S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

06/27/2018 - 03:50

తిరుపతి, జూన్ 26: తిరుపతిలోని గోవిందరాజస్వామి ఆలయ గర్భగుడిపై విమాన గోపురానికి రాగిరేకులపై బంగారు తాపడం చేసేందుకు 32.26 కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేసినట్లు టీటీడీ చైర్మన్ పుట్టా సుధాకర్‌యాదవ్ తెలిపారు. మంగళవారం స్థానిక అన్నమయ్య భవన్‌లో జరిగిన పాలకమండలి సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను ఆయన విలేఖరులకు తెలియజేశారు.

06/27/2018 - 03:47

కడప, జూన్ 26: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అన్నీ ఇస్తామని, విభజన బిల్లులోని 18 అంశాలను నెరవేరుస్తామని ప్రధాని మోదీ చెప్పారని, కానీ ఇంతవరకు ఏమీ ఇవ్వలేదని డీఎంకే రాజ్యసభ సభ్యురాలు కనిమొళి అన్నారు. ఆయన అంతేనని, ఏదీ ఇవ్వరని, మోదీ చెప్పేవన్నీ అబద్దాలేనని విమర్శించారు. కడప ఉక్కు కోసం ఏడు రోజులుగా దీక్ష చేస్తున్న సీఎం రమేష్‌నాయుడు, బీటెక్ రవిని ఆమె మంగళవారం పరామర్శించి దీక్షకు సంఘీభావం ప్రకటించారు.

06/27/2018 - 03:45

తిరుపతి, జూన్ 26: తిరుమల శ్రీవారి ఆలయంలో మూడు రోజులపాటు జరిగిన జ్యేష్ఠ్భాషేకం మహోత్సవాలు మంగళవారం ఘనంగా ముగిశాయి. చివరి రోజు ఉభయ దేవేరులతో కలిసి శ్రీ మలయప్ప స్వామివారు బంగారు కవచంలో పునర్‌దర్శనమిచ్చారు. మళ్లీ జ్యేష్ఠ్భాషేకం వరకు సంవత్సరం పొడవునా స్వామి, అమ్మవారు ఈ బంగారు కవచంతో ఉంటారు.

06/27/2018 - 00:42

హైదరాబాద్, జూన్ 26: నానాటికి ఇంధన వనరులు తరిగిపోతున్న నేపథ్యంలో, ప్రత్యామ్నాయంగా విద్యుత్‌తో నడిచే వాహనాలను తీసుకు రావడానికి రాష్ట్ర ప్రభుత్వం యత్నాలు ప్రారంభించింది. ఇది సాకారమైతే హైదరాబాద్‌లో విద్యుత్ వాహనాలు నడిచే కాలం ఎంతో దూరంలో లేదని చెప్పవచ్చు. మరి విద్యుత్ వాహనాలకు రీచార్జ్ సదుపాయం కీలకమైన అంశం.

06/27/2018 - 00:40

హైదరాబాద్, జూన్ 26: ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు తనకు తానే చాలా తెలివైనవాడినని అనుకుంటున్నారని ఎఐసిసి నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి ఎస్. జైపాల్ రెడ్డి చురక వేశారు. అందరినీ మోసం చేయగలనని కేసీఆర్ అనుకుంటున్నారని, అయితే అది ఎల్లప్పుడూ సాధ్యం కాదని గుర్తుంచుకోవాలని మంగళవారం ఇక్కడ జరిగిన మీడియా సమావేశంలో జైపాల్ అన్నారు.ఎన్నికలు పూర్తయిన తర్వాత కేసీఆర్ పని పడతాం అని అన్నారు.

06/27/2018 - 00:37

హైదరాబాద్, జూన్ 26: రేషన్ షాపుల బంద్‌కు సమ్మె నోటీసు ఇచ్చిన డీలర్లకు ప్రభుత్వం తాజాగా గురువారం వరకు గడువు విధించింది. గురువారం సాయం త్రం వరకు సరుకులు తీసుకోవడానికి డిడీలు చెల్లించని డీలర్‌షిప్‌లను రద్దు చేయనున్నట్టు పౌర సరఫరాలశాఖ ఓ ప్రకటన విడుదల చేసింది.

06/27/2018 - 00:35

హైదరాబాద్, జూన్ 26: బీసీల రిజర్వేషన్లను శాస్తబ్రద్ధంగా చేయకుండా పంచాయతీ ఎన్నికలు నిర్వహించరాదని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించడంపై ప్రతిపక్షాలు హర్షం వ్యక్తం చేశాయి. అయితే సార్వత్రిక ఎన్నికలకు ముందు పంచాయతీ రాజ్ ఎన్నికలు నిర్వహించి ఉంటే రాష్ట్ర ప్రభుత్వానికీ, అన్ని పార్టీలకూ సెమీ ఫైనల్‌లా ఉండేదన్న అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది.
తీర్పును స్వాగతిస్తున్నాం

06/27/2018 - 00:34

హైదరాబాద్, జూన్ 26: రాష్ట్రంలో మద్యం వల్ల సర్కారుకు ఏటా ‘కాసుల పంట’ (ఖజానాకు ఆదాయం) పెరుగుతుండగా, ఆనారోగ్యానికి గురై ప్రాణాలు కోల్పోయే వారి సంఖ్య పెరుగుతోంది. మద్యం (ఆల్కహాల్) తాగడం వల్ల వచ్చే రోగాల కారణంగా ఏటా 10 వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోతున్నారు. అనేక వేల మంది జీర్ణవ్యవస్థ, కాలేయానికి సంబంధించిన వ్యాధులకు గురవుతున్నారు.

06/27/2018 - 00:21

విశాఖపట్నం, జూన్ 26: తూర్పు నౌకాదళం, రాష్ట్ర ప్రభుత్వం తప్పిదాలు పౌర విమాన సేవలకు శాపంగా పరిణమిస్తున్నాయి. విశాఖ విమానాశ్రయానికి వచ్చే పౌర విమానాలపై నవంబర్ ఒకటో తేదీ నుంచి ఆంక్షలు విధించాలన్న నిర్ణయంపై తూర్పు నౌకాదళం సుదీర్ఘ వివరణ ఇచ్చింది. దేశ భద్రత దృష్ట్యా విశాఖ విమానాశ్రయాన్ని ఆనుకుని ఉన్న ఐఎన్‌ఎస్ డేగా ఎయిర్ స్టేషన్‌లో నవంబర్ ఒకటి నుంచి సైనిక శిక్షణను ముమ్మరం చేయనుంది.

06/27/2018 - 00:16

అమలాపురం, జూన్ 26: ఎన్నికల ముందు అమలుకాని హామీలెన్నో ఇచ్చి, అవి పూర్తికాకుండానే ఎన్నికల ముందు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజలకు మరోసారి రియల్ ఎస్టేట్ వ్యాపారి తరహాలో మోసపూరిత సినిమా చూపిస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఎద్దేవాచేశారు.

Pages