంకింగ్స్‌లో భారత్ మూడో స్థానానికగి చేరింది. భారత్ ఐదు పాయింట్లను మెరుగుపరచుకొని ప్రస్తుతం 117 పాయింట్లతో మూడో స్థానంలో ఉంది. ఈ జాబితాలో దక్షిణాఫ్రికా 123 పాయింట్లతో నంబర్ వన్ స్థానంలో నిలవగా, ఆస్ట్రేలియా 118 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది.

05/02/2017 - 00:49

కరాచీ, మే 1: పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పిసిబి) చైర్మన్‌గా షహర్యార్ ఖాన్ కొనసాగనున్నాడు. అనారోగ్య కారణాలతో పదవిలో తాను కొనసాగలేనని పేర్కొంటూ ఇటీవలే షహర్యార్ రాజీనామా పత్రాన్ని పిసిబికి చీఫ్ ప్యాట్రన్‌గా వ్యవహరిస్తున్న ప్రధాని నవాజ్ షరీఫ్‌కు సమర్పించాడు. అయితే, అతని రాజీనామాను తిరస్కరించిన షరీఫ్, మూడేళ్ల పదవీకాలం పూర్తయ్యే వరకూ కొనసాగాల్సిందిగా సూచించాడు.

05/02/2017 - 00:48

దుబాయ్, మే 1: అమెరికా క్రికెట్ సంఘం (యుఎస్‌ఎసిఎ)పై అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) నిషేధం వేటు వేయడం ఖాయంగా కనిపిస్తున్నది. ఇప్పటికే యుఎస్‌ఎసిఎ నిషేధంపై నిర్ణయం తీసుకున్న ఐసిసి పాలకమండలి ఈఏడాది జూన్‌లో జరగబోయే సమావేశంలో దానికి అనుకూలంగా తీర్మానాన్ని ఆమోదిస్తుందని సమాచారం. అమెరికాలో క్రికెట్‌కు ఎంతో ఆదరణ ఉందని ఐసిసి అభిప్రాయం.

05/02/2017 - 00:47

ఇపో, మే 1: ప్రతిష్ఠాత్మకమైన అజ్లాన్ షా హాకీ టోర్నమెంట్‌లో మంగళవారం డిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్రేలియాను ఎదుర్కోవడానికి భారత్ సిద్ధమైంది. ఈ టోర్నీలో భాగంగా మొదటి మ్యాచ్‌లో గ్రేట్ బ్రిటన్‌ను ఢీకొన్న భారత్ దానిని డ్రా చేసుకుంది. ఇరు జట్లు చెరి రెండు గోల్స్ చేశాయి. ఆదివారం జరిగిన రెండో మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ను భారత్ 3-0 తేడాతో చిత్తుచేసింది.

05/01/2017 - 01:37

మొహాలీ, ఏప్రిల్ 30: హోం గ్రౌండ్‌లో ఢిల్లీ డేర్‌డెవిల్స్‌తో ఆదివారం జరిగిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) టి-20 క్రికెట్ టోర్నమెంట్ లీగ్ మ్యాచ్‌లో కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ చెలరేగిపోయింది. ప్రత్యర్థిని కేవలం 67 పరుగులకు కట్టడి చేసి, ఆతర్వాత ఇంకా 73 బంతులు మిగిలి ఉండగానే, పది వికెట్ల తేడాతో విజయభేరి మోగించింది. అన్ని రకాలుగా విఫలమైన డేర్‌డెవిల్స్ చిత్తుచిత్తుగా ఓడింది.

05/01/2017 - 01:22

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) చరిత్రలో ఢిల్లీ డేర్‌డెవిల్స్ మూడో అత్యల్ప స్కోరును ఆదివారం నమోదు చేసింది. కింగ్స్ ఎలెవెన్ పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఈ జట్టు 17.1 ఓవర్లలో 67 పరుగులకే కుప్పకూలి, అత్యల్ప స్కోర్ల జాబితాలో కోల్‌కతా నైట్ రైడర్స్‌తో కలిసి సంయుక్తంగా మూడో స్థానాన్ని ఆక్రమించింది. ఈసారి పోటీల్లోనే రాయల్ చాలెంజర్స్ బెంగళూరు 9.4 ఓవర్లలో 49 పరుగులకే ఆలౌటైన విషయం తెలిసిందే.

Pages