S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

03/31/2017 - 00:59

భద్రాచలం, మార్చి 30: గత సోమవారం చత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని దండకారణ్యం సుక్మా జిల్లా సింగమడుగు వద్ద అదృశ్యమైన కెనడా దేశ పర్యాటకుడు జాన్‌ను గుర్తించి, విచారణ అనంతరం పోలీసుల రక్షణ మధ్య గురువారం కెనడా రాయబార కార్యాలయానికి అప్పగించారు. మావోయిస్టుల కోటలోకి తన సైకిల్ యాత్రలో భాగంగా ప్రవేశించిన జాన్ ఆచూకీ గల్లంతు కావడంతో కెనడా రాయబార కార్యాలయం అతన్ని క్షేమంగా అప్పగించాలని భారత ప్రభుత్వాన్ని కోరింది.

03/31/2017 - 00:57

హైదరాబాద్, మార్చి 30: ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని దేవాలయాల్లో వంశపారంపర్య అర్చకత్వం పునరుద్ధరిస్తామంటూ గతంలో పాలకులు ఇచ్చిన హామీ ఇప్పటి వరకు నెరవేరలేదు. ఈ విషయంలో ఉభయ తెలుగు రాష్ట్రాలకు చెందిన దేవాదాయ, ధర్మాదాయ శాఖ అధికారులు తాత్సారం చేస్తున్నారు. దాంతో ఉభయ తెలుగురాష్ట్రాల్లోని చిన్నదేవాలయాల అర్చకులు అసంతృప్తితో ఉన్నారు.

03/30/2017 - 07:02

తిరుపతి, మార్చి 29: తెలుగు నూతన సంవత్సరాది అయిన శ్రీ హేమలంబ నామ ఉగాది వేడకలు తిరుమల శ్రీవారి ఆలయంలో బుధవారం వైభవంగా జరిగాయి. ఉదయం 7 నుంచి 9గంటల వరకు నడుమ ఉగాది ఆస్థానం ఆగమోక్తంగా జరిగింది. ఇందులో భాగంగా శ్రీవారి ఉత్సవర్లను బంగారువాకిలిలో సర్వభూపాల వాహనంపై గరుడాళ్వారుకు అభిముఖంగా కూర్చోబెట్టారు.

03/29/2017 - 03:50

శ్రీ హేమలంబ నామ ఉగాది నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని మంగళవారం రాజ్‌భవన్‌లో గవర్నర్ నరసింహన్ నిర్వహించిన వేడుకలకు హాజరైన తెలుగు రాష్ట్రాల సిఎంలు చంద్రబాబు, కె చంద్రశేఖర్ రావు

03/29/2017 - 03:08

హైదరాబాద్, మార్చి 28: గౌతమీ పుత్ర శాతకర్ణి, రుద్రమదేవి తెలుగు సినిమాలకు ఆంధ్ర, తెలంగాణ ప్రభుత్వాలు వినోదం పన్ను నుంచి మినహాయింపు ఇవ్వడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌పై రెండు రాష్ట్ర ప్రభుత్వాలకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. సినీ ప్రేక్షకుల సంఘం తరపున ఎం వేణుగోపాలరావు దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు ధర్మాసనం విచారించింది.

03/29/2017 - 02:27

హైదరాబాద్, మార్చి 28: శ్రీహేమలంబ నామ ఉగాది నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని మంగళవారం సాయంత్రం రాజ్‌భవన్‌లో ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి.

03/29/2017 - 01:51

హైదరాబాద్, మార్చి 28: ఒక్క గ్రేటర్ పరిధిలోనే ఈ ఏడాది లక్ష ఇళ్లు పూర్తి చేస్తామని గృహ నిర్మాణ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, మున్సిపల్ వ్యవహారాల మంత్రి కె తారక రామారావు ప్రకటించారు. నగరంలో డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల నిర్మాణంపై మంత్రులు మంగళవారం సమీక్ష నిర్వహించారు. రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, జిల్లాల కలెక్టర్లు, జంట నగరాల ఎమ్మెల్యేలు, గృహ నిర్మాణ శాఖ, జిహెచ్‌ఎంసి అధికారులు పాల్గొన్నారు.

03/29/2017 - 01:50

హైదరాబాద్, మార్చి 28: అత్యవసర వైద్య సేవలు అందిస్తున్న 108 సిబ్బందికి ఉగాది కానుకగా ప్రభుత్వం వేతనాలు పెంచుతున్నట్టు ప్రకటించింది. ఒక్కో ఉద్యోగికి రూ.4 వేల చొప్పున పెంచడమే కాకుండా, 2016 ఏప్రిల్ నుంచి అమలుల్లోకి వస్తాయని వైద్య ఆరోగ్య మంత్రి సి లక్ష్మారెడ్డి వెల్లడించారు. ఉగాది కానుకగా సిఎం కెసిఆర్ తీసుకున్న నిర్ణయం వల్ల 1578మంది ఉద్యోగులకు లబ్ధి చేకూరుతుందని మంత్రి వివరించారు.

03/29/2017 - 01:47

రాజమహేంద్రవరం, మార్చి 28: ధాన్యాగారాలుగా పేరొందిన గోదావరి జిల్లాలు ప్రస్తుతం మొక్కజొన్న వైపు మొగ్గుచూపుతున్నాయి. మెట్టలో చాలాకాలం క్రితమే మొదలైన మొక్కజొన్న సాగు, ఇప్పుడు లంకలకు విస్తరిస్తోంది. మెట్ట సాగు ఎగుమతులపై ఆధారపడితే, లంకల్లో సాగవుతోన్న స్వీట్‌కార్న్ స్థానిక అవసరాలకే సరిపోతుండటం విశేషం. అప్పట్లో కేవలం సాధారణ రకం మొక్కజొన్న మాత్రమే సాగు జరిగేది.

03/29/2017 - 01:42

విజయవాడ (బెంజిసర్కిల్), మార్చి 28: తప్పు చేస్తే ఎంతటి వారినైనా తాట తీస్తానని సిఎం చంద్రబాబు అసెంబ్లీలో గట్టిగా హెచ్చరించారు. స్వపక్షమైనా, విపక్షమైనా, అధికారులైనా.. ఎవరు తప్పు చేసినట్టు తేలినా ఉపేక్షించేది లేదన్నారు. విద్యార్థుల అత్మస్థయిర్యాన్ని దెబ్బతీసేందుకు కొన్ని వర్గాలు ప్రయత్నిస్తున్నాయని అన్నారు.

Pages