S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

09/10/2016 - 14:09

ఢిల్లీ : పారాలింపిక్స్‌లో భారతదేశానికి బంగారు పతకం తెచ్చిన మొట్ట మొదటి హై జంపర్‌గా మరియప్పన్ తంగవేలు రికార్డు సృష్టించాడు. 1.89 మీటర్లు జంప్ చేసి ఈ పతకాన్ని సొంతం చేసుకున్నాడు. మరో క్రీడాకారుడు వరుణ్ సింగ్ భాటి 1.86 మీటర్లు జంప్ చేసి కాంస్య పతకాన్ని సాధించాడు. టీ-42 హైజంప్ ఈవెంట్‌లో వీరిద్దరూ ఈ పతకాలు సాధించారు. స్వర్ణ పతక విజేతకు రూ.75 లక్షలు, కాంస్య పతక విజేతకు రూ.

09/10/2016 - 08:36

న్యూయార్క్, సెప్టెంబర్ 9: స్వదేశంలో జరుగుతున్న యుఎస్ ఓపెన్ టైటిల్‌ను కైవసం చేసుకోవాలన్న పట్టుదలతో ఉన్న సెరెనా విలియమ్స్ అనూహ్యంగా ఓటమిపాలైంది. ప్రపంచ నంబర్ వన్ ర్యాంక్‌ను కూడా చేజార్చుకొని, రెండు విధాలా నష్టపోయింది. ప్రపంచ నంబర్ వన్‌గా బరిలోకి దిగిన సెరెనా ద్వితీయ ర్యాంక్ క్రీడాకారిణిగా యుఎస్ నుంచి నిష్క్రమించింది.

09/10/2016 - 08:33

న్యూయార్క్, సెప్టెంబర్ 9: గ్రాండ్ శ్లామ్ టెన్నిస్‌లో అత్యధిక టైటిళ్లు సాధించిన మార్గరెట్ కోర్ట్ రికార్డు సెరెనాకు అందు తుందా? లేదా? అన్నది ఇప్పుడు చర్చనీ యాంశమైంది. గ్రాండ్ శ్లామ్ చాంపియన్‌షిప్స్ ఓపెన్ టోర్నీలుగా మారిన తర్వాత స్ట్ఫె గ్రాఫ్ 22 టైటిళ్లను కైవసం చేసుకుంది. అత్యధిక పర్యాయాలు విజేతగా నిలిచిన క్రీడాకారిణుల జాబితాలో అగ్రస్థానాన్ని ఆక్రమించింది.

09/10/2016 - 08:33

న్యూయార్క్, సెప్టెంబర్ 9: సెరెనాను రెండో స్థానంలోకి నెట్టి, ప్రపంచ టెన్నిస్ ర్యాంకింగ్స్‌లో నంబర్ వన్ స్థానాన్ని ఆక్రమించిన ఏంజెలిక్ కెర్బర్ మరో గ్రాండ్ శ్లామ్ టైటిల్ వేటను కొనసాగిస్తున్నది. యుఎస్ ఓపెన్ మహిళల సింగిల్స్ సెమీ ఫైనల్‌లో మాజీ ప్రపంచ నంబర్ వన్ కారోలిన్ వొజ్నియాకిని ఆమె 6-4, 6-3 తేడాతో ఓడించి ఫైనల్ చేరింది. టైటిల్ కోసం కరోలినా ప్లిస్కోవాతో ఫైనల్ పోరును ఖాయం చేసుకుంది.

09/10/2016 - 08:33

రియో డి జెనీరో, సెప్టెంబర్ 9: సుమారు మూడు వారాల క్రితం రియో ఈత కొలనులో అమెరికా స్విమ్మర్ మైఖేల్ ఫెల్ప్స్ ప్రకటనలు సృష్టించాడు. ఐదు స్వర్ణాలను, ఒక రజత పతకాన్ని గెల్చుకొని తనకు తిరుగులేదని నిరూపించాడు. ఇప్పుడు పారాలింపిక్స్ జరుగుతుండగా, స్విమ్మింగ్ పూల్‌లో మరో ఫెల్ప్స్ దర్శనమిస్తున్నాడు.

09/10/2016 - 08:32

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 9: రియో ఒలింపిక్స్‌లో భారత బృందం దారుణ వైఫల్యాలను ఎదుర్కోవడానికి ఎన్నో కారణాలున్నాయని కేంద్రానికి సమర్పించనున్న నివేదికలో క్రీడా ప్రాధికార సంస్థ (సాయ్) పేర్కొంది. రియోలో 117 మంది పోటీపడినప్పటికీ, కేవలం రెండు పతకాలు మాత్రమే దక్కిన విషయం తెలిసిందే.

09/10/2016 - 08:32

కొలంబో, సెప్టెంబర్ 9: శ్రీలంకతో శుక్రవారం జరిగిన రెండో టి-20 మ్యాచ్‌లో ఆస్ట్రేలియా సు నాయాసంగా గెలిచింది. 129 పరుగుల లక్ష్యాన్ని 17.5 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయ ఛేదించింది. రెండు మ్యాచ్‌ల సిరీస్‌ను 2-0 తేడాతో కైవసం చేసుకుంది. టాస్ గెలిచిన లంక తొలుత బ్యాటింగ్ కు దిగింది. అయతే, అది పొరపాటు నిర్ణయమని వికెట్ల పతనం స్పష్టం చేసింది.

09/10/2016 - 08:31

చెన్నై, సెప్టెంబర్ 9: భారత జాతీయ జట్టు సీనియర్ ఆటగాడు, స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ క్రికెట్ మైదానంలో సంయమనం కోల్పోయి ఒక యువ క్రికెటర్‌తో యుద్ధానికి దిగడం అందరినీ దిగ్భ్రాంతికి గురి చేసింది. తమిళనాడు ప్రీమియర్ లీగ్‌లో భాగంగా చేపాక్ సూపర్ గిల్లీస్, దిండిగల్ డ్రాగాన్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. దిండిగల్ కెప్టెన్ అశ్విన్‌తోపాటు జగదీశ్ బ్యాటింగ్ చేస్తున్నాడు.

09/10/2016 - 08:31

బ్రిస్బేన్, సెప్టెంబర్ 9: ఆస్ట్రేలియా ‘ఎ’తో జరుగుతున్న నాలుగు రోజుల అనధికార టెస్టులో భారత్ ‘ఎ’ హోరాహోరీగా పోరాడుతున్నది. తొలి ఇన్నింగ్స్‌లో 230 పరుగులకే ఆలౌటైన భారత్ ఆతర్వాత ఆస్ట్రేలియాను 228 పరుగులకే కట్టడి చేసి, రెండు పరుగుల ఆధిక్యాన్ని సంపాదించింది. ఆసీస్ జట్టులో జో బర్న్స్ 78, పీటర్ హ్యాండ్‌కోమ్ 87 పరుగులు సాధించారు.

09/09/2016 - 01:27

రియో ఒలింపిక్స్‌లో కేవలం రెండు పతకాలు సాధించినందుకే భుజాలు చరచుకొని, ఏదో అద్భుతాన్ని సాధించామని విర్రవీగాల్సిన అవసరం లేదని కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖకు తెలిసొచ్చింది. వచ్చే ఒలింపిక్స్‌ను లక్ష్యంగా చేసుకొని క్రీడా రంగ అభివృద్ధికి, ప్రక్షాళనకు టాస్క్ఫోర్స్‌ను ఏర్పాటు చేస్తామని ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించిన తర్వాత క్రీడా మంత్రి విజయ్ గోయల్ రియో వైఫల్యాలపై దృష్టి సారించారు.

Pages