S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

06/18/2016 - 04:32

హైదరాబాద్, జూన్ 17: ముద్రగడ పద్మనాభం దీక్ష అనంతర పరిణామాల్లో చంద్రబాబు సర్కారుపై తామే పైచేయి సాధించామని కాపుప్రముఖులు అభిప్రాయపడ్డారు. కేసులు పెట్టినవారు విడుదల కావడం ముద్రగడ సాధించిన విజయమని, ఈ క్రమంలో అగ్రనేతలంతా జాతి ప్రయోజనాల కోసం ఒక్కతాటిపైకి రావడం శుభసంకేతమని శుక్రవారం కేంద్రమాజీ మంత్రి పళ్లంరాజు నివాసంలో జరిగిన కాపు ప్రముఖుల భేటీలో పలువురు నేతలు వ్యాఖ్యానించారు.

06/18/2016 - 04:28

హైదరాబాద్, జూన్ 17: ఎన్నికల్లో కుల, మత, ధన ప్రభావం ప్రజాస్వామ్యానికే అవమానమని కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ మంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. రాజ్యసభ సభ్యుడిగా నాలుగోసారి ఎన్నికైన కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడును శుక్రవారం హైదరాబాద్‌లో ఇమేజ్ గార్డెన్స్‌లో పార్టీలకు అతీతంగా జరిగిన ఆత్మీయ అభినందన సభలో సత్కరించారు. ఈ సందర్భంగా పలువురు ప్రసంగిస్తూ వెంకయ్యనాయుడు చేసిన సేవలను కొనియాడారు.

06/17/2016 - 07:37

తిరుపతి, జూన్ 16: కలియుగ ప్రత్యక్షదైవం తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి దర్శనార్థం విచ్చేసే లక్షలాది మంది భక్తులకు మరింత త్వరితగతిన, పారదర్శకంగా సేవలు అందించేందుకు రూపొందించిన నెక్ట్స్‌జన్ వెబ్‌సైట్‌ను టిటిడి కార్యనిర్వాహణాధికారి డాక్టర్ డి.సాంబశివరావు ప్రారంభించారు. తిరుపతిలోని టిటిడి పరిపాలనాభవనంలో గురువారం ఉదయం ఆయన ప్రయోగాత్మకంగా ఈ సైట్‌ను ప్రారంభించారు.

06/17/2016 - 07:30

హైదరాబాద్/ముషీరాబాద్, జూన్ 16: అగ్రిగోల్డ్ బాధితులు గురువారం హైదరాబాద్‌లో మహాధర్నా నిర్వహించారు. దేశంలోనే భారీ ఆర్థిక కుంభకోణానికి పాల్పడిన అగ్రిగోల్డ్ సంస్థ వ్యవహారాన్ని తక్షణం సిబిఐకి బదలాయించి సమగ్ర విచారణ జరిపించి బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఏజెంట్లు, బాధితులు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ధర్నాకు రాజకీయ పక్షాలు, ప్రజాసంఘాలు, కాంగ్రెస్ నేత విహెచ్, లక్ష్మిపార్వతి మద్దతు పలికారు.

06/17/2016 - 07:26

విజయవాడ, జూన్ 16: ఆదాయ సముపార్జిత ప్రభుత్వ శాఖలు మూస ధోరణిలో కాకుండా సాంకేతికతను జోడించి శాస్ర్తియ పద్ధతిలో మరింత విశే్లషణాత్మకంగా నివేదికలను రూపొందించాలని ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నిర్దేశించారు.

06/17/2016 - 07:23

హైదరాబాద్, జూన్ 16: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీలో ఇద్దరు అధ్యాపకులను సస్పెండ్ చేసిన నేపథ్యంలో యూనివర్శిటీ మరో మారు అట్టుడికిపోతోంది. మరో ఐదుగురు బోధనేతర సిబ్బందిపై వేటు వేసేందుకు రంగం సిద్ధమైందని తెలియడంతో ఉద్యమానికి వారు సైతం ముందుకు వచ్చారు.

06/17/2016 - 07:21

హైదరాబాద్, జూన్ 16: తెలంగాణ రాష్ట్రంలో ఇంజనీరింగ్, టెక్నాలజీ, ఆర్కిటెక్చర్, ఫార్మసీ పిజి కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించిన పిజి ఇసెట్ ఫలితాలను ఉస్మానియా యూనివర్శిటీలో ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ టి పాపిరెడ్డి గురువారం ఉదయం విడుదల చేశారు.

06/17/2016 - 07:20

విజయవాడ, జూన్ 16: ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా జీవితాల్లో మార్పులు తెచ్చి వారి సర్వతోముఖాభివృద్ధికై ప్రధాని నరేంద్ర మోదీ నిరంతరం కృషి చేస్తున్నారని కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ మంత్రి ముప్పవరపు వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. దేశంలో మరిన్ని వైద్య విద్యాలయాల స్థాపనకు కేంద్రం కృషి చేస్తోందని ప్రతీ కుటుంబానికి రూ.లక్ష బీమా కల్పిస్తామని ఆయన తెలిపారు.

06/17/2016 - 07:19

పనాజీ, జూన్ 16: కేంద్ర ప్రభుత్వం చేపట్టిన గ్రామీణ విద్యుదీకరణ పథకాలు, పట్టణాల్లో విద్యుత్ వౌలిక సదుపాయాల ఆధునీకరణ వంటి వాటికి సంబంధించి కేటాయించిన నిధుల వినియోగంలో అక్రమాలు జరిగితే సదరు రాష్ట్రాలకు నిధులు నిలిపివేస్తామని ఇంధన శాఖ మంత్రి పియూష్ గోయల్ హెచ్చరించారు.

06/17/2016 - 07:17

హైదరాబాద్, జూన్ 16: కేంద్రప్రభుత్వం ఏం చేస్తోందో, ఎలా చేస్తోందో వివిధ అభివృద్ధి పథకాలను ప్రజల వద్దకు ఎలా చేరువ చేస్తోందో తెలుసుకోకుండా తెలంగాణ రాష్ట్ర మంత్రులు మాట్లాడటం సరికాదని కేంద్ర కార్మిక మంత్రి బండారు దత్తాత్రేయ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ఐటి మంత్రి కెటిఆర్ ఇవన్నీ తెలుసుకుని మాట్లాడాలని సూచించారు. కేంద్రం చేస్తున్న అభివృద్ధిపై నిజాలను తెలుసుకోవాలని కెటిఆర్‌కు ఆయన సూచించారు.

Pages