S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

10/11/2017 - 01:39

హైదరాబాద్, అక్టోబర్ 10: తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో కీలక భూమిక పోషించినట్టుగానే బంగారు తెలంగాణ సాధనలోనూ విద్యార్థులు భాగస్వామ్యం కావాలని తెరాస అధినేత, ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు పిలుపునిచ్చారు. మున్ముందు పార్టీలో, ప్రభుత్వంలోనూ విద్యార్థులకు ముఖ్య ప్రాధాన్యత కల్పిస్తామన్నారు. తెలంగాణ భవన్‌లో మంగళవారం తెరాస విద్యార్థి విభాగం (టిఆర్‌ఎస్‌వి) సమన్వయ సమావేశాన్ని ఉద్దేశించి కెసిఆర్ మాట్లాడారు.

10/11/2017 - 01:36

హైదరాబాద్, అక్టోబర్ 10: ప్రపంచంలోనే అతి పెద్ద ఫార్మాసిటీని రాష్ట్రంలో నెలకొల్పడానికి సన్నాహాలు జరుగుతున్నాయని ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కె తారకరామారావు అన్నారు. ఫార్మారంగంలో హైదరాబాద్ ప్రస్తుతం అగ్రస్థానంలో నిలిచిందని, ఫార్మాసిటీ ఏర్పాటుతో ప్రపంచంలోనే అగ్రస్థానానికి చేరుకుంటుందన్నారు. ఫార్మాసిటీ ఏర్పాటుపై అధికారుల బృందం దేశ విదేశాల్లో అన్ని కోణాల్లో అధ్యయనం చేసి వచ్చిందన్నారు.

10/11/2017 - 01:26

అనంతపురం, అక్టోబర్ 10: కడప జిల్లా ఇడుపులపాయ నుంచి శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం వరకు నవంబర్ 2నుంచి పాదయాత్ర చేపడుతున్నట్లు వైకాపా అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి తెలిపారు. అనంతపురంలో మంగళవారం నిర్వహించిన యువభేరిలో పాదయాత్ర వివరాలు, దాని ఉద్దేశ్యం వివరించారు. ఆరు నెలల పాటు రాష్ట్రంలోని అన్ని జిల్లాల మీదుగా సమారు 3 వేల కిలోమీటర్ల దూరం పాదయాత్ర సాగుతుందన్నారు.

10/11/2017 - 01:25

కుప్పం, అక్టోబర్ 10: గత నాలుగురోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో వాగులన్నీ పొంగి ప్రవహిస్తున్నాయి. దీంతో పలమనేరు- క్రిష్ణగిరి అంతర్ రాష్ట్ర రహదారిలో పిఇఎస్ కళాశాల సమీపంలోని పోడూరు వద్ద కొత్తగా నిర్మించిన కాజ్‌వే సోమవారం అర్థరాత్రి కొట్టుకుపోయింది. రోడ్డుకు ఇరువైపులా వాహనాలు భారీ సంఖ్యలో ఆగిపోయాయి.

10/11/2017 - 01:21

అమరావతి, అక్టోబర్ 10: మీరెవరైనా హీరోలనుకుంటే జీరోలను చేయడం నాకు ఐదు నిమిషాల పని. ఒక రాష్ట్ర సీఎంకు ఎంత వరకూ మర్యాదలివ్వాలో అంతవరకే ఇవ్వాలి. అది నేనిచ్చాను. మరీ రాసుకుని పూసుకుంటే ఆ రాష్ట్రంలో ఉన్న మన పార్టీ శ్రేణులకు తప్పుడు సంకేతాలు వెళ్లవా. మీ వ్యక్తిగత ప్రవర్తన, వ్యవహారశైలికి సంబంధించిన జాతకాలన్నీ నా దగ్గర ఉన్నాయి.

10/11/2017 - 01:19

విశాఖపట్నం, అక్టోబర్ 10: నవ్యాంధ్రలో సంస్థలు నెలకొల్పేందుకు పారిశ్రామిక, ఐటి సంస్థలు క్యూ కట్టట్లేదని, ప్రభుత్వం తరపున అన్ని వసతులు కల్పిస్తామంటూ బతిమాలితే అంగీకరిస్తున్నారని ఐటి, కమ్యూనికేషన్ల మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు.

10/11/2017 - 01:14

కర్నూలు, అక్టోబర్ 10: కాస్త ఆలస్యంగానైనా ఎట్టకేలకు శ్రీశైలం జలాశయం నిండుకుండ దశకు చేరుకుంది. మట్టం పూర్తిస్థాయకి చేరడంతో గేట్లు ఎత్తేందుకు అధికారులు సన్నాహాలు చేశారు. జలాశయం నీటిమట్టం పూర్తిస్థాయికి చేరడంతో ఏ క్షణాన్నయినా గేట్లు ఎత్తి దిగువ నాగార్జునసాగర్‌కు నీరు విడుదల చేయనున్నారు.

10/11/2017 - 01:10

విజయవాడ, అక్టోబర్ 10: వచ్చే జనవరి నుంచి బీసీలకు చంద్రన్న పెళ్లికానుక పథకాన్ని అమలు చేసేందుకు కేబినెట్ నిర్ణయించింది. పెళ్లి సమయంలో ఒక్కో జంటకు రూ.30 వేలు అందజేయనున్నారు. నాణ్యమైన విద్య అందించేందుకు ఎంపిక చేసిన మున్సిపల్ స్కూళ్లలో వర్చువల్ క్లాస్‌రూమ్‌లు ఏర్పాటు చేయనున్నారు.

10/10/2017 - 02:36

ఒంగోలు, అక్టోబర్ 9: ప్రముఖ సినీ, నాటక రచయిత, నటుడు ఎం.వి.ఎస్ హరనాథరావు(69) గుండెపోటుతో సోమవారం ఒంగోలులోని తన స్వగృహంలో కన్ను మూశారు. గత కొంత కాలంగా ఆయన తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆయన సోమవారం ఉదయం ఏడున్నర గంటల ప్రాంతంలో స్ధానిక దేవుడి చెరువు వద్ద ఉన్న తన సొంత ఇంటిలో అపస్మారక స్ధితిలోకి వెళ్లగా వెంటనే ఆయనను రిమ్స్‌కు తరలించారు.

10/10/2017 - 01:42

హైదరాబాద్, అక్టోబర్ 9: సామాజిక స్మగ్లర్లు-కోమటోళ్లు పుస్తక రచయిత ప్రొఫెసర్ కంచ ఐలయ్య సోమవారం తెలంగాణ రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ అనురాగ్ శర్మను కలిశారు. ఆర్యవైశ్యుల నుంచి తనకు ప్రాణహాని ఉందని ఆయన డిజిపికి ఫిర్యాదు చేశారు. తనకు రక్షణ కల్పించాలని కోరారు. ఇటీవల కంచ ఐలయ్య రాసిన ‘సామాజిక స్మగ్లర్లు-కోమటోళ్లు’ అనే పుస్తకం దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్న విషయం తెలిసిందే.

Pages