S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

10/13/2017 - 03:17

భద్రాచలం టౌన్, అక్టోబర్ 12: దక్షిణ అయోధ్యగా భాసిల్లుతున్న భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో మరో ఆర్జిత సేవకు శ్రీకారం చుడుతున్నారు. దేవస్థానం ఈవో కె.ప్రభాకర్ శ్రీనివాస్ ప్రత్యేక చొరవతో ఆలయంలో ‘సంధ్యాహారతి’ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు సకల ఏర్పాట్లు చేశారు. రామదాసు ఆలయం నిర్మించిన నాటి నుంచి ఈ ఆలయంలో పలు ఆర్జిత సేవలు కొనసాగిస్తున్నారు.

10/13/2017 - 03:11

గుంతకల్లు, అక్టోబర్ 12: అనంతపురం జిల్లా గుంతకల్లు రైల్వే డివిజన్ పరిధిలో భారీ వర్షాలకు గురువారం రైల్వేట్రాక్ కోతకు గురైంది. దీంతో ఈ మార్గంలో పలు రైళ్లు రద్దు చేశారు. మరికొన్నింటిని దారి మళ్లించారు. వివరాలు ఇలా ఉన్నాయి. భారీ వర్షాల కారణంగా బుధవారం రాత్రి అనంతపురం జిల్లా పామిడి-కల్లూరు మధ్య గల పెన్నా నది పొంగిపొర్లింది.

10/13/2017 - 02:14

హైదరాబాద్, అక్టోబర్ 12: అంతర్జాతీయంగా మారుతున్న పరిస్థితిలో భారత్ ఉన్నత శిఖరాలవైపు వెళుతుందని, త్వరలోనే విశ్వగురు స్థానం చేరుతుందని భగవాన్ విశ్వయోగి విశ్వంజీ పేర్కొన్నారు. నాలుగు నెలల అమెరికా పర్యటన ముగించుకుని గురువారం ఆయన ఇక్కడకు చేరారు.

10/13/2017 - 01:39

హైదరాబాద్, అక్టోబర్ 12: తెలంగాణ రాష్ట్రంలోని షెడ్యూల్డ్ ప్రాంతంలో గ్రామ సభల అనుమతి లేకుండా మద్యం షాపులను ఏర్పాటు చేసేందుకు లైసెన్సులను మంజూరు చేయరాదని హైకోర్టు గురువారం రాష్ట్రప్రభుత్వాన్ని ఆదేశించింది. తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేష్ రంగనాథన్, జస్టిస్ ఎం గంగారావుతో కూడిన ధర్మాసనం ఈ ఆదేశాలు జారీ చేసింది. పోడెం రత్నం అనే వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు విచారించింది.

10/13/2017 - 01:38

హైదరాబాద్, అక్టోబర్ 12: కాళేశ్వరం ప్రాజెక్టు పనులు మరింత వేగం చేసే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. కాలువల తవ్వకం వల్ల భూ సేకరణ, కాలువ నిర్మాణం వల్ల జరిగే జాప్యాన్ని నివారించడానికి పైపుల ద్వారా సాగునీటిని అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

10/13/2017 - 01:37

నల్లగొండ, అక్టోబర్ 12: కాళేశ్వరం ప్రాజెక్టుతో గోదావరి జలాలను ఉమ్మడి నల్లగొండ జిల్లాలో పారించి సాగర్ ఆయకట్టు కింద రెండు పంటలు పండించేలా చేస్తానని సిఎం కెసిఆర్ ప్రకటించారు. గురువారం సూర్యాపేట నూతన కలెక్టరేట్ భవన సముదాయానికి శంకుస్థాపన చేసి, డబుల్ బెడ్ రూమ్ ఇళ్లకు, 400కెవి సబ్ స్టేషన్లకు ప్రారంభోత్సవం చేశారు.

10/13/2017 - 01:27

అనంతపురం, కర్నూలు, కడప, అక్టోబర్ 12: గత రెండు రోజులుగా రాయలసీమలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో పలు గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. నదులు, వాగులు, పొంగి ప్రవహిస్తున్నాయి. అనంతపురం జిల్లా పామిడి, ఉరవకొండ, గుంతకల్లు, గుత్తి తదితర ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలకు పెన్ననదికి వరద వచ్చింది. పామిడి పట్టణంలోని చాలా కాలనీలు జలమయమయ్యాయి.

10/13/2017 - 01:20

అమరావతి, అక్టోబర్ 12: అమరావతి, విశాఖలను ఎయిర్‌లైన్స్ హబ్‌గా చేసుకోవాలని దుబాయ్ ‘ఎమిరేట్స్’ గ్రూపును ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆహ్వానించారు. గురువారం క్యాంపు కార్యాలయం నుంచి ఎమిరేట్స్ ప్రతినిధులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్-దుబాయ్ మధ్య విమాన సర్వీసులు పెంపు, అమరావతి, విశాఖ గ్రీన్ ఫీల్డ్ ఎయిర్‌పోర్టుల అభివృద్ధిలో భాగస్వామ్యం వంటి తదితర అంశాలపై చర్చించారు.

10/13/2017 - 01:16

శ్రీశైలం/శ్రీశైలం ప్రాజెక్టు, అక్టోబర్ 12: గురువారం ఉదయం శ్రీశైలం జలాశయం నీటి మట్టం పూర్తి స్థాయికి చేరడంతో ప్రాజెక్టులోని 6,7నంబరు గల స్పిల్‌వే గేట్ల ద్వారా నీటిని విడుదల చేశారు. ఆంధ్రప్రదేశ్ నీటి పారుదల శాఖమంత్రి దేవినేని ఉమామహేశ్వర్‌రావు, అచ్చంపేట శాసన సభ్యుడు గువ్వల బాలరాజు డ్యాం గేట్ల వద్ద పూజలు చేసి గేట్ల ద్వారా నీటిని మంత్రి విడుదల చేశారు.

10/13/2017 - 01:30

విజయవాడ, అక్టోబర్ 12: రాష్ట్రంలో ఇకపై సీజనల్ వ్యాధులు కనిపించడానికి వీల్లేదని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్పష్టం చేశారు. ప్రజారోగ్యం విషయంలో నిర్లక్ష్యాన్ని, అలసత్వాన్ని ప్రదర్శిస్తే సహించేది లేదని చెప్పారు. ‘పేషెంట్ ఫస్ట్’ అనే విధానాన్ని వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు, సిబ్బంది అలవర్చుకోవాలని అన్నారు.

Pages