S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

06/30/2016 - 08:22

కోల్‌కతా, జూన్ 29: భారత మాజీ క్రికెటర్లు రవి శాస్ర్తీ, సౌరవ్ గంగూలీ మధ్య వివాదం క్రమంగా తీవ్ర రూపం దాలుస్తున్నది. భారత కోచ్ పదవికి తాను బ్యాంకాక్ నుంచి ఆన్‌లైన్ ద్వారా ఇంటర్వ్యూ ఇస్తున్నప్పుడు క్రికెట్ సలహా కమిటీ (సిఎసి)లో సభ్యుడైన గంగూలీ అక్కడ లేకపోవడాన్ని రవి శాస్ర్తీ విమర్శించడంతో వివాదం మొదలైంది.

06/30/2016 - 08:20

జైపూర్, జూన్ 29: ప్రో కబడ్డీ చాంపియన్‌షిప్‌లో భాగంగా జైపూర్ పింక్ పాంథర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో తెలుగు టైటాన్స్ జట్టు నాలుగు పాయింట్ల తేడాతో ఓటమిపాలైంది. పాంథర్స్ 28 పాయింట్లు సంపాదించగా, టైటాన్స్ జట్టు 24 పాయింట్లు చేసింది. పాంథర్స్ తరఫున రాజేష్ నర్వాల్ అత్యధికంగా ఎనిమిది పాయింట్లు సాధించాడు. జస్వీర్ సింగ్, అమిత్ హూతా, రణ్ సింగ్ తలా మూడు పాయింట్లు చేశారు.

06/30/2016 - 08:19

సిడ్నీ, జూన్ 29: ప్రపంచ మేటి హర్డిల్స్ రన్నర్, ఆస్ట్రేలియా అథ్లెట్ శాలీ పియర్స్ ఈఏడాది ఆగస్టులో జరిగే రియో ఒలింపిక్స్‌కు దూరమయ్యే ప్రమాదం కనిపిస్తున్నది. 2012 లండన్ ఒలింపిక్స్ మహిళల 100 మీటర్ల హర్డిల్స్‌లో స్వర్ణ పతకం సాధించిన ఆమె రియో ఒలింపిక్స్‌కు గోల్డ్ కోస్ట్‌లో ప్రాక్టీస్ చేస్తున్నది. అయితే, ట్రైనింగ్ సెషన్‌లో ఆమె కాలి కండరాలు చిట్లినట్టు స్థానిక వార్తాపత్రికలు పేర్కొన్నాయి.

06/30/2016 - 08:19

బెంగళూరు, జూన్ 29: భారత జట్టుకు అధికారులు కాదు.. ఆటగాళ్లే ముఖ్యమని టీమిండియా చీఫ్ కోచ్‌గా బాధ్యతలు తీసుకున్న తర్వాత మొట్టమొదటిసారి అధికారికంగా ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో అనిల్ కుంబ్లే స్పష్టం చేశాడు. వెస్టిండీస్ టూర్‌కు వెళ్లేందుకు సిద్ధమవుతున్న భారత జట్టుకు బుధవారం శిక్షణ శిబిరం ఆరంభమైంది. ఈ సందర్భంగా కుంబ్లే విలేఖరులతో మాట్లాడుతూ ఆటగాళ్ల కంటే ఎవరూ గొప్పకాదని వ్యాఖ్యానించాడు.

06/30/2016 - 08:18

లండన్, జూన్ 29: ప్రపంచ నంబర్ వన్ ఆటగాడు నొవాక్ జొకోవిచ్ వింబుల్డన్ గ్రాండ్ శ్లామ్ టెన్నిస్ టైటిల్‌ను నిలబెట్టుకునే దిశగా మరో అడుగు ముందుకేశాడు. రెండో రౌండ్‌లో అతను ఆడ్రియన్ మనారినోను 6-4, 6-3, 7-6 తేడాతో ఓడించి మూడో రౌండ్ చేరాడు. అంతకు ముందు జరిగిన మ్యాచ్‌లో రెండో ర్యాంక్ ఆటగాడు ఆండీ ముర్రే మొదటి రౌండ్‌లో లియామ్ బ్రాడీని 6-2, 6-3, 6-4 తేడాతో ఓడించాడు.

06/30/2016 - 08:17

మార్సెలీ, జూన్ 29: యూరో 2016 సాకర్ చాంపియన్‌షిప్ క్వార్టర్ ఫైనల్స్‌లో స్టార్ ఆటగాడు క్రిస్టియానో రొనాల్డో సామర్థ్యంపై పూర్తి భరోసాతో పోర్చుగల్ జట్టు బరిలోకి దిగనుంది. గురువారం పోలాండ్‌తో జరిగే ఈ మ్యాచ్‌లో రోనాల్డో ఏ స్థాయిలో రాణిస్తాడనే అంశంపైనే పోర్చుగల్ విజయావకాశాలు ఆధారపడ్డాయి.

06/29/2016 - 01:19

పర్యటన షెడ్యూలు ఇదీ
సెప్టెంబర్ 22-26: కాన్పూర్‌లో తొలి టెస్టు
సెప్టెంబర్ 20-అక్టోబర్ 4: ఇండోర్‌లో రెండో టెస్టు
అక్టోబర్ 8-12: కోల్‌కతాలో మూడో టెస్టు
అక్టోబర్ 16: ధర్మశాలలో తొలి వనే్డ
అక్టోబర్ 19: ఢిల్లీలో రెండో వనే్డ
అక్టోబర్ 23: మొహాలీలో మూడో వనే్డ
అక్టోబర్ 26: రాంచీలో నాలుగో వనే్డ
అక్టోబర్ 29: విశాఖలో ఐదో వనే్డ

06/29/2016 - 01:17

నైస్ (ఫ్రాన్స్), జూన్ 28: యూరోకప్ ఫుట్‌బాల్ టోర్నమెంట్లలో ఫేవరేట్ జట్లలో ఒకటిగా బరిలోకి దిగిన ఇంగ్లండ్ జట్టు ప్రీ క్వార్టర్ ఫైనల్‌లో పెద్దగా పేరు లేని ఐస్‌లాండ్ చేతిలో 2-1 గోల్స్ తేడాతో ఓటమి పాలయి ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది.

06/29/2016 - 01:17

బ్యూనస్ ఎయిర్స్, జూన్ 28: కోపా అమెరికా ఫైనల్లో చిలీతో జరిగిన పెనాల్టీ షూటవుట్‌లో అర్జెంటీనా ఓటమి పాలవడానికి పరోక్షంగా తాను బాధ్యుడినయ్యానన్న బాధతో అంతర్జాతీయ ఫుట్‌బాల్ రంగానికి దూరమవుతున్నట్లు ప్రకటించిన లియోనెల్ మెస్సీపై నిర్ణయం మార్చుకోవాలంటూ పెద్ద ఎత్తున ఒత్తిళ్లు వస్తున్నాయి.

06/29/2016 - 01:16

లండన్, జూన్ 28: వింబుల్డన్ గ్రాండ్ శ్లామ్ టెన్నిస్ టోర్నమెంట్‌లో డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగిన అమెరికా ‘నల్ల కలువ’ సెరెనా విలియమ్స్ రెండో రౌండ్‌కు దూసుకెళ్లింది. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో ప్రస్తుతం అగ్రస్థానంలో కొనసాగుతున్న సెరెనా (34) మహిళల సింగిల్స్ తొలి రౌండ్‌లో స్విట్జర్లాండ్‌కు చెందిన క్వాలిఫయర్ అమ్రా సాదికోవిచ్‌ను వరుస సెట్ల తేడాతో మట్టికరిపించి శుభారంభం సాధించింది.

Pages