S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

10/12/2017 - 20:44

హైదరాబాద్, అక్టోబర్ 11: దేశంలో ఉన్న రైల్వే స్టేషన్లలో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ‘గ్రీన్ రైల్వే స్టేషన్’గా గుర్తింపు తెచ్చుకుంది. ఇండియా గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్, కానె్ఫడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ సంయుక్తంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు గ్రీన్ రేటింగ్ ఇచ్చాయి. దక్షిణ మధ్య రైల్వేకి ఇప్పటి వరకు లభించిన రికార్డుల్లో ఇదో అరుదైన రికార్డుగా రైల్వే అభివర్ణించింది.

10/12/2017 - 20:45

హైదరాబాద్, అక్టోబర్ 11: అమెరికా అట్లాంటలోని 50 విశ్వవిద్యాలయాలు భారతీయ విద్యార్థులపై ఆసక్తి చూపుతున్నాయి. తమ వర్శిటీల్లో ఆఫర్ చేస్తున్న కోర్సుల్లో చేరేందుకు , పరస్పర భాగస్వామ్యంగా ఎక్స్చేంజి కార్యక్రమం నిర్వహించేందుకు అట్లాంటా నుండి వచ్చిన ప్రతినిధి బృందం తెలంగాణ ఉన్నత విద్యామండలిని కోరింది.

10/12/2017 - 20:45

హైదరాబాద్, అక్టోబర్ 11: వెనుకబడిన వర్గాలకు చట్ట సభల్లో 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని, బిసి ఉద్యోగులకు పదోన్నతుల్లో రిజర్వేషన్లు కల్పించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై వత్తిడి పెంచేందుకు ఈ నెల 20న కడప జిల్లా వివి రెడ్డి నగర్‌లో రాయలసీమ ఉద్యోగుల అధ్వర్యంలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు బిసి సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య తెలిపారు.

10/12/2017 - 01:45

శ్రీశైలం, అక్టోబర్ 11: శ్రీశైల జలాశయం పూర్తిగా నిండింది. ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద రావడంతో బుధవారం రాత్రికి 884.50 అడుగులకు చేరుకుంది. జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు. పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215 టిఎంసిలు కాగా, ప్రస్తుతం 211.95 టిఎంసిల నీరు నిల్వ ఉంది. ఎగువ నుంచి 1,47,340 క్యూసెక్కుల నీరు జలాశయానికి వచ్చి చేరుతోంది.

10/12/2017 - 20:46

న్యూఢిల్లీ, అక్టోబర్ 11: కడప జిల్లా ఫాతిమా మెడికల్ కాలేజీ 2015-16 విద్యార్థులకు వివిధ కాలేజీల్లో అదనపు సీట్లు కల్పించి ప్రస్తుత వైద్య విద్యా సంవత్సరం కొనసాగించాలని ఏపీ ప్రభుత్వం చేసిన ప్రతిపాదనను భారత వైద్య మండలి (ఎంసిఐ) తిరస్కరించింది. దీంతో మరో ప్రతిపాదనతో వస్తామని, మరింత సమ యం కావాలని సుప్రీం కోర్టును ఏపీ కోరడంతో, కేసును రెండువారాలు వాయిదా వేశారు.

10/12/2017 - 20:47

తిరుపతి, అక్టోబర్ 11: శ్రీవారి ఆలయ మహాద్వారం వద్ద ఉన్న క్యూలైన్‌లలో గ్రిల్స్‌కు విద్యుత్ సరఫరా అయి షాక్ కొడుతోందని భక్తులు ఆందోళన చెందిన సంఘటన బుధవారం జరిగింది. ఈక్రమంలో భక్తులు ఒత్తిడికి గురికావడంతో కొంత తోపులాట తలెత్తింది. తోపులాటలో తమిళనాడుకు చెందిన చిన్నారి చేతికి గాయమైంది. వెంటనే చిన్నారిని స్థానిక అశ్విని ఆసుపత్రికి తరలించి చికిత్స చేయించారు.

10/11/2017 - 23:39

ఖమోదీ సర్కార్ అంతా అవినీతిమయం ప్రధాని నోరు విప్పాలి
ఖనోట్ల రద్దు, జిఎస్‌టితో కంపెనీల కుదేలు
ఆంధ్రభూమి బ్యూరో

10/12/2017 - 20:50

హైదరాబాద్, అక్టోబర్ 11: రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మరో అంతర్జాతీయ సదస్సుకు వేదిక కాబోతోంది. నవంబర్ 28 నుండి మూడు రోజుల పాటు అంతర్జాతీయ ఔత్సాహిక పారిశ్రామిక శిఖరాగ్ర సదస్సు (జిఇఎస్) హైదరాబాద్‌లో జరగనుంది.

10/11/2017 - 22:42

న్యూఢిల్లీ, అక్టోబరు 11: పోలవరం ప్రాజెక్టు పర్యావరణ అనుమతులు ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్జీటి)లో దాఖలైన పిటిషన్ విచారణ డిసెంబరు 5కు వాయిదా పడింది. ట్రిబ్యునల్ చైర్మన్ జస్టిస్ స్వతంత్ర కుమార్ నేతృత్వంలోని ధర్మాసనం ముందుకు బుధవారం విచారణకు వచ్చింది.

10/11/2017 - 22:27

తూప్రాన్, అక్టోబర్ 11: మారుమూల ప్రాంతం లో ఉన్న మల్కాపూర్ గ్రామం దేశానికి ఆదర్శం గా నిలుస్తోందని జాతీయ గ్రామీణాభివృద్ధి సంస్థ అసిస్టెంట్ ప్రొఫెసర్ వాలెంటీన పేర్కొన్నారు. బుధవారం సిద్దిపేట జిల్లా మల్కాపూర్ గ్రామాన్ని జాతీయ గ్రామీణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో వివిధ శాఖలకు చెందిన 19 మంది ప్రతినిధుల బృందం సందర్శించింది.

Pages