S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

12/01/2017 - 02:08

హైదరాబాద్, నవంబర్ 30: పేదలకు అందాల్సిన రేషన్ బియ్యం పంపిణీకి విముఖంగా ఉన్న డీలర్లను తక్షణమే తొలగించి, వారి స్థానంలో కొత్త వారిని నియమించాలని సీఎం కె.చంద్రశేఖరరావు పౌరసరఫరాల శాఖను ఆదేశించారు. పేదల కడుపు నింపేందుకు ఉద్దేశించిన బియ్యం పథకానికి తూట్లు పొడుస్తూ కొంతమంది సమ్మె పేరుతో డిసెంబర్ నెల బియ్యం కోసం డీడీలు కట్టకపోవడం బాధాకరమన్నారు.

12/01/2017 - 02:06

హైదరాబాద్, నవంబర్ 30: అమెరికా కార్మిక శాఖ మహిళా విభాగం, నీతి ఆయోగ్ సంయుక్తంగా నిర్వహించిన ప్రపంచ ఔత్సాహిక పారిశ్రామికవేత్తల సదస్సులో ఐటి మంత్రి కె తారకరామారావు సూపర్‌హీరోగా నిలిచారు. ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర మంత్రులను మినహాయిస్తే ప్రజాప్రతినిధి హోదాలో హాజరైంది ఆయన ఒక్కరే. ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎంఎల్‌సిలు ఎవరినీ సదస్సుకు ఆహ్వానించలేదు.

12/01/2017 - 02:04

హైదరాబాద్, నవంబర్ 30: ప్రపంచ తెలుగు మహాసభలను తెలుగు భాషాభివృద్ధికి పాటుపడుతున్న సాహితీవేత్తలందరి సమక్షంలో అంగరంగ వైభవంగా నిర్వహించాలని సిఎం కె చంద్రశేఖర్‌రావు సూచించారు. మహాసభల సందర్భంగా హైదరాబాద్ నగరంలో పండుగ శోభ సంతరించుకోవాలన్నారు. ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఉప రాష్టప్రతి వెంకయ్యనాయుడు, ముగింపు కార్యక్రమానికి రాష్టప్రతి రామ్‌నాథ్ కోవింద్ హాజరవుతారన్నారు.

12/01/2017 - 04:36

హైదరాబాద్, నవంబర్ 30: అత్యవసర సమయంలో అంబులెన్స్‌లు పట్టణాల్లో వెళ్లడం ఎంత కష్టమో అందరికీ తెలిసిందే. ట్రాఫిక్ సిగ్నల్స్ అడ్డుకాకపోయినా, వరుసగా నిలిచిపోయే వాహనాలను తప్పించుకుని ఆపద సమయంలో ఉన్న రోగిని ఆస్పత్రికి చేర్చడం ఒక పెద్ద బృహత్తర కార్యక్రమమే. ఇలాంటి పరిస్థితి నుండి రోగిని సురక్షితంగా మరింత వేగంగా తీసుకువేళ్లేందుకు అనువైన స్టార్టప్‌ను యామిని లావణియన్ రూపొందించారు.

12/01/2017 - 01:53

విజయవాడ, నవంబర్ 30: ప్రజా జీవితాలతో చెలగాటమాడుతున్న వడ్డీ వ్యాపారులను కట్టడి చేసేలా రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా ప్రస్తుత శాసనసభ సమావేశాల్లో గురువారం ఆంధ్రప్రదేశ్ వడ్డీ వ్యాపారుల బిల్లును ఏకగ్రీవంగా ఆమోదించారు. ఈ బిల్లును శాసనమండలిలో ఆమోదించిన తర్వాత తక్షణం రాష్టప్రతి ఆమోదం కోసం కేంద్రానికి పంపుతామని అసెంబ్లీలో హోంమంత్రి తరఫున బిల్లు ప్రవేశపెట్టిన రాష్ట్ర రవాణా మంత్రి కె.అచ్చెన్నాయుడు తెలిపారు.

12/01/2017 - 01:43

న్యూఢిల్లీ, నవంబర్ 30: పోలవరం ప్రాజెక్టును 2019నాటికి పూర్తిచేస్తామని ప్రగల్భాలు పలుకుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు, దాదాపు రూ.1800 కోట్లు ఖర్చుపెట్టి తాత్కాలికమైన పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకాన్ని ఎందుకు చేపట్టారని రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు ప్రశ్నించారు. ఈ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి బహిరంగ లేఖ రాశారు. ప్రాజెక్టు నిర్మాణంపై 21 ప్రశ్నలకు వివరణ కోరుతూ ఆరు పేజీల లేఖను సంధించారు.

12/01/2017 - 01:41

అమరావతి, నవంబర్ 30: ఆటుపోట్లకు చలించకుండా సహనంతో వ్యవహరించే ఎపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కేంద్రం తీరుతో అసహనం చెందుతున్నారా? కేంద్రం ఇప్పటివరకూ అనుసరిస్తున్న సహాయ నిరాకరణతో విసిగి వేసారిపోయారా? తాను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం కావాలనే అడ్డుపుల్లలు వేస్తోందని ఆయన అనుమానిస్తున్నారా?

11/30/2017 - 03:47

ఆదోని/గొనెగండ్ల, నవంబర్ 29: వైసీపీ అధికారంలోకి రాగానే రైతులు పండించిన ఉత్పత్తుల ధరలు స్థిరీకరిస్తామని ప్రతిపక్ష నేత జగన్ అన్నారు. ప్రజా సంకల్పయాత్ర 21వ రోజు బుధవారం కర్నూలు జిల్లా గోనెగండ్ల మండలంలో కొనసాగింది. ఈ సందర్భంగా కైరుప్పలలో పత్తి రైతులు హుసేనమ్మ, రమీజాబీ తదితరులు కలిసి పత్తికి గిట్టుబాటు ధర లేకపోవడంతో నష్టపోయామని మొరపెట్టుకున్నారు.

11/30/2017 - 02:12

హైదరాబాద్, నవంబర్ 29: నిబంధనలకు విరుద్ధంగా నకిలీ ట్రాన్సిస్టర్ల సరఫరా వేర్వేరు కేసుల్లో హైదరాబాద్‌లోని మిసెస్ కెంప్ట్రానిక్స్ యజమాని అనిల్ సింఘ్వీకి 15ఏళ్ల జైలుశిక్షతోపాటు రూ. 9 లక్షలు జరిమానా విధిస్తూ సీబీఐ కోర్టు మంగళవారం తీర్పునిచ్చింది. నకిలీ డాక్యుమెంట్లతో రూ.

11/30/2017 - 02:11

హైదరాబాద్, నవంబర్ 29: దేశ వ్యాప్తంగా రోడ్డు ప్రమాదాలు ఈ ఏడాది తొలి పది నెలల్లో గత ఏడాదితో పోల్చితే గణనీయంగా తగ్గినట్లు కేంద్ర రవాణా శాఖ వెల్లడించింది. నిరుడిపై దాదాపు మృతుల సంఖ్య ఐదు వేల వరకు తగ్గింది. 2016లో జనవరి నుంచి సెప్టెంబర్ వరకు తొలి పదినెలల్లో 1,13,890 మంది మృతి చెందగా, ఈ ఏడాది అదే కాలంలో 1,08,887 మంది మృతి చెందారు. దేశం మొత్తం పైన ప్రమాదాల్లో మరణాల రేటు -4.40 శాతం నమోదైంది.

Pages