S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

01/21/2016 - 15:58

హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) ఎన్నికల్లో నామినేషన్ల ఉపసంహరణ గడువు నేటితో ముగిసింది. ఉపసంహరణ తర్వాత ఇండిపెండెంట్‌లతోపాటు వివిధ పార్టీలకు చెందిన 1,939 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. మొత్తం 604 నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. ఇవాళ సాయంత్రంకల్లా అభ్యర్థుల తుది జాబితా వెలువడనుంది.

01/21/2016 - 15:53

హైదరాబాద్: హెచ్‌సీయూలో నలుగురు పీహెచ్‌డీ విద్యార్థులపై విధించిన సస్పెన్షన్‌ను ఎత్తివేశారు. దళిత విద్యార్థి వేముల రోహిత్ ఆత్మహత్యపై ఆందోళనలు కొనసాగుతున్న నేపథ్యంలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సమావేశమై ఈ నిర్ణయం తీసుకుంది.ప్రశాంత్, శేషయ్య, విజయ్‌, సుంకన్న విద్యార్థులపై విధించిన సస్పెన్షన్‌ ఎత్తివేస్తున్నట్టు ఒక ప్రకటనలో తెలిపింది.

01/21/2016 - 14:02

హైదరాబాద్: హెచ్‌సీయూ విద్యార్థులను ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ పరామర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతు రోహిత్ కుటుంబానికి న్యాయం జరిగేలా చూస్తామని ఆయన హామి ఇచ్చారు. దేశం మొత్తం మీ వెంటే ఉందని రోహిత్ కుటుంబానికి దైర్యం చెప్పారు.

01/21/2016 - 13:24

సికింద్రాబాద్: దొంగచాటుగా రేషన్‌ సరుకులను దారి మళ్లిస్తున్న 26 మంది ముఠా ను టాస్క్ ఫోర్స్ అదుపులోకి తీసుకుంది. అదుపులోకి తీసుకున్నవారిలో డీలర్లు, బ్రోకర్లు, మిల్లర్లు ఉన్నారు. 362 క్వింటాళ్ల రేషన్‌ బియ్యం, 500 క్వింటాళ్ల గోదుమలు, 630 లీటర్ల కిరోసిన్‌, రెండు ట్రక్కులను స్వాధీనం చేసుకున్నారు.

01/21/2016 - 13:06

విశాఖపట్నం : ఆంధ్రప్రదేశ్లో ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి పడిపోతున్నాయి. విశాఖ ఏజెన్సీలోని పాడేరులో 12 డిగ్రీలు.... అలాగే మినుములూరులో 10 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదు అయింది. విశాఖ ఏజెన్సీ అంతటా పెద్ద ఎత్తున చలిగాలులు వీస్తున్నాయి. దీంతో గిరిజనులు ఇళ్ల నుంచి బయటకు వచ్చేందుకు భయపడుతున్నారు.

01/21/2016 - 06:07

ఉపగ్రహ ఉపయోగాలు
నావిగేషన్ సర్వీస్ సిగ్నల్స్‌ను వేగంగా అందిస్తుంది.
రేంజింగ్ పేలోడ్స్‌లో సీ బ్యాండ్ ట్రాన్సుపాండర్స్, రెట్రోరిఫ్లెక్షన్ లేజర్ రేజింగ్ అనే పరికరాలు పనిచేస్తాయి.
ఈ సాంకేతిక పరికరాలన్ని భారత్‌కు దిక్సూచి వ్యవస్థలను అందిస్తాయి.

01/21/2016 - 07:35

హైదరాబాద్, జనవరి 20: హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో ఆత్మహత్యకు పాల్పడిన వేముల రోహిత్ కుల వివాదంపై వాస్తవాల పరిశీలనకు కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. ఈమేరకు కేంద్ర మానవ వనరుల మంత్రిత్వశాఖ నేరుగా తెలంగాణ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. కేంద్రం ఆదేశాల మేరకు సైబరాబాద్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. రోహిత్ ఎస్సీ కులానికి చెందిన వారేనా? కాదా?

01/21/2016 - 05:32

హైదరాబాద్, జనవరి 20: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని అత్యంత అధునాతన ప్రపంచ శ్రేణి రాజధానిగా నిర్మిస్తున్నామని, పెట్టుబడులతో వచ్చి కార్యాలయాలను ప్రారంభించాలని ప్రపంచ పారిశ్రామిక దిగ్గజాలకు ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు విజ్ఞప్తి చేశారు.

01/21/2016 - 05:27

హైదరాబాద్, జనవరి 20: ఆంధ్రప్రదేశ్ సిఎం చంద్రబాబు దావోస్ పర్యటన సత్ఫలితాలిస్తోంది. అనేక మంది పారిశ్రామిక వేత్తలు ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులకు ఉత్సాహాన్ని చూపించడం రాష్ట్ర బృందానికి మంచి ఊపునిస్తోంది. సిఎం చంద్రబాబు రాష్ట్రం కోసం వినత్న రీతిలో ప్రచారం చేయడం కూడా సత్ఫలితాలిస్తోంది.

01/20/2016 - 21:24

గుంటూరు, జనవరి 19: పోలవరం ప్రాజెక్టుకు ఇప్పటికే బడ్జెట్‌కు మించి 2 వేల కోట్ల రూపాయలు వెచ్చించి పనులు ప్రారంభించామని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. గుంటూరు జిల్లా చిలకలూరిపేటలోని దివంగత మల్లెల సత్యనారాయణ ప్రాంగణంలో జరుగుతున్న జాతీయస్థాయి ఎడ్ల బల ప్రదర్శన రెండవ రోజు కార్యక్రమానికి మంగళవారం ముఖ్య అతిథిగా హాజరైన సందర్భంగా ఆయన విలేఖర్లతో మాట్లాడారు.

Pages