S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

11/30/2016 - 03:28

మొహాలీ, నవంబర్ 29: మొహాలీలో ఇంగ్లండ్‌తో మూడో టెస్టుకు ముందు నెట్ ప్రాక్టీస్ సందర్భంగా భుజానికి ప్రాక్చర్ కావడంతో టీమిండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా దాదాపు ఆరువారాల పాటు పోటీ క్రికెట్‌కు దూరం కాబోతున్నాడు. ఈ కారణంగా జనవరి 15నుంచి ఇంగ్లండ్‌తో ప్రారంభమయ్యే వన్‌డే సిరీస్‌కు కూడా అతను అందుబాటులో ఉండే అవకాశాలు కనిపించడం లేదు.

11/30/2016 - 03:27

హామిల్టన్, నవంబర్ 29: పాకిస్తాన్‌తో స్వదేశంలో జరిగిన రెండు టెస్టుల క్రికెట్ సిరీస్‌ను న్యూజిలాండ్ జట్టు క్లీన్‌స్వీప్ చేసింది. హామిల్టన్‌లో మంగళవారం ముగిసిన రెండవ, చివరి టెస్టులో న్యూజిలాండ్ బౌలర్లు అన్యూహ్య రీతిలో విజృంభించి చివరి సెషన్‌లోనే తొమ్మిది వికెట్లు కైవసం చేసుకున్నారు.

11/30/2016 - 03:25

బ్యాంకాక్, నవంబర్ 29: ఆసియా కప్ మహిళల ట్వంటీ-20 క్రికెట్ టోర్నమెంట్‌లో భారత జట్టు అప్రతిహతంగా ముందుకు సాగుతోంది. మంగళవారం ఇక్కడ జరిగిన మ్యాచ్‌లో భారత జట్టు 5 వికెట్ల తేడాతో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌ను మట్టికరిపించి ఈ టోర్నీలో వరుసగా మూడో విజయాన్ని నమోదు చేసుకుంది. టాస్ గెలిచిన భారత జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ ఫీల్డింగ్ ఎంచుకుంది.

11/29/2016 - 07:35

రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్ 4 వికెట్లకు 78

11/29/2016 - 07:33

హామిల్టన్, నవంబర్ 28: న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్ ఆసక్తిని రేకిత్తిస్తున్నది. న్యూజిలాండ్ తన రెండో ఇన్నింగ్స్‌ను ఐదు వికెట్లకు 313 పరుగుల స్కోరువద్ద డిక్లేర్ చేసి, ప్రత్యర్థి ముందు 369 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. మాజీ కెప్టెన్ రాస్ టేలర్ అద్భుత సెంచరీతో కదంతొక్కాడు. అతని ప్రతిభతో కివీస్ మెరుగైన స్కోరును నమోదు చేయగలిగింది.

11/29/2016 - 07:33

మకావూ, నవంబర్ 28: గత వారం చైనా ఓపెన్‌లో టైటిల్‌ను సాధించి, ఆతర్వాత హాంకాంగ్ ఓపెన్ సూపర్ సిరీస్‌లో రన్నరప్‌గా నిలిచిన తెలుగు తేజం, రియో ఒలింపిక్స్ రజత పతక విజేత పివి సింధు మంగళవారం నుంచి ఇక్కడ ప్రారంభం కానున్న మకావూ ఓపెన్ గ్రాండ్ ప్రీ గోల్డ్ బాడ్మింటన్ టోర్నమెంట్ టైటిల్‌పై కనే్నసింది.

11/29/2016 - 07:32

జాగ్రెబ్, నవంబర్ 28: డేవిస్ కప్ పురుషుల టీం టెన్నిస్ చాంపియన్‌షిప్‌ను అర్జెంటీనా మొట్టమొదటిసారి కైవసం చేసుకుంది. 1900లో మొదలైన ఈ టోర్నీని అర్జెంటీనా 3-2 తేడాతో క్రొయేషియాను ఓడించి తొలిసారి తన ఖాతాలో వేసుకుంది. కీలక మ్యాచ్‌ల్లో జువాన్ మార్టిన్ డెల్ పొట్రో, ఫెడెరికో డెల్ బొనిస్ ప్రత్యర్థులను ఓడించి, అర్జెంటీనాకు చిరస్మరణీయ విజయాన్ని అందించారు.

11/29/2016 - 07:32

న్యూఢిల్లీ, నవంబర్ 28: సుప్రీం కోర్టుకు లోధా కమిటీ దాఖలు చేసిన స్టేటస్ రిపోర్ట్‌పై చర్చించడానికి భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ) ప్రత్యేక సర్వసభ్య సమావేశం (ఎస్‌జిఎం) డిసెంబర్ 2న జరిగే అవకాశాలున్నాయి. పేరు చెప్పడానికి ఇష్టపడని బోర్డుకు చెందిన ఒక అధికారి సోమవారం పిటిఐతో మాట్లాడుతూ లోధా కమిటీ స్టేటస్ రిపోర్ట్ తర్వాత తలెత్తిన పరిణామాలపై చర్చించనున్నట్టు తెలిపాడు.

11/28/2016 - 00:35

మొహాలీ, నవంబర్ 27: ఇక్కడి పిసిఎ స్టేడియంలో జరుగుతున్న మూడో టెస్టు మ్యాచ్ రెండో రోజు ఆటలో ఇంగ్లాండ్‌ను 283 పరుగులకు ఆలౌట్ చేసిన టీమిండియా తర్వాత మొదటి ఇన్నింగ్స్ ఆరంభించి ఆట ముగిసే సమయానికి ఆరు వికెట్లకు 271 పరుగులు చేసింది. ప్రత్యర్థి కంటే కేవలం 12 పరుగులు వెనుకంజలో ఉన్న భారత్ చేతిలో నాలుగు వికెట్లున్నాయి. దీనితో తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం సంపాదించడం ఖాయంగా కనిపిస్తున్నది.

11/28/2016 - 00:31

మొహాలీ, నవంబర్ 27: భుజం గాయంతో బాధపడుతున్న భారత యువ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యను మెరుగైన చికిత్స కోసం టెస్టు జట్టు నుంచి రిలీజ్ చేశారు. మొహాలీలో ఇంగ్లాండ్‌తో మూడో టెస్టు ప్రారంభానికి ముందు, నెట్స్‌లో ఆడుతున్న సమయంలో పాండ్య గాయపడ్డాడు.

Pages