S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

09/30/2016 - 05:41

కోల్‌కతా, సెప్టెంబర్ 29: కోల్‌కతా ఈడెన్ గార్డెన్స్ మైదానంలో భారత క్రికెట్ జట్టు న్యూజిలాండ్‌తో శుక్రవారం నుంచి రెండో టెస్టు ఆడుతుంది. అయతే, ఈ రెండు జట్ల మధ్య ఈడెన్‌లో ఇది ముచ్చటగా మ్యాచ్. ఇది భారత్‌కు స్వదేశంలో 250వ టెస్టుకావడం విశేషం. న్యూజిలాండ్‌తో ఈడెన్‌లో భారత్ ఇంతకు ముందు ఆడిన రెండు టెస్టులు డ్రా అయ్యాడు.

09/30/2016 - 05:39

కోల్‌కతా, సెప్టెంబర్ 29: న్యూజిలాండ్‌తో శుక్రవారం నుంచి ప్రారంభం కానున్న రెండో టెస్టు కోసం ఈడెన్ గార్డెన్స్ మైదానంలో టీమిండియా గురువారం ముమ్మరంగా ప్రాక్టీస్ చేసింది. ఇందులో వింత లేకపోయినా, కెప్టెన్ విరాట్ కోహ్లీ, సుమారు రెండేళ్ల తర్వాత మళ్లీ జాతీయ జట్టులోకి వచ్చిన గౌతం గంభీర్ సరదాగా ముచ్చటించుకోవడం మాత్రం విచిత్రమే.

09/30/2016 - 05:38

ఢాకా, సెప్టెంబర్ 29: అండర్-18 ఆసియా కప్ హాకీ టోర్నమెంట్ సెమీ ఫైనల్‌లో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌ను చిత్తుచేసిన భారత్ ఫైనల్‌కు దూసుకెళ్లింది. ఇరు దేశాల సరిహద్దుల వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకున్న నేపథ్యంలో జరిగిన ఈ మ్యాచ్‌లో భారత్ పూర్తి ఆధిపత్యాన్ని కనబరచింది. ప్రారంభం నుంచే దాడులకు ఉపక్రమించి, ఏడో నిమిషంలోనే శివం ఆనంద్ ద్వారా తొలి గోల్‌ను సంపాదించింది.

09/30/2016 - 05:36

సియోల్, సెప్టెంబర్ 29: కొరియా ఓపెన్ బాడ్మింటన్ సూపర్ సిరీస్ పురుషుల సింగిల్స్‌లో భారత ఆటగాడు అజయ్ జయరామ్ క్వార్టర్ ఫైనల్స్ చేరాడు. ప్రీ క్వార్టర్స్‌లో అతను హువాంగ్ యుజియాంగ్‌ను 21-15, 21-18 తేడాతో ఓడించాడు. సెమీస్‌లో స్థానం కోసం అతను శుక్రవారం కొరియా ఆటగాడు లీ హ్యున్‌తో తలపడతాడు.

09/30/2016 - 05:36

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 29: జాతీయ క్రీడా సమాఖ్యలతో కేంద్ర క్రీడాశాఖ మంత్రి విజయ్ గోయల్ గురువారం భేటీ అయ్యాడు. రియో ఒలింపిక్స్‌కు భారీ బృందాన్ని పంపించినప్పటికీ, కేవలం రెండు పతకాలతో సంతృప్తి చెందాల్సి రావడంతో కేంద్రం నిరాశ చెందింది. రియో వైఫల్యాలపై పోస్ట్‌మార్టం ప్రారంభించింది.

09/30/2016 - 05:30

హైదరాబాద్, సెప్టెంబర్ 29: అమరావతి రాజధాని నిర్మాణానికి సంబంధించి ఇంత వరకూ సిద్ధం చేసిన డిజైన్లలో మార్పులకు ప్రభుత్వం సిద్ధమైంది. ఆర్కిటెక్చర్‌తో కూడిన కొత్త డిజైన్లను మరోమారు స్వీకరించి అవసరమైన చేర్పులు మార్పులు చేసేందుకు సిద్ధంగా ఉంది.

09/30/2016 - 05:29

హైదరాబాద్, సెప్టెంబర్ 29: వైద్య పునరావాస సేవలకోసం అపోలోహాస్పిటల్స్ ఇటలీకి చెందిన కెఒఎస్ గ్రూప్‌తో కలిసి అపోకస్ పేరుతో ఒక జాయింట్ వెంచర్‌ను ప్రారంభించింది. అపోకస్ మొదటి పునరావాస సదుపాయ ఆసుపత్రిని హైదరాబాద్‌లో ఏర్పాటు చేస్తారు. దశలవారీగా మెట్రో నగరాలకు ఈ సదుపాయాన్ని వర్తింప చేస్తారు.

09/30/2016 - 05:28

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 29: దేశ ఆర్థిక సుస్థిరతకు ఉగ్రవాదం అతిపెద్ద ముప్పుగా పరిణమించిందని, ఈ సమస్యను అధిగమించేందుకు చేపట్టే నిర్ణయాత్మక చర్యలతో వృద్ధిరేటుకు ఊతం లభిస్తుందని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ గురువారం ఉద్ఘాటించింది.

09/30/2016 - 05:26

హైదరాబాద్, సెప్టెంబర్ 29: దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన తెలంగాణ ఎమ్సెట్-2 లీకేజి కేసులో అక్టోబర్ నెలలో సిఐడి శాఖ చార్జిషీటును దాఖలు చేయనుంది. ఈ కేసులో ప్రశ్నాపత్రం లీకేజికి సంబంధించి దాదాపు 58 మంది నిందితులున్నట్లు సిఐడి జాబితా తయారు చేసింది. ఇందులో ఇంతవరకు 35 మందిని అరెస్టు చేశారు. ప్రశ్నాపత్రం లీకేజిలో ప్రధాన సూత్రధారిగా ఉన్న సునీల్ కుమార్ సింగ్ కోసం సిఐడి బృందాలు వేటను ముమ్మరం చేశాయి.

09/30/2016 - 05:25

కోల్‌కతా, సెప్టెంబర్ 29: ఈడెన్ గార్డెన్స్ మైదానం కేవలం స్పిన్ పిచ్ కాదని, టెస్టుకు అన్ని విధాలా అనుకూలంగా ఉంటుందని భారత మాజీ కెప్టెన్, బెంగాల్ క్రికెట్ సంఘం (సిఎబి) అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ స్పష్టం చేశాడు. కాన్పూర్‌లో వికెట్ పూర్తిగా స్పిన్‌కు అనుకూలించగా, భారత బౌలర్లు రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా దానిని సద్వినియోగం చేసుకున్న విషయం తెలిసిందే.

Pages