S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

12/30/2016 - 00:34

నీల్సన్, డిసెంబర్ 29: యువ బ్యాట్స్‌మన్ నీల్ బ్రూమ్ అజేయ శతకంతో రాణించగా, గురువారం పాకిస్తాన్‌తో జరిగిన రెండో వనే్డ ఇంటర్నేషనల్‌ను 67 పరుగుల తేడాతో గెల్చుకున్న న్యూజిలాండ్ మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను తన ఖాతాలో వేసుకుంది. టాస్ గెలిచిన బంగ్లాదేశ్ ఫీల్డింగ్‌ను ఎంచుకోగా తొలుత బ్యాటింగ్‌కు దిగిన కివీస్ 50 ఓవర్లలో 251 పరుగులకు ఆలౌటైంది.

12/30/2016 - 00:33

న్యూఢిల్లీ: ఐఒఎ అధ్యక్షుడు రామచంద్రన్‌పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కుంభకోణాల్లో అతనికి ఎలాంటి పాత్ర లేకపోయినప్పటికీ, సురేష్ కల్మాడీ, అభయ్ సింగ్ చౌతాలాలను జీవితకాల అధ్యక్షులుగా ఎన్నుకోవడం వెనుక అతని మాస్టర్ ప్లాన్ బలంగా పని చేసిందన్న అభిప్రాయం వ్యక్తమవుతున్నది. దోషులుగా కోర్టు ప్రాథమికంగా నిర్ధారించిన వారిని ఏ విధంగా ఎంపిక చేస్తారంటూ రామచంద్రన్‌పై పలువురు విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు.

12/30/2016 - 00:32

న్యూఢిల్లీ, డిసెంబర్ 29: కేంద్ర ప్రభుత్వంతో అమీతుమీకి భారత ఒలింపిక్ సంఘం (ఐఒఎ) సిద్ధమవుతుందా లేక రాజీకి వస్తుందా అన్నది ఆసక్తి రేపుతున్నది. పలు ఆరోపణలపై కోర్టు కేసులను ఎదుర్కొంటున్న కల్మాడీ, అభయ్ చౌతాలాలకు జీవితకాల అధ్యక్ష పదవిని కట్టబెడుతూ తీర్మానాన్ని ఆమోదించడంపై ఐఒఎకు కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ ఇప్పటికే షోకాజ్ నోటీసు జారీ చేసిన విషయం తెలిసిందే.

12/30/2016 - 00:31

న్యూఢిల్లీ: తనకు లభించిన ఐఒఎ జీవితకాల అధ్యక్ష పదవిని ఐఒసి వద్దంటే, వెంటనే దానిని వదులుకుంటానని కల్మాడీతోపాటు ఆ హోదాను పొందిన అభయ్ సింగ్ చౌతాలా ప్రకటించాడు. అవినీతి, ఆశ్రీత పక్షపాతం, నిధుల దుర్వినియోగం వంటి పలు ఆరోపణలు కల్మాడీ, చౌతాలాపై ఉన్నాయి. న్యూఢిల్లీలో కామనె్వల్త్ గేమ్స్ సమయంలో చోటు చేసుకున్న అవినీతి కుంభకోణంలో కల్మాడీ జైలు జీవితాన్ని కూడా అనుభవించాడు.

12/29/2016 - 08:30

న్యూఢిల్లీ, డిసెంబర్ 28: భారత ఒలింపిక్ సంఘం (ఐఒఎ) కట్టబెట్టిన జీవితకాల అధ్యక్ష పదవిని సురేష్ కల్మాడీ తిరస్కరించాడు. అవినీతి, ఆశ్రీత పక్షపాతం, నిధుల దుర్వినియోగం వంటి ఆరోపణలపై ఐఒఎ అధ్యక్ష పదవి నుంచి ఉద్వాసనకు గురైన కల్మాడీని మంగళవారం చెన్నైలో జరిగిన సర్వసభ్య సమావేశంలో జీవితకాల అధ్యక్షుడిగా ఎంపిక చేశారు.

12/29/2016 - 08:28

మెల్బోర్న్, డిసెంబర్ 28: ఓపెనర్ డేవిడ్ వార్నర్ సెంచరీ చేయడంతో, పాకిస్తాన్‌తో జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఎదురుదాడిని కొనసాగిస్తున్నది. అంతకు ముందు పాకిస్తాన్ 9 వికెట్లకు 443 పరుగుల భారీ స్కోరువద్ద మొదటి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. రెండో రోజు ఆటలో సెంచరీ చేసి నాటౌట్‌గా ఉన్న ఓపెనర్ అజర్ అలీ డబుల్ సెంచరీ పూర్తి చేశాడు.

12/29/2016 - 08:28

న్యూఢిల్లీ: పలు ఆరోపణలపై కోర్టు కేసులను ఎదుర్కొంటున్న కల్మాడీ, అభయ్ చౌతాలాలకు జీవితకాల అధ్యక్ష పదవిని కట్టబెడుతూ తీర్మానాన్ని ఆమోదించడంపై ఐఒఎకు కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ షకాజ్ నోటీసు జారీ చేసింది. దీనిని రాజ్యాంగ విరుద్ధమైన చర్యగా అభివర్ణించింది. ఐఒఎ తన నిర్ణయాన్ని మార్చుకునే వరకూ అన్ని సంబంధాలను నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది.

12/29/2016 - 08:28

పోర్ట్ ఎలిజబెత్, డిసెంబర్ 28: శ్రీలంకతో జరుగుతున్న మొదటి టెస్టు మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో దక్షిణాఫ్రికాకు 81 పరుగుల స్వల్ప ఆధిక్యం లభించింది. దక్షిణాఫ్రికా మొదటి ఇన్నింగ్స్‌లో 286 పరుగులకు ఆలౌట్‌కాగా, అనంతరం బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక మ్యాచ్ రెండో రోజు, మంగళవారం ఆట ముగిసే సమయానికి ఏడు వికెట్లకు 181 పరుగులు చేసింది. ఈ ఓవర్‌నైట్ స్కోరుతో బుధవారం ఉదయం ఆటను కొనసాగించి 205 పరుగులకు ఆలౌటైంది.

12/29/2016 - 07:56

న్యూఢిల్లీ, డిసెంబర్ 28: రెజ్లింగ్‌లో తాను, తన అక్కాచెల్లెళ్లకు కోచ్‌గా వ్యవహరించిన తమ పెదనాన్న మహావీర్ ఫొగట్ శిక్షణ సమయంలో చాలా కఠినంగా ఉంటాడని భారత స్టార్ రెజ్లర్ వినేష్ ఫొగట్ చెప్పింది. దంగల్ సినిమాలో తన పెదనాన్న పాత్రను అమీర్ ఖాన్ సమర్థంగా పోషించాడని బుధవారం పిటిఐతో మాట్లాడుతూ వినేష్ చెప్పింది.

12/28/2016 - 00:50

జైపూర్, డిసెంబర్ 27: గుజరాత్‌కు చెందిన యువ బ్యాట్స్‌మన్ సమిత్ గోహెల్ ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో 117 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టాడు. ఒడిశాతో జరిగిన రంజీట్రోఫీ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో గుజరాత్ తరఫున ఓపెనింగ్ బ్యాట్స్‌మన్‌గా బరిలోకి దిగిన 26 ఏళ్ల సమిత్ 359 పరుగులతో నాటౌట్‌గా నిలిచి ప్రపంచ రికార్డు నెలకొల్పాడు.

Pages