S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

09/26/2016 - 05:17

విజయవాడ, సెప్టెంబర్ 25: అమరావతి ప్రాంతంలో అందునా కృష్ణానదీ తీరాన రాజధాని నిర్మాణం పర్యావరణానికే గొడ్డలిపెట్టు అంటూ పర్యావరణ జాతీయ ట్రిబ్యునల్‌లో పోరాడుతున్న సామాజికవేత్త బొలిశెట్టి సత్యనారాయణ నేతృత్వంలో రెండురోజులపాటు ఆ ప్రాంతంలో పర్యటించిన నిపుణుల బృందం వాస్తవిక పరిస్థితులను చూసి విస్మయానికి గురైంది.

09/26/2016 - 05:08

హైదరాబాద్, సెప్టెంబర్ 25: మం త్రుల తనయులపై వస్తున్న ఫిర్యాదులపై ఎట్టకేలకు స్పందించిన ఏపి ము ఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వారిని పిలిచి క్లాసు పీకి, ఇదే చివరి హె చ్చరిక అన్నారు. మీ పనితీరు మార్చుకోవాలని, నియోజకవర్గాల్లో జోక్యం చేసుకోకుండా, వివాదాలకు దూరంగా ఉండి, జననేతలుగా ఎదగాలని హిత వు పలికారు.

09/26/2016 - 05:07

తిరుమల, సెప్టెంబర్ 25: శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు పటిష్ఠ బం దోబస్తుతో పాటు భక్తులకు పోలీస్ శాఖ తరపున స్నేహపూర్వకంగా సేవ లు అందిస్తామని ఆంధ్రప్రదేశ్ డిజిపి సాంబశివరావు తెలిపారు. ఆదివారం ఉదయం ఆయన తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. దర్శనానంతరం రాయలసీమ ప్రాం తానికి చెందిన పలువురు పోలీస్ ఉన్నతాధికారులతో కలసి ఆలయ తిరుమాడ వీధులు, రాంభగీచ తదితర ప్రదేశాలను పరిశీలించారు.

09/26/2016 - 05:06

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 25: మూడో అంతర్జాతీయ హిందీ సమ్మేళనంలో పాల్గొవలసిందిగా కేంద్రీయ హిందీ సమితి సభ్యుడు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌కు మాస్కోలోని భారత దౌత్య కార్యలయం ఆహ్వానం పంపింది. మాస్కో విశ్వవిద్యాలయం, రష్యాలోని భారత దౌత్యకార్యాలయం సంయుక్తంగా అక్టోబర్ 26,27 తేదీలలో రష్యా రాజధాని మాస్కోలో ఈ సమ్మేళనాన్ని నిర్వహిస్తున్నాయి. ఈ సమ్మేళనంలో వివిధ విషయాలపై చర్చ జరుగుతుంది.

09/26/2016 - 05:01

హైదరాబాద్, సెప్టెంబర్ 25: హైదరాబాద్‌లో ఈ సంవత్సరం రికార్డు స్థాయిలో వర్షం కురిసింది. 108 ఏళ్ల తరువాత ఇంత భారీ వర్షం కురిసినట్టు అధికారులు పేర్కొంటున్నారు. 1908 సెప్టెంబర్‌లో 499 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదు కాగా, 2016 సెప్టెంబర్‌లో 407 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. వందేళ్ల క్రితంతో పోలిస్తే 92 మిల్లీ మీటర్లు తక్కువే. గత 30 ఏళ్లలో 132 మిల్లీ మీటర్ల సాధారణ వర్షపాతం నమోదైంది.

09/26/2016 - 05:00

తిరుమల, సెప్టెంబర్ 25: ప్రతిభ కలిగిన క్రీడాకారులను ప్రోత్సహించేందు కు బిసిసిఐ సెలక్షన్ కమిటీ ఎల్లప్పుడూ ముందుంటుందని ఆ కమిటీ చైర్మన్ ఎంఎస్‌కె ప్రసాద్ వెల్లడించారు. ఆదివారం వేకువజామున ఆయన శ్రీవారి సుప్రభాత సేవలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయం వెలుపల ఆయన విలేఖరులతో మాట్లాడుతూ ప్రతిభ, నైపుణ్యం కలిగి ఉంటే ప్రాంతాలు, కులాలకు అతీతంగా ఆటగాళ్లను ఎంపిక చేస్తామన్నారు.

09/26/2016 - 05:03

హైదరాబాద్, సెప్టెంబర్ 25: ప్రత్యేక హోదా ద్వారానే ఆర్ధిక సంక్షోభంతో సతమతమవుతున్న ఆంధ్ర రాష్ట్రానికి సంపూర్ణ ప్రయోజనాలు చేకూరుతాయని ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి అన్నారు. అవసరమైతే హోదా సాధనకు తమ పార్టీ ఎంపీలతో రాజీనామా చేయిస్తానన్నారు. హోదా సాధనకు వామపక్షపార్టీలతో, ప్రజా సంఘాలతో కలిసి పోరాడుతామని చెప్పారు. ఎంపీలతో రాజీనామా చేయించడమనేది బ్రహ్మాస్తమ్రన్నారు.

09/26/2016 - 04:43

గురజాల, సెప్టెంబర్ 25: వరదల వల్ల పంటనష్టపోయిన రైతులందరినీ ఆదుకుని రైతుల రుణం తీర్చుకుంటానని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఇటీవల కురిసిన భారీవర్షాల వల్ల పట్టణంలోని గాడిదల వాగు సమీపంలో పూర్తిగా దెబ్బతిన్న పంట పొలాలను ఆదివారం సిఎం పరిశీలించారు. పంటనష్టం జరిగిన తీరును రైతులను అడిగి తెలుసుకున్నారు.

09/26/2016 - 04:40

దాచేపల్లి, సెప్టెంబర్ 25: వ్యాపారం వ్యాపారంగానే చేయాలి. స్వలాభం కోసం వ్యాపారం పేరుతో ప్రజల జీవితాలతో ఆడుకుంటే ఎట్టి పరిస్థితులలో క్షమించబోనని ముఖ్యమంత్రి చంద్రబాబు హెచ్చరించారు. గుంటూరు జిల్లా దాచేపల్లిలో వరద బాధితులను పరామర్శించిన అనంతరం స్థానిక పాత బస్టాండ్ సెంటర్‌లో ప్రజలను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు.

09/26/2016 - 04:21

హైదరాబాద్, సెప్టెంబర్ 25: మెదక్ జిల్లా ఏడుపాయలలో చిక్కుకున్న కూలీలను రక్షించడానికి ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు చూపిన చొరవ ఫలించింది. ఏడుపాయల వద్ద జరుగుతున్న బ్రిడ్జి పనులు చేయడానికి నాలుగు రోజుల కిందట ఒరిస్సా, మధ్యప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన 23 మంది నిర్మాణ కూలీలు (ఒకరు మహిళ) వచ్చారు. అయితే సింగూరు నుంచి నీటి ప్రవాహం పెరగడంతో ఘనపురం నుంచి నీరు విడుదల చేశారు.

Pages