S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

04/22/2016 - 08:00

మాడ్రిడ్, ఏప్రిల్ 21: స్పానిష్ సాకర్ లీగ్ ‘లా లిగా’లో భాగంగా గత ఐదు మ్యాచ్‌ల్లో నాలుగు పరాజయాలను చవిచూసిన బార్సిలోనా మళ్లీ ఫామ్‌లోకి వచ్చింది. డిపోర్టివో లా కొరునాతో జరిగిన మ్యాచ్‌లో ఈ జట్టు 8-0 తేడాతో ఘన విజయాన్ని నమోదు చేసింది. లూయిస్ సౌరెజ్ ఏకంగా నాలుగు గోల్స్ సాధించగా, ఇవాన్ రాకిటిక్, లియోనెల్ మెస్సీ, మార్క్ బర్‌త్రా, నేమార్ తలా ఒక గోల్ చేశారు.

04/22/2016 - 08:00

న్యూఢిల్లీ, ఏప్రిల్ 21: రియో ఒలింపిక్స్‌లో స్వర్ణ పతకం సాధించడం ద్వారా చరిత్ర సృష్టిస్తానని భారత మహిళా జిమ్నాస్ట్ దీప కర్మాకర్ ధీమా వ్యక్తం చేసింది. ఒలింపిక్స్‌కు ఎంపికైన తొలి మహిళా జిమ్నాస్ట్‌గా ఇప్పటికే రికార్డు పుస్తకాల్లో చోటు సంపాదించిన 22 ఏళ్ల దీప రియోలో క్వాలిఫయర్స్‌లో పాల్గొని స్వదేశానికి తిరిగి వచ్చింది.

04/22/2016 - 07:58

పుణె, ఏప్రిల్ 21: దాదాపుగా ఒక రకమైన పరిస్థితులను ఎదుర్కొంటున్న రైజింగ్ పుణె సూపర్‌జెయింట్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్లు శుక్రవారం జరిగే మ్యాచ్‌లో తిరిగి పట్టాలెక్కేందుకు సర్వశక్తులు ఒడ్డేందుకు సిద్ధమయ్యాయి. దీనితో పోరు తీవ్ర స్థాయిలో సాగడం ఖాయంగా కనిపిస్తున్నది. ఇరు జట్లు టోర్నీని విజయాలతో ఆరంభించాయి. ఎవరూ ఊహించని విధంగా ఫామ్‌ను కోల్పోయాయి. వరుసగా రెండు పరాజయాలను చవిచూశాయి.

04/22/2016 - 07:57

చాంగ్జూ, ఏప్రిల్ 21: చైనా మాస్టర్స్ గ్రాండ్ ప్రీ గోల్డ్ బాడ్మింటన్ టోర్నమెంట్ పురుషుల విభాగం సింగిల్స్‌లో ప్రణయ్, మహిళల సింగిల్స్‌లో పివి సింధు క్వార్టర్ ఫైనల్స్‌లో స్థానం సంపాదించారు. మలేసియా ఆటగాడు డారెన్ లియోతో తలపడిన ప్రణయ్ 21-10, 21-15 తేడాతో వరుస సెట్లలో నెగ్గాడు. సింధు 21-9, 21-17 స్కోరుతో చైనీస్ తైపీ క్రీడాకారిణి చెన్ హుయ్ యూపై సునాయాసంగా విజయం సాధించింది.

04/22/2016 - 07:57

ప్రాచీన ఒలింపియా (గ్రీస్), ఏప్రిల్ 21: రియో ఒలింపిక్స్ క్రీడా జ్యోతిని గ్రీస్‌లోని ప్రాచీన ఒలింపియాలో సంప్రదాయబద్ధంగా వెలిగించారు. శిథిలమైన 2,600 సంవత్సరాల పురాతన హెరా ఆలయంలో సంప్రదాయ దుస్తులను ధరించిన గ్రీక్ నటి కాతెరీన లెచో క్రీడా జ్యోతిని వెలిగింది. అనంతరం దానిని తొలి రన్నర్‌కు అందచేసింది.

04/22/2016 - 07:55

విశాఖపట్నం (స్పోర్ట్స్), ఏప్రిల్ 21: మహారాష్టల్రో స్థాయిలో కాకపోయినా, ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనూ ఐపిఎల్ మ్యాచ్‌లకు లక్షల లీటర్ల వాడకంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మే ఒకటో తేదీ తర్వాత మహారాష్టల్రో జరగాల్సిన మ్యాచ్‌లను ఇతర ప్రాంతాలకు తరలించాల్సిందిగా బాంబే హైకోర్టు ఉత్తర్వులు జారీ చేయడంతో, అక్కడ మ్యాచ్‌లు ఆడాల్సిన ఫ్రాంచైజీలు ప్రత్యామ్నాయ వేదికలను ఎంచుకున్నాయి.

04/22/2016 - 07:55

న్యూఢిల్లీ, ఏప్రిల్ 21: కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ జట్టుకు రెండో హోం గ్రౌండ్‌గా ధర్మశాల ఉంటుంది. వచ్చేనెల అక్కడ మూడు మ్యాచ్‌లు జరగే అవకాశం ఉంది. బాంబే హైకోర్టు ఉత్తర్వులను అనుసరించి మే ఒకటో తేదీ తర్వాత మహారాష్టల్రో జరగాల్సిన మ్యాచ్‌లను మరో ప్రాంతానికి తరలించాల్సి ఉంటుంది. అక్కడ మూడు మ్యాచ్‌లు ఆడాల్సిన పంజాబ్ రెండో హోం గ్రౌండ్‌గా హిమాచల్ ప్రదేశ్‌లోని ధర్మశాలను ఎంపిక చేసుకుంది.

04/22/2016 - 07:54

రాజ్‌కోట్, ఏప్రిల్ 21: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్)లో భాగంగా గురువారం ఇక్కడ గుజరాత్ లయన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ పది వికెట్ల తేడాతో ఘన విజయాన్ని నమోదు చేసింది. డేవిడ్ వార్నర్ మరోసారి కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. అతనికి శిఖర్ ధావన్ చక్కటి మద్దతునిచ్చాడు. ఇద్దరూ అర్ధ శతకాలతో రాణించి, గుజరాత్ నిర్దేశించిన 136 పరుగుల విజయ లక్ష్యాన్ని మరో 31 బంతులు మిగిలి ఉండగానే ఛేదించారు.

04/22/2016 - 07:52

బెంగళూరు, ఏప్రిల్ 21: భారత క్రికెట్ జట్టుకు విశేష సేవలు అందించిన ‘ది వాల్’ రాహుల్ ద్రవిడ్ కుమారుడు సమిత్ అతని అడుగుజాడల్లోనే నడుస్తున్నాడు. అండర్-14 టైగర్ కప్ టోర్నీలో భాగంగా ఫ్రాంక్ ఆంథోనీ పబ్లిక్ స్కూల్‌తో జరిగిన మ్యాచ్‌లో బెంగళూరు యునైటెడ్ క్రికెట్ క్లబ్ తరఫున బరిలోకి దిగిన సమిత్ 125 పరుగులు సాధించాడు. ప్రత్యూష్ (143 నాటౌట్)తో కలిసి అతను 213 పరుగుల భాగస్వామ్యాన్ని అందించాడు.

04/22/2016 - 07:51

న్యూఢిల్లీ, ఏప్రిల్ 21: టీమిండియా కూడా గులాబీ బంతులతో డే/నైట్ టెస్టు మ్యాచ్‌ని ఆడేందుకు సిద్ధమవుతున్నది. ఈ విషయాన్ని భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ) కార్యదర్శి అనురాగ్ ఠాకూర్ గురువారం ఇక్కడ జరిగిన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ తెలిపాడు. న్యూజిలాండ్‌తో ఈఏడాది టీమిండియా డే/నైట్ టెస్టు ఆడుతుందని చెప్పాడు. అన్ని అంశాలను చర్చించిన తర్వాత మ్యాచ్ జరిగే వేదికను ఖరారు చేస్తామని అన్నాడు.

Pages