S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

05/11/2017 - 01:14

మెడెలిన్ (కొలంబియా), మే 10: కొలంబియాలో విమానం కూలిన సంఘటనలో ఫుట్‌బాల్ క్రీడాకారులుసహా మొత్తం 71 మంది మృతి చెందిన సంఘటను గుర్తు చేసుకుంటూ చపెకొయన్స్ జట్టు ఆటగాళ్లు సంఘటన స్థలంలో కన్నీళ్లు పెట్టుకున్నారు. నిరుడు నవంబర్ 30న జరిగిన విమాన ప్రమాదం యావత్ క్రీడా ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది.

05/11/2017 - 01:13

న్యూఢిల్లీ, మే 10: క్రికెట్‌కు ఎలాంటి ప్రత్యేకత ఉండబోదని, అది కూడా క్రీడా విధానంలో ఒక భాగంగానే ఉంటుందని కేంద్ర క్రీడాశాఖ మంత్రి విజయ్ గోయల్ స్పష్టం చేశారు. త్వరలోనే పార్లమెంటు ముందుకు రాబోయే క్రీడా బిల్లులో క్రికెట్ కూడా చేరుతుందని అన్నారు. సుప్రీం కోర్టు ఆమోదించిన లోధా కమిటీ సిఫార్సులను అన్ని క్రీడలకూ వర్తింప చేస్తామని అన్నారు.

05/11/2017 - 01:12

హైదరాబాద్, మే 10: సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు నాయకత్వం వహిస్తున్న ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ కుమార్తె ఇవీ భయంతో వణికిపోయింది. మంగళవారం అర్ధరాత్రి భారీ వర్షం కురిసింది. ఈదురుగాలు, ఉరుములు, మెరుపులు హైదరాబాద్‌లోని కొన్ని ప్రాంతాలను కుదిపేశాయి. ఐపిఎల్ మ్యాచ్ కోసం వార్నర్ తన భార్యాపిల్లలతో కలిసి హైదరాబాద్‌లోనే ఉన్నాడు.

05/11/2017 - 01:10

ట్యూరిన్ (ఇటలీ), మే 10: డానీ అల్విస్ సూపర్ గేమ్ చాంపియన్స్ లీగ్ ఫుట్‌బాల్ టోర్నమెంట్‌లో జువెంటాస్‌ను ఫైనల్ చేర్చింది. మొనాకోతో జరిగిన మ్యాచ్‌ని 2-1 తేడాతో గెల్చుకున్న జువెంటాస్ మొత్తం మీద 4-1 సగటుతో ఫైనల్‌లో స్థానం సంపాదించింది. ఆరంభం నుంచి ఆచితూచి ఆడిన జువెంటాస్‌కు 33వ నిమిషంలో తొలి గోల్ లభించింది.

05/11/2017 - 01:08

లాస్ ఏంజిల్స్, మే 10: మొదట ఐదు దేశాలు బరిలో ఉన్నప్పటికీ, చివరికి రెండు మాత్రమే మిగలడంతో, 2024 ఒలింపిక్స్ బిడ్స్ వ్యవహారం ఆసక్తి రేపుతున్నది. బుడాపెస్ట్ (హంగరీ), రోమ్ (ఇటలీ), హాంబర్గ్ (జర్మనీ) రేసు నుంచి వైదొలగడంతో, పోటీలో లాస్ ఏంజిల్స్ (అమెరికా), పారిస్ (ఫ్రాన్స్) మిగిలాయి.

05/10/2017 - 05:51

మొహాలీ, మే 9: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) పదో ఎడిషన్ ట్వంటీ-20 క్రికెట్ టోర్నమెంట్‌లో మాజీ చాంపియన్ కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టు ప్రమాదంలో పడింది. ప్లే-ఆఫ్ బెర్తు కోసం రేసులో ఉన్న ఆ జట్టు మంగళవారం మొహాలీలోని పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియం (పిసిఎఎస్)లో జరిగిన కీలక లీగ్ మ్యాచ్‌లో గెలుపు ముంగిట బొక్కబోర్లా పడటమే ఇందుకు కారణం.

05/10/2017 - 05:49

గ్రేటర్ నోయిడా, మే 9: జాతీయ బాస్కెట్ బాల్ అసోసియేషన్ (ఎన్‌బిఏ) మంగళవారం గ్రేటర్ నోయిడాలో దేశంలోనే తన తొలి అకాడమీని ప్రారంభించింది. దేశంలో బాస్కెట్ బాల్ క్రీడ ఎదుగుదలకు ఇది దోహదం చేస్తుందన్న ఆశాభావాన్ని ఎన్‌బిఏ వ్యక్తం చేసింది. దేశంలోని వర్ధమాన పురుష, మహిళా బాస్కెట్‌బాల్ క్రీడాకారులకోసం ఇక్కడి జేపీ గ్రీన్ ఇంటిగ్రేటెడ్ స్పోర్ట్స్ అకాడమీలో ఈ అకాడమీని ప్రారంభించారు.

05/10/2017 - 05:49

న్యూఢిల్లీ, మే 9: ఆసియా చాంపియన్‌షిప్స్ పోటీల సెమీఫైనల్ మ్యాచ్‌కి గైర్హాజరైన ప్రముఖ బాక్సర్ వికాస్ స్వరూప్‌ను వరల్డ్ సిరీస్ ఆఫ్ బాక్సింగ్‌లో పోటీ చేయడానికి అనుమతించేది లేదని, అంతేకాకుండా అతను జాతీయ బాక్సింగ్ఫెడరేషన్ ఏర్పాటు చేసిన క్రమశిక్షణా కమిటీ ముందు హాజరయి తన గైరుహాజరుకు కారణాలను వివరించాల్సి ఉంటుందని ఫెడరేషన్ అధ్యక్షుడు అజయ్ సింగ్ మంగళవారం చెప్పాడు.

05/10/2017 - 05:48

మాడ్రిడ్, మే 9: మాడ్రిడ్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్ రెండో రౌండ్‌లో కెనడా క్రీడాకారిణి యుగెనీ బౌచర్డ్ రష్యా అందాల భామ మరియా షరపోవాకు చెక్ పెట్టింది. ఈ మ్యాచ్ ఆరంభంలో బౌచర్డ్ కాస్త వెనుకబడినప్పటికీ ఆ తర్వాత అద్భుతమైన పోరాట పటిమను కనబర్చి షరపోవాను మట్టికరిపించింది.

05/10/2017 - 05:46

కార్షీ (ఉజ్బెకిస్తాన్), మే 9: భారత డేవిస్ కప్ జట్టులో సభ్యులుగా ఉన్న యువ ఆటగాళ్లు యూకీ బాంబ్రీ, ఎన్.శ్రీరామ్ బాలాజీ ఉజ్బెకిస్తాన్‌లో జరుగుతున్న కార్షి చాలెంజర్ హార్డ్ కోర్ట్ టెన్నిస్ టోర్నమెంట్‌లో శుభారంభాన్ని సాధించారు. అయితే భారత్‌కు చెందిన ఇతర ఆటగాళ్లు మాత్రం తొలి రౌండ్‌లోనే ఓటమిపాలై ఈ టోర్నీ నుంచి నిష్క్రమించారు.

Pages