S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

01/22/2016 - 02:20

బుక్కరాయసముద్రం, జనవరి 21: అనంతపురం వ్యవసాయ ఆరుబయలు కారాగారంలో జీవిత ఖైదు అనుభవిస్తున్న సుమారు 146 మంది గణతంత్ర దినోత్సవం సందర్భంగా స్వేచ్ఛావాయువులు పీల్చుకోనున్నారు. ఖైదీల విడుదలపై ఇటీవల ప్రభుత్వం సానుకూలంగా స్పందించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే రాష్ట్రంలోని ఆయా జైళ్ల అధికారులు జీవిత ఖైదీల వివరాలను ప్రభుత్వానికి అందజేశారు.

01/22/2016 - 02:19

ఆదోని, జనవరి 21:కర్నూలు జిల్లా కౌతాళం మండలం ఎరిగేరి జెడ్‌పి పాఠశాలలో గురువారం 6వ తరగతి విద్యార్థులు చేసిన సైన్స్ ప్రయోగం వికటించడంతో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. ఉపాధ్యాయుల సూచన మేరకు 6వ తరగతి విద్యార్థులు శాంతమూర్తి, సురేష్, శ్రీరాములు బ్యాటరీ సెల్‌లలోప్రయోగం చేసిన అనంతరం జేబులో పెట్టుకున్నారు.

01/22/2016 - 02:19

విశాఖపట్నం, జనవరి 21: రాష్ట్రంలో సర్వశిక్ష అభియాన్ ద్వారా నాణ్యమైన విద్యను అందించేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నట్టు జాతీయ మానవ వనరుల అభివృద్ధి కేంద్రం (హెచ్‌ఆర్‌డి) కార్యదర్శి మంజిత్‌కుమార్ చెప్పారు. గురువారం విశాఖలో జరిగిన సర్వశిక్ష అభియాన్ రాష్ట్ర ఆర్థిక కంట్రోలర్ల జాతీయ సమావేశంలో ఆయన మాట్లాడుతూ పాఠశాలల్లో వౌలిక వసతులు కల్పించేందుకు ఈ ఏడాది రూ.900 కోట్లు మంజూరు చేశామన్నారు.

01/22/2016 - 02:18

గుంటూరు, జనవరి 21: సొంత ఆసుపత్రులకు ప్రాధాన్యమిస్తూ విధినిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తున్న 600 మంది ప్రభుత్వ వైద్యులకు మెమోలు జారీ చేసినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ తెలిపారు. గురువారం గుంటూరులోని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ హాలులో జరిగిన మీట్‌ది ప్రెస్ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి కామినేని వైద్య ఆరోగ్య శాఖ చేపడుతున్న కార్యక్రమాలపై వివరాలు తెలియజేశారు.

01/22/2016 - 02:10

హైదరాబాద్, జనవరి 21: సెంట్రల్ యూనివర్శిటీలో దళిత విద్యార్థి వేముల రోహిత్ మృతికి కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని కోరుతూ గురువారం నగరంలోని బాగ్‌లింగంపల్లిలో గల సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశం డిమాండ్ చేసింది.

01/22/2016 - 02:09

హైదరాబాద్, జనవరి 21: టిక్కెట్ ఇవ్వనందుకు నిరసనగా కాంగ్రెస్ పార్టీ కార్యాలయమైన గాంధీ భవన్‌లో ఒక కార్యకర్త పెట్రోలు పోసుకుని ఆత్మహత్యకు యత్నించాడు. గురువారం గాంధీ భవన్ టిక్కెట్లు రాని ఆశావహుల ధర్నాలతో దద్ధరిల్లింది. సైదాబాద్ సమీపంలోని కుర్మగుడా డివిజన్‌కు చెందిన సీనియర్ కార్యకర్త కిషోర్ తన కుమార్తె టిక్కెట్ కోసం ప్రయత్నించారు. నామినేషన్ల గడువు ముగిసేలోగా బి-్ఫరం ఇవ్వకపోవడంతో తీవ్ర ఆవేదన చెందారు.

01/22/2016 - 02:09

హైదరాబాద్, జనవరి 21: సెంట్రల్ యూనివర్సిటీ ఎబివిపికి అడ్డాగా మారిందని ఎఐసిసి నాయకుడు, రాజ్యసభ సభ్యుడు వి.హనుమంత రావు విమర్శించారు. దేశంలోని అన్ని వర్సిటీల్లో ఎబివిపిని కేంద్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నదని ఆయన ఆరోపించారు. సెంట్రల్ వర్సిటీలో దళిత విద్యార్థులు చేస్తున్న దీక్షా శిబిరానికి ఎబివిపి తప్ప అన్ని విద్యార్థి సంఘాలు వెళ్లి మద్దతు ప్రకటించాయని ఆయన గురువారం విలేఖరుల సమావేశంలో చెప్పారు.

01/22/2016 - 02:08

విశాఖపట్నం, జనవరి 21: తీర ప్రాంత భద్రతను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విశాఖలో సమీక్షించనున్నారు. వచ్చే నెల నాలుగో తేదీ నుంచి ఏడవ తేదీ వరకూ విశాఖలో ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ (ఐఎఫ్‌ఆర్) జరగనున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఐదవ తేదీ సాయంత్రానికి రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధానమంత్రి మోదీ విశాఖకు చేరుకోనున్నారు.

01/22/2016 - 02:07

హైదరాబాద్, జనవరి 21: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ (హెచ్‌యుసి)లో విద్యార్థి రోహిత్ ఆత్మహత్య ఘటనపై సిట్టింగ్ జడ్జితో న్యాయవిచారణ జరిపించాలని ఎబివిపి హెచ్‌సియు విభాగం డిమాండ్ చేసింది. అతని ఆత్మహత్యపై చాలా అనుమానాలున్నాయన్నారు. యూనివర్శిటీలోని టీచర్స్ అసోసియేషన్‌కు చెందిన ప్రొఫెసర్ల కాల్‌డేటాపైనా సిబిఐతో విచారణ జరిపించాలని కూడా డిమాండ్ చేశారు.

01/22/2016 - 02:06

హైదరాబాద్, జనవరి 21: హైదరాబాద్ సెంట్రల్ వర్శిటీ విద్యార్థి రోహిత్ ఆత్మహత్య నేపథ్యంలో వర్శిటీలో ప్రాంగణంలో నిరాహార దీక్ష చేస్తున్న విద్యార్థులను న్యూఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ గురువారం పరామర్శించారు. రోహిత్ ఆత్మహత్య సంఘటనపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కేజ్రీవాల్ మాట్లాడుతూ రోహిత్ మెరిట్ ఆధారంగానే యూనివర్శిటీలో సీటు సంపాదించాడని, రిజర్వేషన్లతో కాదని గుర్తు చేశారు.

Pages