S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

03/14/2016 - 06:26

మిషన్ భగీరథ పేరు వింటే కాంగ్రెస్ కంగారుపడుతోంది. పథకం అమలుకు హడ్కో ద్వారా రుణం పొందుతుంటే, కాంగ్రెస్ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి రుణం ఇవ్వొద్దని హడ్కోకు లేఖ రాశారు. ఇదేనా పద్ధతి? రాజకీయం కోసం రాష్ట్రానికి నష్టం కలిగిస్తారా?. ఎంపీ పంపిన లేఖను హడ్కో ఎండి నాకు పంపించారు. ఎవరడ్డొచ్చినా ఆగేది లేదు. పథకాలను ఆపేది లేదు. ఆరు నూరైనా మిషన్ భగీరథ అమలుచేసి చూపిస్తాం.

03/14/2016 - 06:15

విజయోత్సాహంతో స్వరాష్ట్రానికి బాబు బృందం * మూడు రోజుల పర్యటనలో ఎనలేని ఆదరణ

03/14/2016 - 06:14

బాబు వచ్చినా జాబుల్లేవు * లక్షకుపైగా ఖాళీలున్నా భర్తీ కావు

03/14/2016 - 06:13

విజయవాడ, మార్చి 13: రాష్ట్రంలో తిరుమల తిరుపతి దేవస్థానం తరువాత అతిపెద్ద విజయవాడ దుర్గగుడిలో పరిపాలనా సంస్కరణలకు ఆలయ కార్యనిర్వహణాధికారి చంద్రశేఖర ఆజాద్ శ్రీకారం చుట్టారు. వివాదాల్లో చిక్కుకున్న ఇవో నరసింగరావు సెలవుపై వెళ్లడంతో చంద్రశేఖర ఆజాద్ ఇవోగా బాధ్యతలు స్వీకరించిన విషయం తెలిసిందే.

03/14/2016 - 06:12

తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన
విశాఖపట్నం, మార్చి 13: దక్షిణ తమిళనాడు నుంచి రాయలసీమ వరకు అల్పపీడన ద్రోణి కొనసాగుతోందని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు ఆదివారం తెలిపారు. దీని ప్రభావంతో రాగల 48 గంటల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో తేలికపాటి జల్లులు కురిసే అవకాశం ఉందన్నారు. అల్పపీడన ద్రోణి మరింత బలపడే అవకాశం ఉందని, 48 గంటల తర్వాత వర్షాలు పెరిగే అవకాశం ఉందన్నారు.

03/13/2016 - 14:18

తూ.గో. జిల్లాకు వెళ్లనున్న చంద్రబాబు
హైదరాబాద్‌: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదివారం సాయంత్రం తూర్పుగోదావరి జిల్లా శంకవరం వెళ్లనున్నారు. ఆదివారం ఉదయం గుండెపోటుతో మరణించిన తెలుగుదేశం పార్టీ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు పర్వత చిట్టిబాబుకు నివాళులు అర్పించడానికి చంద్రబాబు దిల్లీ నుంచి రాజమహేంద్రవరం బయలుదేరారు.

03/13/2016 - 12:48

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఆర్ధిక మంత్రి ఈటల రాజేందర్ వచ్చే ఆర్ధిక సంవత్సరానికి రాష్ట్ర బడ్జెట్ సోమవారం అసెంబ్లీలో సమర్పిస్తారు. రాష్ట్ర రాబడులకు అనుగుణంగానే 2016-17 బడ్జెట్‌ ఉండబోతోందని రాజేందర్‌ వెల్లడించారు .

03/13/2016 - 12:37

హైదరాబాద్ : ఆదివారం కూడా సమావేశమైన తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో మెట్రో రైల్వే లైన్ అలైన్మెంట్ పై జరిగిన చర్చలో పలువురు సభ్యులు పాల్గొన్నారు. మెట్రో అలైన్మెంట్ ఇష్టం వచ్చినట్లు మారుస్తున్నారని, ఇదొక కుంభకోణంలా వుందని ఆరోపించిన ఎం ఐ ఎం సభ్యుడు అక్బరుద్దీన్ ఈ వ్యవహారంపై విచారణ జరిపించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

03/13/2016 - 12:29

హైదరాబాద్ : కరీంనగర్ కు చెందిన గాయని మధుప్రియ భర్త శ్రీకాంత్‌పై శనివారం అర్ధరాత్రి దాడి జరిగింది. తన భార్య మధుప్రియను తీసుకొచ్చేందుకు అత్తగారింటికి వెళ్లినప్పుడు శ్రీకాంత్‌పై దాడి జరిగినట్లు తెలుస్తోంది. దీంతో ఆయనకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం శ్రీకాంత్ యశోదా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

03/13/2016 - 07:43

నల్లగొండ, మార్చి 12: నల్లగొండ జిల్లా యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మూడవ రోజు శనివారం స్వామివారు మత్స్వావతారం అలంకారంతో తీరువీధుల్లో ఊరేగి భక్తులకు దర్శనమిచ్చారు. అలంకార ప్రియుడైన శ్రీవారు బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తులకు ఏడు రోజుల పాటు వివిధ అవతారాల అలంకారాలతో దివ్యవాహన రూఢుడై దర్శమిస్తారు.

Pages