S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

10/11/2017 - 03:52

హైదరాబాద్, అక్టోబర్ 10: విద్యారంగంలో పెనుమార్పులు రావల్సిన అవసరం ఆసన్నమైందని ప్రదాన మంత్రి మాజీ ఆర్ధిక సలహాదారు, మాజీ గవర్నర్ డాక్టర్ సి రంగరాజన్ పేర్కొన్నారు.

10/11/2017 - 03:12

హైదరాబాద్, అక్టోబర్ 10: శ్రీశైలం నిండుకుండలా తయారైంది. తుంగభద్ర బేసిన్‌లో, ఎగువ కృష్ణాబేసిన్‌లో ఉధృతంగా కురుస్తున్న భారీ వర్షాలతో వరద నీరు ఉప్పొంగి తరలివస్తోంది. దీంతో శ్రీశైలంలో 215 టిఎంసికి 210 టిఎంసి నీరు చేరింది. నిన్న మొన్నటి వరకు ఎడారిని తలపించిన నాగార్జునసాగర్‌కు జీవం వచ్చింది. ఈ ప్రాజెక్టు మొత్తం నీటి నిల్వ 312 టిఎంసికి ప్రస్తుతం 155 టిఎంసి ఉంది.

10/11/2017 - 03:05

హైదరాబాద్, అక్టోబర్ 10: అగ్రిగోల్డ్ కంపెనీలకు సంబంధించి డాక్యుమెంట్లను పరిశీలించేందుకు ఇకపై జాప్యం చేయరాదని, తక్షణమే మూడు బృందాలను ఏర్పాటు చేసి నిర్దేశించిన పనిని వేగవంతం చేయాలని హైకోర్టు అకౌంటింగ్ సంస్ధ డెలాయిట్‌ను ఆదేశించింది. ప్రస్తుతం ఈ డాక్యుమెంట్లు ఏపి సిఐడి కస్టడీలో ఉన్నాయి. అగ్రిగోల్డ్ కంపెనీని టేకోవర్ చేసేందుకు ఎస్సె జీ గ్రూపుకు చెందిన సుభాష్ పౌండేషన్ ముందుకు వచ్చిన సంగతి విదితమే.

10/11/2017 - 02:20

హైదరాబాద్, అక్టోబర్ 10: అంతరిక్ష రంగంలో భారత్ అగ్రదేశాల సరసన చేరే రోజు ఎంతో దూరంలో లేదని, అలాగే రక్షణ రంగంలో అనూహ్యమైన ప్రగతిని భారత్ సాధించిందని రక్షణ శాఖ సలహాదారు , డిఆర్‌డిఓ డైరెక్టర్ జనరల్ డాక్టర్ జి సతీష్‌రెడ్డి పేర్కొన్నారు.

10/11/2017 - 02:18

పలమనేరు, అక్టోబర్ 10: ప్రముఖ సినీనటుడు, తెలుగు ప్రజల ఆరాధ్య దైవం, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీరామారావు జీవిత చరిత్ర ఆధారంగానే సినిమా తెరకెక్కిస్తున్నట్టు సినీ దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ తెలిపారు.

10/11/2017 - 02:16

హైదరాబాద్, అక్టోబర్ 10: భావప్రకటన స్వేచ్ఛ హక్కును అడ్డుకునే హక్కు ఎవరికీ లేదని, కంచ ఐలయ్య రాసిన పుస్తకం తన భావాన్ని మాత్రమే వ్యక్తపరిచారని మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి జగన్ మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రచయిత కంచ ఐలయ్యను బెదిరించడాన్ని తాము ఖండిస్తున్నామని, ఐలయ్యకు సామాజిక వర్గమంతా అండగా నిలువాలని జగన్ పిలుపునిచ్చారు.

10/11/2017 - 03:19

హైదరాబాద్, అక్టోబర్ 10: బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా కుమారుడు జె.షాతో పాటు ఆయన కుటుంబీకులు చేసిన కోట్లాది రూపాయల అక్రమాలపై న్యాయ విచారణ జరిపించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని టి.పిసిసి అధ్యక్షుడు ఎన్. ఉత్తమ్‌కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు.

10/11/2017 - 01:44

హైదరాబాద్, అక్టోబర్ 10: గ్యాంగ్‌స్టర్ నరుూం అక్రమాస్తులపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ విచారణ చేపట్టింది. నరుూం పోలీస్ ఎన్‌కౌంటర్‌లో హతమై 14 నెలలు గడిచింది. నరుూం సహ అతని అనుచరులపై హత్యలు, భూకబ్జాలు, కిడ్నాప్, బలవంతపు వసూళ్లు, బెదిరింపులపై 207 కేసులు నమోదయ్యాయి. దాదాపు 800 మందిని సాక్షులుగా విచారించిన సిట్ ఇప్పటి వరకు 40 చార్జ్‌షీట్లు దాఖలు చేసింది.

10/11/2017 - 01:42

హైదరాబాద్, అక్టోబర్ 10: రానున్న 48 గంటల్లో తెలంగాణ రాష్టవ్య్రాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. గత 24 గంటల్లో ఎల్లారెడ్డిలో 13 సె.మీ, రుద్రూరులో 8 సెం.మీ, నిజామాబాద్, నిర్మల్‌లో 7 సెం.మీ చొప్పున, వనపర్తిలో 6 సెం.మీ వర్షపాత నమోదైంది. రుతుపవనాలు తెలంగాణలో చురుగ్గా కొనసాగుతున్నాయని వాతావరణ శాఖ మంగళవారం ప్రకటనలో పేర్కొంది.

10/11/2017 - 01:41

హైదరాబాద్, అక్టోబర్ 10: తెలంగాణ పాఠశాలల్లో టీచర్ల ఖాళీల భర్తీకి ఎట్టకేలకు గ్రీన్‌సిగ్నల్ వచ్చింది. ఉపాధ్యాయుల నియామకానికి సంబంధించి తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యాయుల ప్రత్యక్ష నియామకాల మార్గదర్శకాలను ప్రభుత్వం మంగళవారం విడుదల చేసింది. అభ్యర్ధులకు కావల్సిన విద్యార్హతలు, టెట్ వెయిటేజీ , ఎంపిక నిబంధనలను స్పష్టం చేస్తూ జీవో 25ను విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రంజీవ్ ఆర్ ఆచార్య విడుదల చేశారు.

Pages