S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

04/22/2018 - 02:07

విజయవాడ, ఏప్రిల్ 21: ఎన్డీఏతో తెగదెంపులనంతరం సీఎం నారా చంద్రబాబునాయుడు, బీజేపీ నేతల మధ్య జరుగుతున్న కోల్డ్‌వార్ తాజాగా ముఖ్యమంత్రి వియ్యంకుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ వైపు మళ్లింది. ప్రత్యేక హోదాకై విజయవాడలో బాబు చేపట్టిన 12 గంటల ధర్మపోరాట దీక్షలో పాల్గొన్న బాలకృష్ణ ప్రధాని నరేంద్రమోదీని రాయటానికి వీలులేని పరుష పదజాలంతో దూషించడం పై కమలనాథులు కనె్నర్ర చేస్తున్నారు.

04/22/2018 - 01:28

కాకినాడ, ఏప్రిల్ 21: ఏపీ ఎమ్‌సెట్ నిర్వహణకు సర్వం సిద్ధమైంది. ఆదివారం నుంచి కాకినాడ జేఎన్‌టియూ పర్యవేక్షణలో తెలంగాణలోని హైదరాబాద్‌లో 3 రీజనల్ సెంటర్లు, ఆంధ్రప్రదేశ్‌లో 44మొత్తం 47 రీజనల్ సెంటర్ల పరిధిలోని ఆయా పరీక్షా కేంద్రాల్లో 25వ తేదీ వరకు నాలుగు రోజుల పాటు ప్రవేశ పరీక్షలను నిర్వహిస్తారు. ఆన్‌లైన్‌లో కంప్యూటర్ ఆధారంగా అభ్యర్ధులు ప్రవేశ పరీక్షలు రాయాల్సి ఉంటుంది.

04/22/2018 - 01:27

హైదరాబాద్, ఏప్రిల్ 21: రాష్ట్రంలో క్రీడాభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోందని, క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వోద్యోగాల్లో రెండు శాతం రిజర్వేషన్ కల్పిస్తామని సీఎం కె చంద్రశేఖర్ రావు హామీ ఇచ్చారు. ఆస్ట్రేలియాలోని గోల్డ్‌కోస్ట్‌లో నిర్వహించిన కామనె్వల్త్ గేమ్స్ 2018లో పతకాలు సాధించిన క్రీడాకారులు శనివారం ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌ని కలిశారు.

04/22/2018 - 04:42

హైదరాబాద్: రైతుబంధు పథకం, పట్టాదార్ పాస్‌పుస్తకాల పంపిణీ కార్యక్రమాల అమలు చేయడంలో ఎలాంటి పొరపాట్లు జరగకుండా చూడాలని ఉన్నతాధికారులు, జిల్లా కలెక్టర్లు, జిల్లా యంత్రాంగాన్ని ముఖ్యమంత్రి కే. చంద్రశేఖరరావు హెచ్చరించారు. రెవెన్యూ, వ్యవసాయ శాఖల రాష్టస్థ్రాయి అధికారులు, జిల్లా కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, జిల్లా వ్యవసాయ అధికారులతోప్రగతిభవన్‌లో శనివారం ప్రత్యేకంగా సమావేశమయ్యారు.

04/22/2018 - 01:12

హైదరాబాద్, ఏప్రిల్ 21: వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకోబోమని సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యురాలు బృందాకారత్ స్పష్టం చేశారు. లౌకిక, ప్రజాస్వామ్య శక్తుల్ని ఏకం చేసి మళ్లీ బీజేపీని అధికారంలోకి రాకుండా చేయడమే తమ ముందున్న లక్ష్యమని ఇక్కడి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో శనివారం జరిగిన మీడియా సమావేశంలో వెల్లడించారు.

04/22/2018 - 04:44

హైదరాబాద్: కొద్ది రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో దుమారం రేపుతోన్న కాస్టింగ్ కౌచ్ వివాదానికి ఫుల్‌స్టాప్ పెట్టడానికి సర్కారు రంగంలోకి దిగింది. ఆరోపణలు, ప్రత్యారోపణలతో సినీ రంగం వేడెక్కిపోవడం, సమస్య తక్షణ పరిష్కారానికి చర్యలు తీసుకోవాలన్న డిమాండ్లు వెల్లువెత్తడంతో సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అధ్యక్షతన అన్ని వర్గాలతో శనివారం కీలక భేటీ జరిగింది.

04/22/2018 - 01:04

విజయవాడ, ఏప్రిల్ 21: బ్యాంకులను జాతీయం చేసి ఇందిరాగాంధీ సామాన్య ప్రజలకు బ్యాంకింగ్ సేవలు అందుబాటులోకి తీసుకువస్తే నేడు ప్రధాని మోదీ తన తుగ్లక్ చర్యల ద్వారా వాటిని దూరం చేసి, పెద్దనోట్ల రద్దుతో ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారంటూ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డాక్టర్ ఎన్.రఘువీరారెడ్డి నిప్పులు చెరిగారు.

04/22/2018 - 04:40

నూజివీడు: ప్రత్యేక హోదా కోసం చంద్రబాబు చేసిన దీక్ష గాడ్సే దీక్షను మరిపించేదిలా ఉందని, కొంగజపం...దొంగ దీక్షలా చంద్రబాబు చేసిన దీక్షకు రూ.30కోట్లు ఖర్చు చేసి ఏం సాధించారని కృష్ణా జిల్లా నూజివీడులో జరిగిన ప్రజా సంకల్పయాత్ర సభలో ప్రతిపక్షనేత వైకాపా నేత వైఎస్ జగన్మోహనరెడ్డి మండిపడ్డారు.

04/22/2018 - 04:43

విజయవాడ: తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) చైర్మన్‌గా పుట్టా సుధాకర్ యాదవ్ నియామకంపై విమర్శల వెల్లువ సద్దుమణగకముందే మరో వివాదం తెరపైకి వచ్చింది. పాయకరావుపేట ఎమ్మెల్యే వంగలపూడి అనిత తాను క్రిస్టియన్ అంటూ ఒక చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూ తాలూకు వీడియో ఇప్పుడు వైరల్ అయింది.

04/22/2018 - 00:55

విజయవాడ, ఏప్రిల్ 21: వచ్చే ఎన్నికల తర్వాత ప్రధాని ఎంపికలో టీడీపీ నిర్ణయమే కీలకంగా మారుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఉద్ఘాటించారు. బీజేపీకి రాష్ట్రంలో వచ్చే ఎన్నికల్లో ఒక్క సీటూ రాదని ఆయన జోస్యం చెప్పారు. నాలుగు సీట్లు తక్కువ వచ్చి ఉంటే ప్రధాని మోదీ మన మాట వినేవారని వ్యాఖ్యానించారు.

Pages