S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

03/31/2017 - 02:47

హైదరాబాద్, మార్చి 30: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని 1919 మద్యం షాపులు, 492 బార్ల భవితవ్యంపై నీలినీడలు నెలకొన్నాయి. జాతీయ, రాష్ట్ర హైవేలపై ఉన్న మద్యం షాపులు, బార్లను మార్చి 31లోగా వేరే చోటికి తరలించాలని సుప్రీంకోర్టు గత డిసెంబర్‌లో ఆదేశించింది. వీటిని తరలించడానికి విధించిన గడువు (మార్చి 31) నేటితో ముగియనుంది.

03/31/2017 - 02:45

హైదరాబాద్, మార్చి 30: భారీగా పెంచిన బీమా ప్రీమియాన్ని తగ్గిస్తూ, సింగిల్ పర్మిట్ విధానాన్ని ప్రవేశపెట్టాలని కోరుతూ లారీ యజమానుల సంఘం గురువారం ఉదయం నుంచి సమ్మె చేపట్టింది. రెండు రోజుల క్రితం ప్రభుత్వంతో జరిపిన చర్చలు విఫలమవ్వడంతో గురువారంనుంచీ సమ్మెకు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ మేరకు దక్షిణాది రాష్ట్రాల లారీ యజమానుల సంఘాలు గురువారం ఉదయం నుంచి సమ్మె మొదలుపెట్టాయి.

03/31/2017 - 02:44

రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా గురువారం పద్మశ్రీ పురస్కారాన్ని అందుకుంటున్న వనజీవి రామయ్య. రాష్టవ్య్రాప్తంగా లక్షలాది మొక్కలు నాటిన రామయ్యది ఖమ్మం జిల్లా రెడ్డిపాలెం గ్రామం.

03/31/2017 - 05:55

హైదరాబాద్, మార్చి 30:హైదరాబాద్‌నుంచి జాతీయ రహదారులపై ప్రతిపాదించిన మూడు స్కైవేలు 2018 డిసెంబర్ నాటికి పూర్తి చేసేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని మున్సిపల్ వ్యవహారాల మంత్రి కెటిఆర్ అధికారులను ఆదేశించారు. నాగపూర్ హైవే, కరీంనగర్ హైవే, వరంగల్ హైవేలపై నిర్మించనున్న ఈ మూడు స్కైవేల నిర్మాణానికి 2,691 కోట్ల నిధుల వినియోగానికి పాలనాపరమైన అనుమతి ఇచ్చారు.

03/31/2017 - 02:40

హైదరాబాద్, మార్చి 30:రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ గురువారం మూడు కార్పొరేషన్లకు చైర్మన్లను నియమించారు. అత్యంత వెనుకబడిన వర్గాల (ఎంబిసి) కార్పొరేషన్ చైర్మన్‌గా తాడూరి శ్రీనివాస్, పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్‌గా కె దామోదర్‌గుప్తా, మెడికల్ ఇన్‌ఫ్రాస్టక్చర్ కార్పొరేషన్ చైర్మన్‌గా పర్యాద కృష్ణమూర్తిలను నియమించారు.

03/31/2017 - 05:56

విజయవాడ (క్రైం), మార్చి 30: అగ్రిగోల్డ్ బాధితులకు అండగా ఉంటానని సినీ హీరో, జనసేన అధినేత పవన్ కల్యాణ్ భరోసా ఇచ్చారు. ఏజెంట్లకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనన్నారు. ప్రభుత్వం తక్షణ చర్యగా 13లక్షల మంది చిన్న ఖాతాదారులకు రూ.1,180కోట్లు విడుదల చేయాలన్నారు.

03/31/2017 - 02:31

గుంటూరు, మార్చి 30: ‘నాకు ఎవరినీ కాపాడాల్సిన అవసరంలేదు.. విద్యార్థులకు ఎలాంటి అనుమానాలు లేకుండా వివరణ ఇచ్చాం.. ప్రభుత్వపరంగా అన్ని చర్యలు చేపట్టాం.. బాధ్యుల్ని వదిలే ప్రసక్తేలేదు.. తప్పు జరిగితే తోలు వలుస్తా.. నేను చండ శాసనుడిని..’అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు గురువారం అసెంబ్లీలో నిప్పులు చెరిగారు.

03/31/2017 - 02:27

అమరావతి, మార్చి 30: శాసనమండలి డిప్యూటీ చైర్మన్‌గా రెడ్డి సుబ్రహ్మణ్యం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇతరులెవరూ ఆ పదవికి నామినేషన్ వేయకపోవడంతో ఆయన ఎన్నిక ఏకగ్రీవమయింది. ఉభయ గోదావరి జిల్లాల్లో రాజకీయంగా ప్రభావం చూపే బీసీల్లోని శెట్టి బలిజ వర్గానికి చెందిన సుబ్రహ్మణ్యాన్ని ఆ పదవికి ఎంపిక చేస్తూ ముఖ్యమంత్రి, తెదేపా అధినేత చంద్రబాబునాయుడు గురువారం నిర్ణయం తీసుకున్నారు.

03/31/2017 - 02:25

భీమవరం, మార్చి 30: పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరులోని ఒక రొయ్యల ప్రాసెసింగ్ యూనిట్‌లో గురువారం వెలువడిన విష వాయువులు పీల్చి ఐదుగురు కార్మికులు మృతిచెందారు. ప్లాంటులోని వ్యర్థ పదార్థాల ట్రీట్‌మెంట్ ప్లాంటు ట్యాంకును శుభ్రంచేసే ప్రయత్నంలో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది.

03/31/2017 - 02:23

అమరావతి, మార్చి 30: రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ ఖాయమైంది. ఏప్రిల్ 2 లేదా 6తేదీలలో ఏదో ఒక రోజు కచ్చితంగా మంత్రివర్గాన్ని విస్తరించాలని ముఖ్యమంత్రి భావిస్తున్నట్లు తెలుస్తోంది. కొత్తగా ఎమ్మెల్సీ అయిన లోకేష్‌ను ఎక్కువ రోజులు ఖాళీగా ఉంచడం మంచిదికాదన్న ఒత్తిళ్ల నేపథ్యంలోనే కేబినెట్ విస్తరణను చేపడుతున్నట్లు పార్టీ వర్గాలు చెప్తున్నాయి.

Pages