S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

11/16/2016 - 01:19

విశాఖపట్నం (స్పోర్ట్స్): రెండో టెస్ట్ మ్యాచ్‌లో తలపడనున్న భారత్- ఇంగ్లాండ్ జట్లు మంగళవారం విశాఖ ఎసిఎ-విడిసిఎ స్టేడియంలో ముమ్మర సాధన చేశాయి. స్టేడియానికి ఉదయం 9 గంటలకు చేరుకున్న ఇంగ్లాండ్ జట్టు పిచ్‌ను కొంతసేపు పరిశీలించిన అనంతరం నెట్ ప్రాక్టీస్‌లో పాల్గొంది. కుక్ నాయకత్వంలోని ఆ జట్టు ఎక్కువగా ఫిట్‌నెస్‌కు ప్రాధాన్యతనిచ్చి మూడు గంటల పాటు విరామం లేకుండా నెట్స్‌లో సాధన చేసింది.

11/16/2016 - 01:14

విశాఖపట్నం (స్పోర్ట్స్): విశాఖ పిచ్ ప్రత్యేకంగా టెస్ట్ మ్యాచ్ నిమిత్తం తయారు చేసిన వికెట్ అని, బ్యాటింగ్, బౌలింగ్‌కు సమానంగా పిచ్ సహకరిస్తుందని పిచ్ క్యూరేటర్ మల్లయ్య తెలిపాడు. స్టేడియంలో ఉన్న తొమ్మిది పిచ్‌లలో నాలుగో పిచ్‌ను ఈ మ్యాచ్ కోసం వినియోగిస్తున్నామని చెప్పాడు.

11/16/2016 - 01:13

హోబర్ట్, నవంబర్ 15: దక్షిణాఫ్రికా చేతిలో ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు మరోసారి చిత్తుగా ఓడింది. ఇక్కడ జరిగిన రెండో టెస్టు నాలుగు రోజుల్లోనే ముగిసింది. కేల్ అబోట్ విజృంభణకు అడ్డుకట్ట వేయలేకపోయిన ఆసీస్ రెండో ఇన్నింగ్స్‌లోనూ దారుణంగా విఫలమై ఇన్నింగ్స్ 80 పరుగుల తేడాతో పరాజయాన్ని చవిచూసింది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను దక్షిణాఫ్రికా 2-0 తేడాతో సొంతం చేసుకుంది.

11/16/2016 - 01:10

హోబర్ట్: దక్షిణాఫ్రికా చేతిలో వరుసగా రెండో టెస్టును కూడా కోల్పోయిన ఆస్ట్రేలియా జట్టుపై కోచ్ డారెన్ లీమన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. ప్రస్తుత జట్టులోని కేవలం నలుగురి స్థానం మాత్రమే పదిలంగా ఉంటుందని, మిగతా వారి గురించి తాను ఏమీ చెప్పలేనని అతను ఒక ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించాడు. ఆస్ట్రేలియా కేవలం 20 ఓవర్ల వ్యవధిలో, 32 పరుగులకే ఎనిమిది వికెట్లు కోల్పోవడం లీమన్‌ను ఆందోళనకు గురి చేస్తున్నది.

11/16/2016 - 01:09

న్యూఢిల్లీ, నవంబర్ 15: లక్నోలో వచ్చే నెల 8 నుంచి 18 వరకు జరిగే జూనియర్ హాకీ ప్రపంచ కప్ చాంపియన్‌షిప్ పోటీల్లో పాల్గొనేందుకు పాకిస్తాన్ జట్టు రానుంది. సరిహద్దుల్లో చొరబాట్లు, కాల్పుల ఉల్లంఘన, ఉగ్రవాదులను ప్రేరేపించి దాడులకు పాల్పడడం వంటి చర్యలకు పాల్పడుతున్న పాకిస్తాన్‌తో భారత్ ద్వైపాక్షిక క్రీడా సంబంధాలను తెగతెంపులు చేసుకున్న విషయం తెలిసిందే.

11/16/2016 - 01:08

విజయవాడ (స్పోర్ట్స్), నవంబర్ 15: భారత్, వెస్టిండీస్ మహిళల క్రికెట్ జట్ల మధ్య మూలపాడులోని దేవినేని వెంకటరమణ - ప్రణీత క్రికెట్ గ్రౌండ్‌లో జరుగుతున్న వనే్డ క్రికెట్ సిరీస్‌లో బుధవారం మూడో వనే్డ జరుగనుంది. ఇప్పటికే మొదటి రెండు వనే్డల్లో విజయం సాధించి సిరీస్‌ను కైవసం చేసుకున్న భారత జట్టు బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ విభాగాల్లో చాలా పటిష్టంగా ఉంది.

11/16/2016 - 01:07

చైనాలోని ఫజూలో బుధవారం నుంచి ప్రారంభం కానున్న థాయ్‌హాట్ చైనా ఓపెన్ సూపర్ సిరీస్ ప్రీమియర్ బాడ్మింటన్‌కు సిద్ధంగా ఉన్న భారత స్టార్ సైనా నెహ్వాల్. మోకాలికి శస్తచ్రికిత్స అనంతరం ఆమె తొలిసారి ఆడుతున్న టోర్నీ ఇదే

11/16/2016 - 01:05

బెంగళూరు, నవంబర్ 15: దేశంలో 500, 1,000 రూపాయల నోట్లను రద్దు చేస్తూ ప్రధాని నరేంద్ర మోదీ తీసుకున్న నిర్ణయానికి తాను సంపూర్ణ మద్దతునిస్తానని ఐదు పర్యాయాలు ప్రపంచ మహిళల బాక్సింగ్ చాంపియన్‌షిప్‌ను కైవసం చేసుకున్న భారత స్టార్ బాక్సర్ మేరీ కోమ్ స్పష్టం చేసింది.

11/16/2016 - 01:05

విజయవాడ (స్పోర్ట్స్), నవంబర్ 15: కృష్ణాజిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విజయవాడ దండమూడి రాజగోపాలరావు నగరపాలక సంస్థ ఇండోర్ స్టేడియంలో డిసెంబర్ 2నుండి 5 వరకు 30వ జాతీయస్థాయి సబ్‌జూనియర్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ నిర్వహిస్తున్నట్లు విజయవాడ మున్సిపల్ కమిషనర్ వీరపాండియన్ తెలిపారు.

11/15/2016 - 08:38

విశాఖపట్నం (స్పోర్ట్స్), నవంబర్ 14 : విశాఖలోని విశాఖ ఎసిఎ-విడిసిఎ స్టేడియంలో మైదానం మొదట్లో స్పిన్నర్లకు అంతగా అనుకూలించకపోవచ్చన్న అభిప్రాయం వ్యక్తమవుతున్నది. ప్రారంభంలో ఫ్లాట్‌గా ఉండి, క్రమంగా టర్న్ తీసుకుంటుందని నిపుణులు అంటున్నారు. భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ) క్యూరేటర్ కస్తూరి శ్రీరాం కూడా దాదాపు ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు.

Pages