S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

05/31/2016 - 06:38

పారిస్: ఫ్రెంచ్ ఓపెన్‌ను వర్షం వెంటాడింది. దాదాపుగా ప్రతిరోజూ వర్షం కారణంగా పలు మ్యాచ్‌లకు అంతరాయం ఏర్పడుతునే ఉంది. అయితే, సోమవారం జరగాల్సిన మ్యాచ్‌లన్నీ వర్షం వల్ల రద్దు కావడం విశేషం. 2000లో చివరిసారి ఈ విధంగా ఒక రోజులో ఒక్క మ్యాచ్ కూడా జరగలేదు. 16 ఏళ్ల తర్వాత మొదటిసారి మరోసారి అదే పరిస్థితి పునరావృతమైంది.

05/31/2016 - 06:37

పారిస్: ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్ శ్లామ్ టెన్నిస్ టోర్నమెంట్ మహిళల డబుల్స్ నుంచి సానియా మీర్జా, మార్టినా హింగిస్ జోడీ నిష్క్రమించింది. మూడో రౌండ్‌లో బార్బొరా క్రెజిసికొవా, కాతెరీన సింజకొవా జోడీతో తలపడిన వీరు 3-6, 2-6 తేడాతో ఓటమిపాలయ్యారు. ఈ సీజన్‌లో మరో టైటిల్‌పై కనే్నసిన ‘సాన్‌టినా’ జోడీ క్వార్టర్ ఫైనల్స్ చేరకుండానే ఓటమిపాలుకావడం అభిమానులను నిరాశకు గురి చేసింది.

05/31/2016 - 06:37

చెస్టర్ లీ స్ట్రీట్, మే 30: శ్రీలంకతో జరిగిన రెండో టెస్టును తొమ్మిది వికెట్ల తేడాతో గెల్చుకున్న ఇంగ్లాండ్ మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ను 2-0 తేడాతో కైవసం చేసుకుంది. మొదటి ఇన్నింగ్స్‌లో మూడు వికెట్లు పడగొట్టిన జేమ్స్ ఆండర్సన్ రెండో ఇన్నింగ్స్‌లో మరో ఐదు వికెట్లు కూల్చి లంకను దారుణంగా దెబ్బతీశాడు.

05/31/2016 - 06:36

విజయవాడ (స్పోర్ట్స్), మే 30: దేశంలోని అన్ని క్రికెట్ సంఘాలకు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ (ఎసిఎ) ఆదర్శమని భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ) నూతన అధ్యక్షుడు, హిమాచల్‌ప్రదేశ్‌కు చెందిన పార్లమెంటు సభ్యుడు అనురాగ్ ఠాకూర్ అన్నాడు.

05/30/2016 - 07:28

పారిస్, మే 29: ప్రపంచ నంబర్ వన్, డిఫెండింగ్ చాంపియన్ సెరెనా విలియమ్స్ ఇక్కడ జరుగుతున్న ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్ శ్లామ్ టెన్నిస్ టోర్నమెంట్ మహిళల సింగిల్స్‌లో ప్రీ క్వార్టర్స్ చేరింది. కెరీర్‌లో 22వ గ్రాండ్ శ్లామ్ టైటిల్‌పై కనే్నసిన ఆమె మూడో రౌండ్‌లో ఫ్రాన్స్‌కు చెందిన క్రిస్టినా మ్లాడెనోవిచ్‌ను 6-4, 7-6 తేడాతో ఓడించింది.

05/30/2016 - 07:27

పారిస్, మే 29: సెరెనా విలియమ్స్‌ను జికా వైరస్ భయం వెంటాడుతున్నది. ఆగస్టులో రియో ఒలింపిక్స్ జరగనుండగా, అక్కడ తీవ్రమవుతున్న జికా వైరస్ సమస్య ఆందోళన కలిగిస్తున్నదని సెరెనా చెప్పింది. ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్ శ్లామ్ మూడో రౌండ్‌లో క్రిస్టినా మ్లాడెనోవిచ్‌ను ఓడించిన తర్వాత ఆమె విలేఖరులతో మాట్లాడుతూ బ్రెజిల్‌ను జికా వైరస్ కుదిపేస్తున్న విషయాన్ని ప్రస్తావించింది.

05/30/2016 - 07:27

జకార్తా, మే 29: క్వాలిఫయర్స్‌తో సోమవారం నుంచి ప్రారంభం కానున్న ఇండోనేషియా ఓపెన్ బాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో విజయమే లక్ష్యంగా బరిలోకి దిగుతానని భారత స్టార్, హైదరాబాదీ సైనా నెహ్వాల్ చెప్పింది. ఈ ఈవెంట్ కోసం జకార్తా వచ్చిన ఆమె పిటిఐతో మాట్లాడుతూ ఫిట్నెస్ సమస్యలేవీ ప్రస్తుతం బాధించడం లేదని చెప్పింది. రియో ఒలింపిక్స్ సమీపిస్తున్న నేపథ్యంలో జకార్తా ఓపెన్ వామప్ ఈవెంట్‌గా ఉపయోగపడుతుందని తెలిపింది.

05/30/2016 - 07:26

న్యూఢిల్లీ, మే 29: భారత వెటరన్ డిస్కస్ త్రోయర్ సీమా పునియా రియో ఒలింపిక్స్‌కు అర్హత సంపాదించింది. ఇక్కడికి అందిన సమాచారం ప్రకారం కాలిఫోర్నియాలోని సలినాస్‌లో జరుగుతున్న పాట్ యంగ్స్ త్రోయర్స్ క్లాసిక్ ఈవెంట్‌లో పాల్గొన్న 32 ఏళ్ల సీమ 62.62 మీటర్ల దూరానికి డిస్కస్‌ను విసిరి ఒలింపిక్స్ అర్హతగా నిర్దేశించిన 61 మీటర్ల దూరాన్ని సులభంగా పూర్తి చేసింది. రియోకు అర్హత సంపాదించింది.

05/29/2016 - 02:35

బెంగళూరు, మే 28: తొమ్మిదో ఐపిఎల్ తుది ఘట్టానికి చేరుకుంది. ఆదివారం జరిగే ఫైనల్‌లో అమీతుమీ తేల్చుకోవడానికి డేవిడ్ వార్నర్ నాయకత్వంలోని సన్‌రైజర్స్ హైదరాబాద్, విరాట్ కోహ్లీ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు సిద్ధంగా ఉన్నాయి. నిజానికి దీనిని ఇరు జట్ల మధ్యగాక, ఇరువురు కెప్టెన్ల మధ్య జరిగే పోరాటంగా అభివర్ణించాల్సి ఉంటుంది.

05/29/2016 - 02:32

జాన్ జువాన్ (అర్జెంటీనా), మే 28: అర్జెంటీనా సాకర్ హీరో లియోనెల్ మెస్సీ గాయపడ్డాడు. వచ్చేనెల అమెరికాలో కోపా అమెరికా సెంటినరీ ఫుట్‌బాల్ చాంపియన్‌షిప్ జరగనుండగా, అందులో పాల్గొనేందుకు సిద్ధమవుతున్న మెస్సీ హోండురాస్‌తో జరిగిన ఒక వామప్ మ్యాచ్‌లో పాల్గొన్నాడు. మ్యాచ్ ఆడుతున్న సమయంలో ప్రత్యర్థి ఆటగాడిని బలంగా ఢీకొన్నాడు. కిందపడి, బాధతో అల్లాడుతున్న అతనిని వెంటనే ఆసుపత్రికి తరలించారు.

Pages