S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

06/19/2016 - 02:46

గుంటూరు, జూన్ 18: ఆంధ్రప్రదేశ్ రాజధానిలోని ప్రభుత్వ భవనాల నిర్మాణం తాత్కాలికమా? శాశ్వతమా? అనేది అంతుపట్టడం లేదు. ముఖ్యమంత్రి పదే పదే తాత్కాలిక భవనాలేనని చెబుతున్నా, చేసే ఖర్చు, నిర్మాణాల తీరు చూస్తే శాశ్వత భవనాలను తలపిస్తున్నాయి. ఓవైపు 750 కోట్ల రూపాయల వ్యయంతో తాత్కాలిక సచివాలయ భవనాలను కడుతుండగా, దాని ఎదురుగానే అసెంబ్లీ భవన సముదాయాన్నీ ఇటీవలే ప్రారంభించారు. దీనికి అంచనా వ్యయంపై స్పష్టత రాలేదు.

06/19/2016 - 02:50

విశాఖపట్నం, జూన్ 18: కాశ్మీర్ పేరు చెబితే స్పురించేది తియ్యటి యాపిల్స్. మనకు సదా అందుబాటులో ఉండే యాపిల్స్ అత్యధిక శాతం కాశ్మీర్, సిమ్లా ప్రాంతాల నుంచే దిగుమతి అవుతుంటాయి. మనం తినే యాపిల్స్‌ను మనమే పండిస్తే పోలా అన్న అలోచన స్పురించడంతో మన శాస్తవ్రేత్తలు ఆ దిశగా అడుగులు వేశారు.. విజయం సాధించారు. చింతపల్లిలోని ఆచార్య రంగా వ్యవసాయ పరిశోధన కేంద్రం శాస్తవ్రేత్తలు చేసిన ప్రయోగాలు ఫలించాయి.

06/18/2016 - 07:34

తిరుమల శ్రీవారి ఆలయంలో స్వామివారి జ్యేష్ట్భాషేకం శుక్రవారం ఘనంగా ప్రారంభమైంది. ప్రతి సంవత్సరం జ్యేష్ట మాసంలో జ్యేష్టా నక్షత్రానికి ముగిసేటట్లుగా మూడు రోజులపాటు సంపంగి ప్రదక్షిణంలోని కల్యాణ మండపంలో ఈకార్యక్రమం నిర్వహిస్తారు. దీనినే అభిద్యేయక అభిషేకం అని కూడా అంటారు.

06/18/2016 - 07:30

తిరుమల, జూన్ 17: గదుల ముందస్తు బుకింగ్‌కు దాతల నుంచి వసూలు చేస్తున్న కాషన్ డిపాజిట్‌ను ఈనెల 20వ తేదీ నుంచి రద్దు చేస్తున్నట్లు టిటిడి ఇ ఒ డాక్టర్ డి.సాంబశివరావు వెల్లడించారు. తిరుమలలోని అన్నమయ్య భవన్‌లో శుక్రవారం టిటిడి సీనియర్ అధికారులతో ఇ ఒ సమీక్షాసమావేశం నిర్వహించారు.

06/18/2016 - 07:30

రాజమహేంద్రవరం, జూన్ 17: కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం ఆరోగ్యం విషమంగా మారిందని వార్తలొస్తున్న నేపథ్యంలో తూర్పు గోదావరి జిల్లాలో కాపు సామాజిక వర్గీయులు ఆందోళనలకు దిగుతున్నారు. నిషేధాజ్ఞలను ఉల్లంఘించి శుక్రవారం రాస్తారోకోలు, ధర్నాలు, ప్రదర్శనలు, కాగడాల ప్రదర్శనలు తదితరాలు నిర్వహించారు.

06/18/2016 - 07:27

హైదరాబాద్, జూన్ 17:రాష్ట్రానికి చెందిన అవిభక్త కవలలు వీణ- వాణి శస్తచ్రికిత్స అవకాశాలపై మెల్‌బోర్న్‌లోని ప్రపంచ ప్రఖ్యాత రాయల్ చిల్డ్రన్స్ హాస్పటల్ డాక్టర్లతో ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు నిరంజన్‌రెడ్డి చర్చించారు. మెల్‌బోర్న్ తెలంగాణ ఫోరం ఆధ్వర్యంలో డాక్టర్లతో ఈ సమావేశం ఏర్పాటు అయింది.

06/18/2016 - 07:27

హైదరాబాద్, జూన్ 17: దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలకు జరగనున్న ఎన్నికల్లో కూడా బిజెపి ఘన విజయం సాధిస్తుందని, భవిష్యత్ కూడా మనదేనని కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రి వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. రాజస్థాన్ నుండి రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైన తర్వాత తొలిసారి హైదరాబాద్ వచ్చినపుడు ఆయనకు శంషాబాద్ విమానాశ్రయంలో ఘనస్వాగతం లభించింది. విజయవాడ నుండి హైదరాబాద్ వచ్చిన వెంకయ్యకు పార్టీ శ్రేణులు ఘనస్వాగతం పలికారు.

06/18/2016 - 05:04

హైదరాబాద్, జూన్ 17: అగ్రిగోల్డ్ యాజమాన్యంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. హైకోర్టులో శుక్రవారం ఈ కేసు విచారణకు వచ్చింది. అగ్రిగోల్డ్ ఆస్తులను ఈ-వేలం ద్వారా విక్రయించేందుకు ఏర్పాటు చేసిన కమిటీ పేరున రూ. 25 లక్షలను డిపాజిట్ చేయాలని తాము ఇచ్చిన ఆదేశాన్ని ఉల్లంఘించినందున కోర్టు ధిక్కారం కింద ఎందుకు శిక్ష విధించరాదని హైకోర్టు ప్రశ్నించింది.

06/18/2016 - 04:50

హైదరాబాద్, జూన్ 17: అంతర్రాష్ట ప్రాజెక్టులపై మహారాష్ట్ర, తెలంగాణ పరస్పరం సహకరించుకుంటున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టుకు అవసరమైన అనుమతుల విషయంలో సహకరిస్తున్న మహారాష్ట్ర, తాజాగా లెండి ప్రాజెక్టులోనూ ఇలాంటి సహకారం అందించేందుకు సంసిద్ధత వ్యక్తం చేసింది. శుక్రవారం ఇరు రాష్ట్రాల ఇరిగేషన్ అధికారులు జలసౌధలో సమావేశమయ్యారు.

06/18/2016 - 04:33

హైదరాబాద్, జూన్ 17: ఆంధ్రప్రదేశ్‌లో ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. తొలి దశలో 10 వేల పోస్టులకు ఆర్ధిక శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వీటిలో ఎపిపిఎస్‌సి ద్వారా 4,009 పోస్టులు, పోలీసు రిక్రూట్‌మెంట్ బోర్డు ద్వారా 5,991 పోస్టులు భర్తీ చేస్తారు. ఈ మేరకు ఆర్ధిక శాఖ ప్రత్యేక కార్యదర్శి అజేయకల్లం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.

Pages