S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

06/06/2018 - 03:56

నల్లగొండ, జూన్ 5: రేపటిలోగా తమ శాసనసభ్యత్వాలను పునరుద్ధరించని పక్షంలో రాష్ట్ర శాసనసభ స్పీకర్, అసెంబ్లీ కార్యదర్శి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులపై హైకోర్టులో కోర్టు ధిక్కారణ కేసులు దాఖలు చేస్తామని సీఎల్పీ ఉపనేత, నల్లగొండ శాసన సభ్యుడు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి వెల్లడించారు.

06/06/2018 - 03:53

హైదరాబాద్, జూన్ 5: ప్రపంచ పర్యావరణ దినోత్సవ వేడుకలు మంగళవారం రాష్టవ్య్రాప్తంగా ఘనంగా జరిగాయి. రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి, అటవీ శాఖలు వివిధ స్వచ్చంద సంస్థలతో కలిసి రాష్ట్ర రాజధానితో పాటు 31జిల్లాల్లో అవగాహన కార్యక్రమాలను నిర్వహించారు. నానాటికి పెరుగుతున్న కాలుష్యం భూమండలాన్ని విషపు వలయంగా మారుస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు.

06/06/2018 - 04:35

హైదరాబాద్, జూన్ 5: తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల్లో పత్తిరైతులు ప్రైవేట్ విత్తనోత్పత్తి సంస్థల చేతుల్లో నలిగిపోతున్నారు. పత్తిపంటపై బహుళజాతి విత్తనోత్పత్తి సంస్థ అయిన ‘మోన్‌శాంటో’ (అమెరికా సంస్థ) ఏకచ్ఛత్రాధిపత్యం చలాయిస్తోంది. మోన్‌శాంటో ముందు భారతీయ వ్యవసాయ శాస్తవ్రేత్తలు మోకరిల్లుతున్నారు.

06/06/2018 - 02:21

హైదరాబాద్, జూన్ 5: తెలంగాణకు రెండురోజుల్లో నైరుతీ రుతుపవనాలు వచ్చే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) ప్రకటించింది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం, చిత్తూరు తదితర జిల్లాలకు రుతుపవనాలు విస్తరించాయి. రుతుపవనాలు ముందుకు సాగేందుకు వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని వెల్లడించారు. ఇలా ఉండగా ఉత్తర బంగాళాఖాతంలో ఈ నెల 8 న అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని ఐఎండీ ప్రకటించింది.

06/06/2018 - 04:37

హైదరాబాద్, జూన్ 5: అవుటర్ రింగ్ రోడ్‌పై ఎల్‌ఈడి లైట్లు, ప్రతీ పది కిలో మీటర్లకో అంబులెన్స్, ట్రౌమ కేర్ సెంటర్లు ఏర్పాటు చేయాలని మున్సిపల్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు ఆదేశించారు. అవుటర్ రింగ్ రోడ్ నగరానికి మణిహారం లాంటిదని, దాని చుట్టూ సాధ్యమైనంత మేరకు ఎక్కువ సౌకర్యాలను కల్పించాల్సిన అవసరం ఉందని మంత్రి అన్నారు.

06/06/2018 - 04:40

న్యూఢిల్లీ, జూన్ 5: సునంద పుష్కర్ మరణానికి సంబంధించిన కేసులో, కాంగ్రెస్ నేత శశి థరూర్‌కు ఢిల్లీ కోర్టు సమన్లు జారీచేసింది. జూలై 7న కోర్టులో హాజరు కావాలని ఆదేశించింది.

06/06/2018 - 04:45

రాజమహేంద్రవరం, జూన్ 5: విభజన కష్టాలు, కేంద్రం నమ్మకద్రోహం నేపథ్యంలో వచ్చే ఎన్నికలు రాష్ట్రానికి చారిత్రక అవసరమని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పేర్కొన్నారు. ఇప్పుడిప్పుడే రాష్ట్ర పరిస్థితులు గాడిన పడుతున్నాయని, మరో నాలుగైదేళ్లు కష్టపడితేనే ఇతర రాష్ట్రాల స్థాయికి ఎదగగలమన్నారు. లేనిపక్షంలో పరిస్థితి కుక్కలు చింపిన విస్తరి మాదిరిగా మారుతుందన్నారు.

06/06/2018 - 01:59

ఏలూరు, జూన్ 5: వేలకోట్ల రూపాయల విలువైన అగ్రిగోల్డ్ సంస్థ ఆస్తులను చౌకలో కొట్టేయడానికి చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ఆరోపించారు. తాము అధికారంలోకి వస్తే ఈ సంస్థ బాధితులను ఆదుకుంటామని ప్రకటించారు. అధికారంలోకి రాగానే రూ.1100 కోట్లు విడుదలచేసి, అగ్రిగోల్డ్ ఆస్తులను స్వాధీనం చేసుకుంటామని ప్రకటించారు. ఈ మొత్తంతో 80శాతం మంది డిపాజిట్‌దారులకు న్యాయం జరుగుతుందన్నారు.

06/06/2018 - 04:47

హైదరాబాద్, జూన్ 5: నీట్ ప్రవేశ పరీక్షలో అర్హత సాధించలేదన్న వేదనతో ఓ విద్యార్థిని మంగళవారం ఆత్మహత్యకు పాల్పడింది. హైదరాబాద్ బర్కత్‌పుర ప్రాంతానికి చెందిన జస్లిన్ కౌర్ (18) వైద్య విద్య అభ్యసించాలన్న ఆశతో నీట్ పరీక్షలు రాసింది. అయతే, ఫలితాల్లో ఆమె అర్హత సాధించలేకపోవడంతో మనస్థాపానికి గురైంది.

06/06/2018 - 04:49

* ఆగమ సలహాదారులు అనుమతిస్తే శ్రీవారి ఆభరణాల ప్రదర్శన ఈవో అనిల్‌కుమార్ సింఘాల్

Pages