S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

10/10/2017 - 01:39

హైదరాబాద్, అక్టోబర్ 9: హిందు , ముస్లిం పదాలను ఆయా యూనివర్శిటీల నుండి తొలగించాల్సిన పరిస్థితి వచ్చింది. బెనారస్ హిందూ యూనివర్శిటీ, అలీఘడ్ ముస్లిం యూనివర్శిటీ పేర్లలోని హిందు, ముస్లిం పదాలను తొలగించాలని యుజిసి ప్యానల్ తాజాగా సిఫార్సు చేసింది. 10 సెంట్రల్ యూనివర్శిటీల్లో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై దర్యాప్తు చేసేందుకు ఏర్పాటు చేసిన ప్యానల్ ఎఎంయు ఆడిట్ రిపోర్టులో ఈ సిఫార్సులను చేసింది.

10/10/2017 - 01:30

జూలై నుంచి అమల్లోకి వచ్చిన వస్తు సేవల పన్ను ‘జిఎస్‌టి’ పరిధిలోకి డీజిల్‌ను తీసుకురావాలన్న డిమాండ్‌తో ఆలిండియా మోటార్ ట్రాన్స్‌పోర్టు కాంగ్రెస్, ఆలిండియా ట్రాన్స్‌పోర్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ల పిలుపు మేరకు రెండు రోజుల దేశవ్యాప్త సమ్మె తొలిరోజు సోమవారం విజయవంతమైంది. తెలంగాణవ్యాప్తంగా లారీలు, ఇతర మోటార్ వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయ. సరుకు రవాణా పూర్తిగా స్తంభించింది.

10/10/2017 - 01:28

హైదరాబాద్, అక్టోబర్ 9: తెలంగాణ రాష్ట్ర సమితిని మరింత బలోపేతం చేసే దిశగా రాష్ట్ర కొత్త కార్యవర్గాన్ని పార్టీ అధినేత కె చంద్రశేఖర్‌రావు సోమవారం ప్రకటించారు. పార్టీ క్షేత్రస్థాయి పరితీరుపై ఎప్పటికప్పుడు పరిశీలన జరిపేందుకు వీలుగానూ కార్యవర్గానికి బాధ్యతలు అప్పగించారు. తొలుత కార్యవర్గంలో 69మందికి చోటు కల్పించాలని అనుకున్నా 67మందితో కార్యవర్గాన్ని ప్రకటించారు.

10/10/2017 - 01:26

హైదరాబాద్, అక్టోబర్ 9: రాష్ట్రంలోని నగరాలు, పట్టణాలు అన్నింటిలో ఒకే విధమైన పార్కింగ్ పాలసీ ప్రవేశపెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇతర రాష్ట్రాలు, దేశాల్లో అమలు చేస్తున్న పార్కింగ్ పాలసీలపై అధికారుల బృందం అధ్యయనం చేసి సమర్పించిన సిఫారసుల మేరకు కొత్త పాలసీనిఅమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

10/10/2017 - 02:15

అనంతపురం, అక్టోబర్ 9: ఊహించని రీతిలో కురిసిన కుంభవృష్టి అనంతపురం జిల్లాను అతలాకుతలం చేసింది. కుండపోత వర్షంతో అనంతపురం నగరం తడిసి ముద్దయింది. జిల్లా వ్యాప్తంగా ఆదివారం అర్ధరాత్రి ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. అనంతపురం నగరంలో అర్ధరాత్రి నుంచి ఉదయం వరకు కుండపోత వాన కురిసింది. దీంతో నగరంగుండా వెళ్లే వాగులు, వంకలు పొంగిపొర్లాయి. ఫలితంగా నీరంతా కాలనీల్లోకి ఇళ్లలోకి చేరింది.

10/10/2017 - 01:10

కర్నూలు, అక్టోబర్ 9: కర్నూలు జిల్లా నుంచి ప్రపంచంలో ఏ దేశానికి అవసరమైనా విత్తనాలను ఎగుమతి చేయగల శక్తిని సాధించగలిగామని సిఎం చంద్రబాబు అన్నారు. కర్నూలు జిల్లా జూపాడుబంగ్లా మండలం తంగెడంచ వద్ద నిర్మించనున్న ప్రపంచస్థాయి విత్తన పరిశోధనా సంస్థకు సోమవారం శంఖుస్థాపన చేశారు.

10/10/2017 - 01:08

విశాఖపట్నం, అక్టోబర్ 9: ప్రపంచంలోనే ఆంధ్ర నాలెడ్జ్ హబ్‌గా రూపుదిద్దుకోబోతుందని సిఎం చంద్రబాబు అన్నారు. సోమవారం బ్లాక్‌చైన్ బిజినెస్ కాన్ఫరెన్స్‌ను ప్రారంభించిన సందర్భంలో మాట్లాడుతూ ప్రస్తుతం నాలుగో పారిశ్రామిక విప్లవం పరుగులు తీస్తోందని, ఇందులో భాగమే ఇంటర్‌నెట్ ఆఫ్ థింగ్స్ అన్నారు. ఆధునిక సాంకేతికత ఆధారంగా రియల్‌టైం గవర్నెన్స్‌ను తమ ప్రభుత్వం అందిస్తోందని, దీనివలన పాలన సరళతరమైందన్నారు.

10/09/2017 - 03:29

హైదరాబాద్, అక్టోబర్ 8: మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ నాయకత్వ మార్పిడికి కసరత్తు చేపట్టినట్టు తెలుస్తోంది. పార్టీలో నాయకత్వం మార్పుపైనే దృష్టి సారించిన కేంద్ర కమిటీ మావోయిస్టు దళపతిగా పార్టీలో రెండో స్థానంలో ఉన్న నంబాల కేశవరావు అలియాస్ బసవరాజ్‌ను నియమించే అవకాశాలు మెండుగా ఉన్నట్టు తెలుస్తోంది. ఇటీవల పోలీసులకు లభించిన కీలక పత్రాల ఆధారంగా పార్టీ నాయకత్వం మారనున్న అంశం వెల్లడైనట్టు తెలిసింది.

10/09/2017 - 02:36

శ్రీశైలం, అక్టోబర్ 8: శ్రీశైలం జలాశయంలోకి చేరుతున్న వరద నీటి ప్రవాహం ఆదివారం కొంతమేరకు పెరిగినట్లు డ్యాం అధికారులు తెలిపారు. ఇక జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ఆదివారం సాయంత్రం సమయానికి 882.8 అడుగులకు చేరుకుంది. పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215 టిఎంసిలు కాగా ప్రస్తుతం 203.4290 టిఎంసిలుగా నమోదైంది.

10/09/2017 - 02:04

తిరుపతి, అక్టోబర్ 8: కోటికి పడగెత్తిన ధనవంతుడు.. నీ ముంగిట సామాన్యుడే.. అన్న ఓ సినీ రచయిత చెప్పిన వాస్తవం తిరుమల నారాయణ గిరి కొండలపై ఉన్న స్వామివారి పాదాల సాక్షిగా వాస్తవ దూరంగా మారింది. తిరుమలో సముద్రమట్టానికి 2500 అడుగుల ఎత్తులో శ్రీవారి పాదాలు ఉన్నాయి. వైకుంఠం నుంచి స్వామివారు భూలోకానికి విచ్చేసినప్పుడు తన తొలి అడుగును నారాయణగిరి కొండలపై పెట్టారని భక్తుల ప్రగాఢ విశ్వాసం.

Pages