S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

10/02/2016 - 01:50

హైదరాబాద్, అక్టోబర్ 1: ఇంకో పది రోజుల్లో కొత్త జిల్లాలు ఉనికిలోకి రానున్నాయి. పాత జిల్లాల చరిత్ర దాదాపు ముగిసినట్టే. జిల్లా, రాష్టస్థ్రాయి యంత్రాంగం మొత్తం కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియలో బిజీగా ఉండటంతో ఇతర కార్యకలాపాలు సాగడం లేదు. కొత్త జిల్లాల్లో తొలిరోజు నుంచే పాలన ఎలా ఉండాలన్న అంశంపై సిఎస్ రాజీవ్ శర్మ శనివారం వివిధ శాఖల ఉన్నతాధికారులతో సమావేశమై మార్గనిర్దేశం చేశారు.

10/02/2016 - 01:47

నిజామాబాద్, అక్టోబర్ 1: వరద ఉద్ధృతితో ప్రవహిస్తున్న పిల్లివాగులో కారు కొట్టుకుపోయి తల్లి ఐదుగురు పిల్లలు జలసమాధి అయ్యారు. ఈ విషాదకర సంఘటన నిజామాబాద్ జిల్లా పిట్లం మండలం కారేగాం సమీపంలోని పిల్లివాగు వద్ద శనివారం చోటుచేసుకుంది. మెదక్ జిల్లా తడ్కల్‌కు చెందిన జంగం రాజమణి (40) కుమార్తె హస్మిత (2) శనివారం ఉదయం ఆడుకుంటూ వొంటిపై టీ వొంపుకుంది.

10/02/2016 - 01:41

హైదరాబాద్, అక్టోబర్ 1: తెలంగాణలోని తొమ్మిది జిల్లాల్లో పరిశ్రమల స్థాపనకు ప్రోత్సాహకంగా కేంద్రం పన్ను రాయితీ ప్రకటించింది. హైదరాబాద్ వినా మిగిలిన తొమ్మిది జిల్లాలు ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, మెదక్, మహబూబ్‌నగర్, రంగారెడ్డి, నల్లగొండ, ఖమ్మం జిల్లాల్లో పన్ను రాయితీలు ప్రకటించింది. ఏప్రిల్ 1, 2015 నుంచి మార్చి 2020 వరకు ఐదేళ్లపాటు పన్ను రాయితీలు వర్తిస్తాయి.

10/02/2016 - 01:27

విజయవాడ, అక్టోబర్ 1: ఆంధ్రప్రదేశ్‌లో ‘సెంటర్ ఫర్ స్పేస్ ఇన్నోవేషన్’ సంస్థను ఏర్పాటు చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు సూత్రప్రాయంగా అంగీకరించారు. త్వరలో రాష్ట్ర ఉన్నత విద్యామండలి, ఇస్రో మధ్య అవగాహన ఒప్పందం కుదుర్చుకోనున్నట్లు ఆయన ఇస్రో అధికారులకు తెలిపారు. విజయవాడ పోలీస్ కమాండ్ కమ్యూనికేషన్ సెంటర్‌లో ముఖ్యమంత్రితో ఇస్రో అధికారులు, రాష్ట్రంలోని వివిధ యూనివర్సిటీల వైస్ ఛాన్సలర్లు భేటీ అయ్యారు.

10/02/2016 - 01:21

తిరుపతి, అక్టోబర్ 1: ఆంధ్రప్రదేశ్‌కు మహర్దశ కల్పించడమే లక్ష్యంగా కేంద్రం సహకారం అందిస్తోందని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు చెప్పారు. చిత్తూరు జిల్లా బిజెపి నాయకులు శనివారం తిరుపతిలో ఆయనకు సన్మానసభ ఏర్పాటుచేశారు. ఈ సందర్భంగా సభను ఉద్దేశించి వెంకయ్య మాట్లాడుతూ విభజన చట్టానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ చేసిన తప్పిదాలను తాను నిలదీసిన విధానాన్ని వివరించారు.

10/02/2016 - 01:19

విజయవాడ, అక్టోబర్ 1: వెలగపూడి సచివాలయం విజయదశమి నుంచి పూర్తిస్థాయిలో పనిచేయటం ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆర్టీసీ సోమవారం నుంచి విజయవాడ నగర పరిసరాల నుంచి ప్రత్యేక మెట్రో సిటీ సర్వీసులను నడుపనున్నది.

10/02/2016 - 01:17

గుంటూరు, అక్టోబర్ 1: రాజధానికి భూములిచ్చిన రైతుల సౌకర్యం కోసం నాలుగు రిజిస్ట్రేషన్ కార్యాలయాలను ఏర్పాటు చేసేందుకు ఉత్తర్వులు జారీ అయ్యాయని సిఆర్‌డిఎ కమిషనర్ చెరుకూరి శ్రీ్ధర్ వెల్లడించారు. శనివారం సాయంత్రం తుళ్లూరు సిఆర్‌డిఎ కార్యాలయ ఆవరణలో ఐనవోలు, అబ్బరాజుపాలెం గ్రామాల్లో భూములిచ్చిన రైతులకు ప్లాట్లు పంపిణీ చేశారు.

10/01/2016 - 06:44

హైదరాబాద్, సెప్టెంబర్ 30: దర్యాప్తు అధికారులు కేసు నమోదులో చేసిన తప్పిదాల వల్ల నలుగురి హత్య కేసులో కింది కోర్టు ఇద్దరు నిందితులకు విధించిన ఉరి శిక్షను రద్దు చేస్తూ హైకోర్టు ధర్మాసనం శుక్రవారం సంచలన తీర్పు ఇచ్చింది. ఈ కేసులో భార్య, అత్త, మామ, మేనల్లుడిని నిందితులు అతి కిరాతకంగా హత్య చేసినట్లు ప్రాసిక్యూషన్ పేర్కొంది.

10/01/2016 - 06:02

హైదరాబాద్, సెప్టెంబర్ 30: గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్ (జిహెచ్‌హెచ్‌ఎఫ్), సేవ్ టెంపుల్స్ ఆర్గ్ (యుఎస్‌ఎ) సంయుక్తంగా శనివారం ‘సేవ్ టెంపుల్స్ డాక్యుమెంటరీ’ చలన చిత్రోత్సవాన్ని నిర్వహించనున్నాయి. బంజారాహిల్స్‌లోని ప్రసాద్ లాబ్స్‌లో మధ్యాహ్నం 3 నుంచి రాత్రి 8 గంటల వరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ఆ సంస్థ ప్రచార సారథి డాక్టర్ గజల్ శ్రీనివాస్ తెలిపారు.

10/01/2016 - 06:01

హైదరాబాద్, సెప్టెంబర్ 30: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీలో నిర్వహించిన క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో ఎంసిఎ విద్యార్థి రవిచంద్ర మంగిపూడికి జపాన్‌కు చెందిన ఒక కంపెనీ 40 లక్షల రూపాయల వేతన ఆఫర్‌ను ఇచ్చింది. ఈ సీజన్‌లో ఇదే గరిష్ట వేతనమని వర్శిటీ వర్గాలు పేర్కొన్నాయి. వేతనానికి తోడు అదనపు ఆర్థిక ప్రయోజనాలను కూడా కంపెనీ ఆఫర్ చేసిందని అన్నారు.

Pages