S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

09/28/2016 - 07:34

హైదరాబాద్, సెప్టెంబర్ 27: తెలంగాణ రాష్ట్రంలో కొత్త జిల్లాల పునర్వ్యవస్థీకరణ సందర్భంగా ఉద్యోగుల విభజనపై ప్రత్యేకంగా ఒక కమిటీని నియమించాలని ప్రభుత్వం భావిస్తోంది. సమైక్య ఆంధ్రప్రదేశ్ విభజన సందర్భంగా ఉద్యోగుల విభజన కోసం కమలనాథన్ కమిటీని (చైర్మన్ అడ్వయిజరీ కమిటీ, ఎపి) కేంద్రం నియమించిన విషయం గమనార్హం.

09/28/2016 - 07:33

హైదరాబాద్, సెప్టెంబర్ 27: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఏపి పునర్విభజన చట్టంలోని ప్రభుత్వ రంగ సంస్థల విభజన, ఆస్తులు- అప్పులు, ఉద్యోగుల పంపకాలపై కేంద్రం నియమించిన షీలా భిడేకమిటీ పని కాలాన్ని పొడిగించారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 28వరకు ఈ కమిటీని పొడిగించారు. ఈ మేరకు కేంద్రం తీసుకున్న నిర్ణయంతో ఆర్టీసి విభజన త్వరలో ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. ఈ కమిటీ పదవీకాలం ఈ ఏడాది ఆగస్టు 31తో ముగిసింది.

09/28/2016 - 07:33

హైదరాబాద్, సెప్టెంబర్ 27: తెలంగాణలో మెడికల్, డెంటల్ కాలేజీల్లో ( ఎమ్సెట్-3) యుజి కోర్సుల అడ్మిషన్లకు మూడో దశ కౌనె్సలింగ్ నోటిఫికేషన్‌ను జారీ చేశారు. అలాగే మూడో దశలో మల్లారెడ్డి కాలేజీ ఫర్ ఉమెన్‌లో సీట్లు కేటాయిస్తారు. 28వ తేదీ రాత్రిలోగా స్పోర్ట్సు కోటా సీట్లు జాబితాను స్పోర్ట్సు అధికారులు అందజేస్తే వాటిని సైతం భర్తీ చేస్తారు.

09/28/2016 - 07:32

హైదరాబాద్, సెప్టెంబర్ 27:మిషన్ కాకతీయ పథకం గ్రామీణ ప్రాంతాల్లో మార్పులకు దోహదం చేస్తోందని, ఈ పథకం ఫలితాలపై ప్రపంచం ఆసక్తి చూపిస్తోందని షికాగో విశ్వవిద్యాలయం విద్యార్థులు అభిప్రాయం వ్యక్తం చేశారు.

09/28/2016 - 07:32

హైదరాబాద్, సెప్టెంబర్ 27: ఆంధ్రప్రదేశ్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ పరిధి నుంచి ఏ చట్టానికి లోబడి తెలంగాణ రాష్ట్రాన్ని మినహాయించాలని కేంద్రాన్ని కోరారో తెలియచేయాలని హైకోర్టు తెలంగాణ అడ్వకేట్ జనరల్‌ను ప్రశ్నించింది. తెలంగాణకు చెందిన దాదాపు 8670 కేసులను హైకోర్టుకు బదలాయించాలని కోర్టు పేర్కొంది.

09/28/2016 - 07:25

హైదరాబాద్, సెప్టెంబర్ 27: మిచిగాన్ గ్రాండ్ వాలీ విశ్వవిద్యాలయంలో ప్రఖ్యా త ఆంగ్లరచయిత షేక్‌స్పియర్‌పై జరుగుతున్న సదస్సులో పాల్గొనేందుకు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీకి చెందిన డాక్టర్ సత్యబ్రత రౌత్‌కు అవకాశం దక్కింది. అక్టోబర్ 1 నుండి 23వ తేదీ వరకూ జరిగే సాహితీ సమ్మేళనంలో డాక్టర్ సత్యబ్రత రౌత్ షేక్‌స్పియర్ ఉత్సవానికి హాజరవడంతో పాటు అక్కడ రంగస్థల తరగతులను సైతం తీసుకుంటారు.

09/28/2016 - 07:25

హైదరాబాద్, సెప్టెంబర్ 27: ఈ ఏడాది నవంబర్‌లో జరగనున్న ప్రపంచ ఆరోగ్య సంస్థ ముసాయిదా సదస్సుకు పొగాకు సాగు చేసే రైతులను కూడా అనుమతించాలని అంతర్జాతీయ పొగాకు పెంపకందార్ల సంఘం కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. ఈ సదస్సు ఢిల్లీలో నవంబర్‌లో ఢిల్లీలో జరుగుతుందని, పొగాకు పంటపై ఏకపక్ష నిర్ణయాలు తీసుకోరాదని సంఘం అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ వాన్ డెర్‌మెర్వ్ కోరారు.

09/28/2016 - 07:24

హైదరాబాద్, సెప్టెంబర్ 27: ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్ పంపిణీ వ్యవస్థను పటిష్ఠం చేసిన డిస్కంలను లాభాల బాటలో నడిపించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని ఇంధన శాఖ కార్యదర్శి అజయ్ జైన్ తెలిపారు. విద్యుత్ వాణిజ్య సరఫరా వ్యవస్థలో నష్టాలను పూర్తిగా తగ్గించేందుకు ప్రణాళిక ఖరారు చేశామన్నారు.

09/28/2016 - 07:23

హైదరాబాద్, సెప్టెంబర్ 27: ఏపిలో బిజెపి నాయకులు పార్టీ జాతీయ అధ్యక్షుడినే మర్చిపోతున్నారా? ప్రధానికి సముచిత స్థానం ఇవ్వాలన్న విషయం కూడా విస్మరిస్తున్నారా? తాజాగా తెనాలిలో కేంద్రమంత్రి వెంకయ్యనాయుడుకు జరిగిన సన్మానసభ, దానికోసం పార్టీ నేతలు ఏర్పాటుచేసిన ఫ్లెక్సీలు, ఆహ్వానపత్రాలు పరిశీలిస్తే ఇది నిజమేననిపిస్తోంది.

09/28/2016 - 07:21

హైదరాబాద్, సెప్టెంబర్ 27: ఏపిలో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణపై ఒకవైపు ఊహాగానాలు సాగుతున్న సమయంలోనే, వైసీపీ నుంచి పార్టీలో చేరిన ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇచ్చే విషయంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పునరాలోచనలో పడినట్లు సమాచారం.

Pages