S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

02/19/2016 - 08:08

విజయవాడ, ఫిబ్రవరి 18: స్వర్ణ్భారతి ట్రస్ట్ వంటి స్వచ్ఛంద సేవా సంస్థలు మరిన్ని ఉద్భవిస్తే భారతదేశం స్వర్ణ్భారత్ కాగలదని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అన్నారు. గుప్తుల కాలంలో భారతదేశంలో స్వర్ణయుగం నడిచిందని, మళ్లీ అలాంటి దేశాన్ని నిర్మించాలనే లక్ష్యంతోనే స్వర్ణ్భారతి ట్రస్ట్‌ను ప్రారంభించినట్టు కేంద్రమంత్రి ఎం.వెంకయ్యనాయుడు చెప్పారు.

02/19/2016 - 08:07

హైదరాబాద్: అక్రమాస్తుల కేసులో మార్చి 28వ తేదీన కోర్టుకు హాజరు కావాలని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ప్రత్యేక కోర్టు గురువారం సమన్లు జారీ చేసింది. ఈ అక్రమాస్తుల కేసులో ఉన్న మరో పది మందికి కూడా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సమన్లు జారీ చేసింది. విజయసాయిరెడ్డి, అరబిందో, హెటిరో ఫార్మా యాజమాన్యం ప్రతినిధులు, ఏపిఐఐసి మాజీ జిఎం, హెటిరో హెల్త్ సంస్ధలతో కలిపి పది మందికి సమన్లు జారీ చేశారు.

02/19/2016 - 07:57

రాజమహేంద్రవరం: ఇసుక మాఫియాకు అడ్డంగా దొరికిపోయే కొత్త ఇసుక విధానాన్ని ప్రకటించి ఇప్పటికే ఇ వేలం విధానంలో బోర్లాపడిన రాష్ట్రప్రభుత్వం ఇంకా అదే విధానాన్ని కొనసాగిస్తూ ఇంకా తప్పులు చేస్తూనే ఉంది. రాష్ట్రప్రభుత్వం రూపొందించిన కొత్త ఇసుక విధానంలోనే లొసుగులు ఉన్నాయని, విధానంలో వౌలిక మార్పులుచేస్తే తప్ప ఫలితం ఉండదని ‘ఆంధ్రభూమి’ మొదటి నుండి చెబుతూనే ఉంది.

02/18/2016 - 05:47

ఎవరు గెలుస్తారో ప్రజలే తేలుస్తారు ఫిరాయింపుల్ని ప్రోత్సహించడమెందుకు?
తెదేపా ఎమ్మెల్యేలు మాకూ టచ్‌లో ఉన్నారు స్పీకర్‌పై అవిశ్వాస తీర్మానం పెట్టి తీరుతాం
కెసిఆర్‌తో కుమ్మక్కై రాష్ట్రాన్ని దెబ్బతీస్తున్నారు పాలమూరు ఎత్తిపోతలతో రాయలసీమ ఎడారే
చంద్రబాబుపై నిప్పులు కురిపించిన జగన్ గవర్నర్‌ను కలిసి వినతిపత్రం సమర్పణ

02/18/2016 - 03:59

హైదరాబాద్: రాష్ట్ర రాజధాని తరలింపుపై గత ఏడాది నుంచి చర్చ జరుగుతున్నా, ఉద్యోగుల సమస్యలు నేటికీ పరిష్కారం కాకపోవడం అడ్డంకిగా మారింది. సిఎం చంద్రబాబు బుధవారం అమరావతిలో తాత్కాలిక సచివాలయ భవనాల సముదాయానికి శంకుస్థాపన చేయడంతో హైదరాబాద్‌లోని సచివాలయంతోపాటు హెడ్ ఆఫ్ ది డిపార్ట్‌మెంట్స్‌లో పనిచేస్తున్న ఉద్యోగుల్లో గుబులు మొదలైంది.

02/18/2016 - 03:56

హైదరాబాద్: వచ్చే విద్యా సంవత్సరం నుండి పాఠశాల విద్యలో సమూల సంస్కరణలు ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం సంకల్పించింది. సాంకేతికత జోడించి ఆధునిక బోధనా పద్ధతులతో నూతన విద్యా విధానం తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్టు సిఎం చంద్రబాబు తనను కలిసిన డెల్ ప్రతినిధులకు వివరించారు. రాష్ట్రంలోని పాఠశాలల్లో ప్రమాణాలు పెంచే అంశంపై డెల్ ప్రతినిధులు సిఎంకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు.

02/17/2016 - 08:44

గుంటూరు: ఏది సకల జనావళికి ఎల్లప్పుడూ శుభాన్ని, జయాన్ని కలిగిస్తుందో అలాంటి మహాశక్తివంతం, పవిత్రమైన శ్రీ విష్ణు సహస్ర నామ విరాట్ పారాయణ కార్యక్రమాన్ని ఓ మహత్తర యజ్ఞంగా నిర్వహించటానికి ఉద్దండరాయునిపాలెం వేదిక కానుంది. చిన జీయర్ స్వామి మానస పుత్రికైన వికాస తరంగణి కృష్ణా, గుంటూరు శాఖలు, గుంటూరుకు చెందిన భారతీ ధార్మిక విజ్ఞాన్ పరిషత్ సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.

02/17/2016 - 08:41

విజయవాడ: తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత గడచిన రెండేళ్ల కాలంలో ఇసుక తవ్వకాలు, అమ్మకాలపై ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తూనే ఎప్పటికప్పుడు కొత్త విధానాలను అమల్లోకి తీసుకువస్తోంది.

02/17/2016 - 08:35

ఏలూరు : అగ్రిగోల్డ్ ఛైర్మన్ అవ్వా వెంకట రామారావు, మేనేజింగ్ డైరెక్టర్ అవ్వా వెంకట శేషు నారాయణరావును ఏడు రోజులు సిఐడి కస్టడీకి న్యాయస్థానం అనుమతించింది. పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రం ఏలూరులో ఇన్‌ఛార్జి జిల్లా న్యాయమూర్తి హరిహరనాధ శర్మ మంగళవారం ఈ నిర్ణయాన్ని వెలవరించారు. డిపాజిటర్లను మోసం చేసిన కేసులో సిఐడి పోలీసులు అగ్రిగోల్డ్ ఛైర్మన్, ఎండిలను అరెస్టు చేయడం తెలిసిందే.

02/17/2016 - 08:35

విజయవాడ: కస్టమ్స్ సుంకం చెల్లించని విదేశీ బంగారాన్ని సినీ ఫక్కీలో అక్రమంగా తరలిస్తున్న తమిళనాడుకు చెందిన ఒక స్మగ్లర్‌ను విజయవాడ కస్టమ్స్ అధికారులు అరెస్ట్ చేసి కోటీ 45 లక్షల విలువైన 5 కేజీల 330 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. మంగళవారం ఆటోనగర్‌లోని కస్టమ్స్ ప్రధాన కార్యాలయంలో ఎపి కస్టమ్స్ కమిషనర్ ఎస్.ఖాదర్ రెహమాన్ బంగారం స్మగ్లింగ్‌కు సంబంధించిన విషయాలను వెల్లడించారు.

Pages