S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

06/17/2016 - 07:16

న్యూఢిల్లీ, జూన్ 16: కలియుగ దైవం శ్రీవేంకటేశ్వర స్వామి వెలసిన తిరుమల కొండల క్షేత్ర ప్రాంతాన్ని నో ఫ్లైజోన్ చేయలేమని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతి రాజు తెలిపారు. ఆయన గురువారం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుకు రాసిన లేఖలో ఈ విషయం తెలిపారు.

06/17/2016 - 07:12

కర్నూలు, జూన్ 16: కుక్కల బారి నుంచి ప్రజలకు విముక్తి కలిగించాలన్న రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ఆదేశాలు ఎట్టకేలకు అమలులోకి వచ్చాయి. తొలివిడతగా కర్నూలు నగరపాలకసంస్థ, నంద్యాల పురపాలక సంఘంలో సుమారు 14 వేల కుక్కలకు కుటుంబ నియంత్రణ శస్తచ్రికిత్సలు నిర్వహించాలని నిర్ణయించారు. గురువారం కర్నూలులో ఈ ప్రక్రియను ప్రారంభించారు.

06/17/2016 - 07:10

న్యూఢిల్లీ, జూన్ 16:బాల, యువ సాహిత్య పురస్కారాల విజేతలను కేంద్ర సాహిత్య అకాడమీ గురువారం ప్రకటించింది. 2016 సంవత్సరానికి తెలుగు సాహిత్యంలో చైతన్య పింగళి రచించిన ‘చిట్టగాంగ్ విప్లవ వనితలు’ చిన్న కథలకు యువ సాహిత్య పురస్కారం లభించిది. ఆలపాటి వెంకట సుబ్బారాపు రచించిన ‘స్వర్ణపుష్పాలు’ కవిత్వానికి బాల సాహిత్య పురస్కారం లభించింది.

06/17/2016 - 07:08

హైదరాబాద్, జూన్ 16: నిత్యజీవితంలో ప్రతి అంశానికీ అణుఇంధనంతో ముడిపడి ఉంటుందని న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్ చైర్మన్, సిఇఓ జి కళ్యాణకృష్ణన్ వ్యాఖ్యానించారు. ఎంపి చారి 9వ స్మారక ఉపన్యాస కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమాన్ని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కెమికల్ ఇంజనీర్స్ హైథరాబాద్ రీజనల్ సెంటర్ నిర్వహించింది.

06/17/2016 - 06:47

విశాఖపట్నం, జూన్ 16: నవ్యాంధ్రప్రదేశ్ ఏర్పడటం, కొత్త ప్రభుత్వ పాలన మూడో సంవత్సరంలోకి అడుగుపెట్టినా పాలనా నిర్వహణలో ఇంకా స్పష్టత లేనేలేదు. కీలకమైన గిరిజన సహకార సంస్థ (జిసిసి), ఆంధ్రప్రదేశ్ పర్యాటక సంస్థ (ఏపీటిడిసి), ఏపీఆర్‌ఎస్‌ఆర్టీసీలు రాజధాని అమరావతికి తరలి వస్తాయా? లేదంటే స్మార్‌సిటీగా అత్యంత శరవేగంగా అభివృద్ధి చెందుతున్న విశాఖలోనే ఏర్పాటవుతాయా? అన్న సందిగ్ధం నెలకొంది.

06/17/2016 - 04:53

హైదరాబాద్, జూన్ 16: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఈ నెల 18 నుంచి 20 వరకు భారీ నుండి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండి) హెచ్చరించింది.

06/17/2016 - 05:02

హైదరాబాద్, జూన్ 16: పూజల పేరిట లైఫ్‌స్టైల్ భవనం యజమానిని బురిడీ కొట్టించి, 1.30 కోట్ల నగదుతో ఉడాయించిన దొంగ బాబా ఇరవై నాలుగు గంటల్లోనే పట్టుబడ్డాడు. బెంగళూరు శివార్లలోని ఓ ఇంట్లో తలదాచుకున్న బాబా శివను హైదరాబాద్ టాస్క్ఫోర్స్ పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు.

06/17/2016 - 04:47

హైదరాబాద్, జూన్ 16: ‘నష్టాల్లో ఉన్న ఆర్టీసిని నడపడం కంటే మూసివేయడం మేలు’ అని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో అభిప్రాయం వ్యక్తం అయింది. నష్టాల్లో ఉన్న ఆర్టీసిని గట్టెక్కించేందుకు ప్రభుత్వం అనేక చర్యలు తీసుకోవడాన్ని అర్థం చేసుకోకుండా రాజకీయ కారణాలతో కార్మికులు సమ్మెలు చేయడం మంచిది కాదని ముఖ్యమంత్రి హెచ్చరించారు.

06/17/2016 - 04:43

హైదరాబాద్, జూన్ 16: కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ ప్రక్రియ ఎట్టకేలకు ప్రారంభమైంది. తొలి దశలో 5 వేలమంది ఉద్యోగుల సర్వీసులను క్రమబద్ధీకరించి రెండు మూడు రోజుల్లో నియామక పత్రాలను జారీ చేయాల్సిందిగా ప్రభు త్వం ఆదేశాలు జారీ చేసింది. కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణను మూడు దశల్లో పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

06/17/2016 - 04:41

హైదరాబాద్, జూన్ 16: తెలంగాణ రాష్ట్రంలో సాగు-తాగునీటి ప్రాజెక్టుల స్థితిగతులపై ప్రభుత్వం చెబుతున్నవి అబద్ధాలని భావిస్తున్న కాంగ్రెస్, వాటిని నిరూపించేందుకు పడుతున్న మీనమేషాలకు ఎట్టకేలకు తెరపడింది. అందులో భాగంగా మాక్ అసెంబ్లీ నిర్వహించి, అక్కడే ప్రాజెక్టులపై పవర్‌పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వాలని నిర్ణయించినట్లు సమాచారం. కాంగ్రెస్‌లో ఎట్టకేలకు కదలిక మొదలయింది.

Pages