S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

06/22/2016 - 01:29

హైదరాబాద్, జూన్ 21: దివంగత మాజీ ప్రధాని పివి నరసింహారావు 1991లో అధికారంలోకి వచ్చిన సమయంలో ఐదేళ్లకాలం పదవిలో కొనసాగుతారని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ ఊహించలేదని, మహా అంటే రెండేళ్లు ఆ పదవిలో ఉంటారని భావించారని పివి మనుమడు ఎన్‌వి సుభాష్ అన్నారు. పివిని అన్ని రకాలుగా సోనియా కించపరిచారన్నారు. కాంగ్రెస్ పార్టీ పివిని గౌరవించలేకపోయినా, ప్రధాని నరేంద్రమోదీ గౌరవించినందుకు సంతోషంగా ఉందన్నారు.

06/21/2016 - 08:23

హైదరాబాద్, జూన్ 20 : సోమవారం ఏరువాక పున్నమి కావడంతో ఉభయ తెలుగు రాష్ట్రాల్లో రైతులు తమ భూములను సాగు చేయడం ప్రారంభించారు. గత ఇరవై ఐదుల రోజుల నుండి అడపాదడపా కురిసిన వర్షానికి భూమి చదును చేసుకున్నారు. తెలుగు సాంప్రదాయం ప్రకారం జైష్టమాసంలో వచ్చే పున్నమిని ఏరువాక పున్నమి అంటారు. సోమవారం ఏరువాకపున్నమి కావడంతో విత్తనాలను వేయడం ప్రారంభించారు.

06/21/2016 - 07:44

సూళ్లూరుపేట, జూన్ 20: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తలపెట్టిన 20 ఉపగ్రహాల ప్రయోగానికి శాస్తవ్రేత్తలు సర్వం సిద్ధం చేశారు. నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రం సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి ఈ నెల 22వ తేదీ బుధవారం పిఎస్‌ఎల్‌వి సి-34 వాహక నౌక ద్వారా 20 ఉపగ్రహాలను ఒకే పర్యాయం రోదసీలోకి పంపనున్నారు.

06/21/2016 - 06:39

హైదరాబాద్, జూన్ 20: బహుళ జాతులు, మతాలు, సంస్కృతులు గల భారత్ వంటి దేశంలో ఉమ్మడి పౌరస్మృతి ఉండటం సాధ్యం కాదని ఎఐఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. అవిభక్త హిందూ కుటుంబాలు (హెచ్‌యుఎఫ్) పొందుతున్న పన్ను రాయితీలను సమీక్షించడానికి సంఘ్ పరివార్ సిద్ధంగా ఉందా? అని ఆయన నిలదీశారు. హైదరాబాద్ లోక్‌సభ సభ్యుడయిన అసదుద్దీన్ సోమవారం ఇక్కడ పిటిఐ వార్తాసంస్థతో ఉమ్మడి పౌరస్మృతి తదితర అంశాలపై మాట్లాడారు.

06/20/2016 - 06:55

హైదరాబాద్/శేరిలింగంపల్లి, జూన్ 19: పూర్వ కాలంలో విశ్వమంతటా వేదం, వేద సంస్కృతి, వేద ఘోష తాండవించేవని ఆంధ్రభూమి సంపాదకులు ఎంవిఆర్ శాస్ర్తీ పేర్కొన్నారు. శ్రీ వేదభారతి రజతోత్సవ వేడుకలను పురస్కరించుకుని రామచంద్రాపురంలోని బిహెచ్‌ఇఎల్ టౌన్‌షిప్‌లోని శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయం హాల్‌లో వేడుకలు నిర్వహించారు.

06/20/2016 - 04:31

హైదరాబాద్, జూన్ 19: రెండేళ్ల క్రితం వరకూ మీడియా... వారి చుట్టూనే పరిభ్రమించేది. వారు నోరు తెరిస్తే సంచలనమే. సమైక్య, తెలంగాణ ఉద్యమాల సమయంలో హల్‌చల్ చేసిన ఆ నేతలందరూ నేడు కనుమరుగయ్యారు. కాలానికి అనుగుణంగా వెళుతున్న ఈ నేతలు ఇప్పుడు ఎక్కడున్నారు? ఏం చేస్తున్నారు? మళ్లీ తెరపైకొస్తారా?

06/20/2016 - 04:08

హైదరాబాద్, జూన్ 19:కేంద్ర మంత్రివర్గ విస్తరణ ఈనెల 22న జరుగుతుందన్న వార్తల నేపథ్యంలో మిత్రపక్షమైన తెలుగుదేశం పార్టీకి అదనంగా మరొక కేంద్రమంత్రి పదవి ఇవ్వాలని బిజెపి నిర్ణయించింది. అడిగిన వెంటనే సురేష్ ప్రభుకు రాజ్యసభ సీటు ఇచ్చినందుకు ప్రత్యుపకారంగా, మిత్రపక్షమైన టిడిపికి మరొక కేంద్రమంత్రి పదవి ఇవ్వాలని బిజెపి నిర్ణయించినట్లు ఆంధ్రభూమిలో గతంలోనే వార్తాకథనం వెలువడిన విషయం తెలిసిందే.

06/19/2016 - 08:08

హైదరాబాద్, జూన్ 18: ఎట్టకేలకు నైరుతి రుతుపవనాల మూలంగా తొలకరి జల్లులు కోస్తా, రాయలసీమ అన్ని జిల్లాలతో పాటు, తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో పడుతుండటంతో రైతులు ఆనందపడుతున్నారు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌లోని 13 జిల్లాలతో పాటు తెలంగాణలోని మహబూబ్‌నగర్, రంగారెడ్డి, హైదరాబాద్, నల్లగొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో విస్తరించాయి.

06/19/2016 - 08:01

హైదరాబాద్, జూన్ 18: తెలంగాణ ప్రభుత్వం స్పష్టమైన విధానంతో ముందుకు వెళుతోందని ఐటి విధానం, పారిశ్రామిక విధానం బాగుందని కేంద్ర రక్షణ మంత్రి మనోహర్ పారికర్ అన్నారు. రాష్ట్ర ఐటి మంత్రి కె తారక రామారావుతో కలిసి మనోహర్ పారికర్ శనివారం టి-హబ్‌ను సందర్శించారు. తెలంగాణకు వస్తున్న పెట్టుబడులను చూస్తుంటే ప్రభుత్వ పాలసీలు విజయవంతం అయినట్టేనని అన్నారు.

06/19/2016 - 07:56

హైదరాబాద్, జూన్ 18: రక్షణ రంగంలో కొత్త టెక్నాలజీ విధానాలను సైన్యాధికారులు అధ్యయనం చేయాలని భారత రక్షణ మంత్రిత్వ శాఖ సైంటిఫిక్ సలహాదారు డాక్టర్ సతీష్ రెడ్డి కోరారు. శనివారం ఇక్కడ ఎంసిఇఎంఇ సంస్థలో జరిగిన కార్యక్రమంలో ఆయన 25 మంది సాంకేతిక ఎంట్రీ స్కీం అధికారులకు ఇంజనీరింగ్ డిగ్రీలను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎప్పటికప్పుడు టెక్నాలజీలో వస్తున్న మార్పులను ఆకళింపు చేసుకోవాలన్నారు.

Pages