S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

10/03/2016 - 08:08

హైదరాబాద్, అక్టోబర్ 2: కోర్టులు తమ వద్దకు వచ్చే విడాకుల పిటిషన్‌లకు సంబంధించి వీలైనంత వరకు దంపతులు కలిసి కాపురం చేసేందుకు అన్ని రకాలు చర్యలు తీసుకోవాలని, అదే సమయంలో వారు కలిసి ఉండలేని పక్షంలో బలవంతంగా కలిపేందుకు ఒత్తిడి చేస్తే బెడిసికొడుతుందని హైకోర్టు పేర్కొంది. విడాకులకు సంబంధించి ఒక కేసులో జస్టిస్ సివి నాగార్జున రెడ్డి, జస్టిస్ జి శ్యాంప్రసాద్‌తో కూడిన ధర్మాసనం ఈ తీర్పును వెలువరించింది.

10/03/2016 - 07:47

హైదరాబాద్, అక్టోబర్ 2: వచ్చే సంక్రాంతికి ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, గోదావరి జిల్లాల్లో కాకినాడ, రాజమండ్రి, ఏలూరు, భీమవరం, నర్సాపురం లేదా ప్రకాశం, నెల్లూరు వైపు రైళ్లలో ప్రయాణం చేద్దామమనుకుంటే నిరాశే. ఆన్‌లైన్‌లో లేదా రిజర్వేషన్ కౌంటర్లలకు వెళ్లి టిక్కెట్ బుక్ చేద్దామంటే చాంతాడంత వెయిటింగ్ లిస్టు దర్శనిమిస్తుంది.

10/02/2016 - 03:39

హైదరాబాద్, అక్టోబర్ 1: తెలంగాణలోని అన్ని జిల్లాలతో పాటు కోస్తాంధ్రలోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, ఉభయగోదావరి జిల్లాల్లో ఆదివారం ఒక మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండి) హెచ్చరించింది. ఈ మేరకు ఐఎండి శాస్తవ్రేత్త శంభురవీందర్ పేరుతో ఒక బులెటిన్ విడుదలైంది.

10/02/2016 - 03:22

న్యూఢిల్లీ, అక్టోబర్ 1: సాహిత్య అకాడమీ, సంగీత, నాటక అకాడమీ, లలితకళా అకాడమీ, నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామాల తరహా సంస్థలను రాష్ట్రంలో ఏర్పాటు చేయటం ద్వారా తెలుగు భాష, సంస్కృతి, సాంస్కృతిక ఔన్నత్యానికి, అభివృద్ధికి కృషి చేయనున్నట్లు తెలుగు భాష అధ్యయన సంఘం తెలిపింది.

,
10/02/2016 - 02:23

సంగారెడ్డి, అక్టోబర్ 1: భారీ వర్షాల కారణంగా సింగూరుకు తలెత్తిన పెను ముప్పు తృటిలో తప్పింది. పశ్చిమ మెదక్‌లోని జహీరాబాద్, నారాయణఖేడ్ ప్రాంతాల్లో శుక్రవారం రాత్రి నుంచి శనివారం ఉదయం వరకూ ఎడతెరపిలేని వర్షం గ్రామాలను అతలాకుతలం చేసింది. చెరువుల్లోకి భారీగా నీరు చేరడంతో కొన్ని చెరువులకు గండ్లుపడ్డాయి. మరోపక్క వాగుల్లోకి వరద పోటెత్తడంతో మంజీర మరోమారు పరవళ్లుతొక్కింది.

10/02/2016 - 02:17

హైదరాబాద్/ఖైరతాబాద్, అక్టోబర్ 1: భారతీయ హైందవ దేవాలయాలు ఆధ్యాత్మిక నిలయాలు మాత్రమే కాదు, విజ్ఞాన కేంద్రాలని భారతీయ జనతా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి పి మురళీధర్‌రావు అన్నారు. శనివారం బంజారాహిల్స్ ప్రసాద్ ల్యాబ్స్‌లో గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్, సేవ్ టెంపుల్స్ ఆధ్వర్యంలో దేవాలయాల పరిరక్షణపై డాక్యుమెంటరీ చిత్ర ప్రదర్శన, బహుమతుల ప్రదానోత్సవ కార్యక్రమం జరిగింది.

10/02/2016 - 02:10

హైదరాబాద్, అక్టోబర్ 1: ఆంధ్రప్రదేశ్‌లో అన్ని వేదపాఠశాలలు, వేద వాంజ్ఞయం, వైదిక ప్రక్రియలను బోధించే సంస్థలను ఒకే గొడుగు కిందకు తీసుకురావాలని హైకోర్టు రాష్ట్రప్రభుత్వాన్ని ఆదేశించింది. దీని నిమిత్తం దేవాదాయ చట్టానికి సవరణలు తేవాలని లేదా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ద్వారా ఒక సొసైటీని ఏర్పాటు చేయాలని కోరింది.

10/02/2016 - 02:09

తిరుమల, అక్టోబర్ 1: తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు అక్టోబర్ 3 నుంచి 11వ తేదీ వరకు వైభవంగా జరుగనున్నాయి. ఇందుకోసం అక్టోబర్ 2వ తేదీ రాత్రి 7 నుంచి 8 గంటల నడుమ అంకురార్పణ నిర్వహిస్తారు. అక్టోబర్ 3న ఉదయం విశ్వరూప దర్శనం, సాయంత్రం 6.15 నుంచి 6.30 గంటల మధ్య మీన లగ్నంలో ధ్వజారోహణం జరుగనుంది.

10/02/2016 - 02:08

కర్నూలు, అక్టోబర్ 1: శ్రీశైలం ప్రాజెక్టుకు సాయుధ పోలీసులతో కూడిన భద్రత ఏర్పాటు చేశారు. ఉగ్రదాడులు జరుగవచ్చన్న ముందస్తు హెచ్చరికల నేపథ్యంలో రాష్టవ్య్రాప్తంగా కీలకమైన ప్రాంతాల్లో భద్రత పెంచాలని ఏపి సిఎం చంద్రబాబునాయుడు శుక్రవారం ఆదేశాలు జారీ చేసిన సంగతి విదితమే.

10/02/2016 - 02:04

హైదరాబాద్, అక్టోబర్ 1: ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల నష్టపోయిన తెలంగాణ రాష్ట్రానికి తగిన ఆర్థిక సహాయం అందించాలని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను కోరారు. రాష్ట్రంలో జరిగిన వరద నష్టాన్ని శనివారం ఫోన్‌లో కేంద్ర మంత్రికి వివరించారు.

Pages