S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

04/16/2018 - 16:44

హైదరాబాద్: డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కల్పించిన హక్కులను కేంద్రం‌ బలహీనపరుస్తోందని ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ విమర్శించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ వరంగల్‌లో భారీగా ఎత్తున సింహగర్జన సభ నిర్వహిస్తామని, హైదరాబాద్‌, అమరావతిలో సన్నాహక సదస్సులు జరుపుతామని, సింహగర్జన సభకు దళిత, గరిజన నేతలను ఆహ్వానిస్తామని మందకృష్ణ స్పష్టం చేశారు.

04/16/2018 - 16:27

ప్రకాశం: మారిషస్‌లో ఓ తెలుగు విద్యార్థి దుర్మరణం చెందాడు. మృతుడు మద్దిపాడు మండలం అన్నంగి గ్రామానికి చెందిన సాయి మనోజ్‌గా గుర్తించారు. ప్రమాదవశాత్తు వాటర్ ఫాల్‌‌లో కాలు జారి పడి మృతిచెందినట్లుగా అధికారులు తల్లిదండ్రులకు సమాచారం అందించారు. మారిషస్‌లో సాయి మనోజ్ ఎంబీబీఎస్ విద్యను అభ్యసిస్తున్నాడు.

04/16/2018 - 13:31

హైదరాబాద్‌: విభజన హామీలు అమలు చేయాలంటూ సోమవారం హైదరాబాద్ కలెక్టరేట్ ముందు సీపీఐ ధర్నాచేపట్టింది. విభజన హామీల అమలులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని సీపీఐ నేత నారాయణ మండిపడ్డారు. మోదీని కాపాడేందుకు కేసీఆర్ కృషి చేస్తున్నారని ఆరోపించారు. మోదీని తిడుతూ లోపాయికారి ఒప్పందం కొనసాగిస్తున్నారన్నారు. సీపీఐ నేతలను పోలీసులు అడ్డుకుని అరెస్ట్ చేశారు.

04/16/2018 - 12:54

హైదరాబాద్ : కర్ణాటక శాసనసభ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ స్పష్టం చేశారు. సోమవారం ఓ జాతీయ మీడియాతో మాట్లాడిన ఆయన ఈ విషయాన్ని తెలియజేశారు. ఈ ఎన్నికల్లో జేడీఎస్ కు మద్దతు ఇచ్చి.. ఆ పార్టీ తరపున ప్రచారం చేస్తామని తెలిపారు. జాతీయ పార్టీలు అయిన కాంగ్రెస్, బీజేపీ పూర్తిగా విఫలమయ్యాయని ఎంపీ ఓవైసీ పేర్కొన్నారు.

04/16/2018 - 12:37

అమరావతి: ఈ నెల 21నుంచి నియోజకవర్గాల్లో సైకిల్ యాత్రలు చేపట్టాలని, నియోజకవర్గ కేంద్రాల్లో భారీ బహిరంగ సభలు జరపాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు

04/16/2018 - 12:28

వికారాబాద్: హైదరాబాద్ నగరంలోని లింగంపల్లిలో గ్రీన్ ట్రెండ్స్‌లో బ్యూటీషియన్‌గా పనిచేస్తున్న జ్యోతి అనే యువతి వికారాబాద్‌లో శవమై తేలింది. తాండూరులోని అమ్మమ్మ వాళ్లింటికి జాతరకని ఇంట్లో చెప్పి బయలుదేరిని అమ్మాయి ధారూర్ మండలం మైలారం వద్ద రాత్రి 11 గంటల ప్రాంతం లో బీజాపూర్ రైలు నుంచి కిందపడిపోయింది.

04/16/2018 - 12:20

హైదరాబాద్:మక్కా మసీదు పేలుళ్ల కేసును నాంపల్లి ఎన్‌ఐఏ కోర్టు కొట్టివేసింది. ఈ కేసులో నిందితులుగా ఉన్న ఐదుగురిని నిర్దోషులుగా ప్రకటించింది. ఈ కేసులో నిందితులైన స్వామి అసీమానంద, దేవేందర్ గుప్తా, రాజేందర్ చౌదరి, లోకేశ్ శర్మ, భరత్ భాయిని భారీ బందోబస్తు మధ్య చర్లపల్లి జైలు నుంచి ఇవాళ ఉదయం నాంపల్లి కోర్టుకు తీసుకువచ్చి హాజరుపరిచారు. అనంతరం వాదనలు విన్న న్యాయమూర్తి..

04/16/2018 - 11:40

నాగర్‌కర్నూల్: జిల్లాలోని అమ్రాబాద్ మండలం ఈదులబావి గ్రామ సమీపంలో లారీ - ద్విచక్రవాహనం ఢీకొనడంతో జరిగిన ప్రమాదంలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు పదర గ్రామానికి చెందిన గణేశ్(20), మురళి(16)గా గుర్తించారు. పోలీసులు లారీ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు.

04/16/2018 - 11:32

గుంటూరు: ఏపీకి ప్రత్యేక హోదా కోరుతూ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ వినూత్నంగా నిరసన చేపట్టింది. గుంటూరులో కార్యకర్తలు మోకాళ్ల మీద నిలబడి బంద్‌లో పాల్గొన్నారు. నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. బంద్‌లో భాగంగా గుంటూరు నగరంతో పాటు జిల్లాలోని అన్ని ముఖ్య కేంద్రాల్లో, బస్టాండ్‌ల వద్ద నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి.

04/16/2018 - 11:28

అమరావతి : ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరుతూ సోమవారం చేపట్టిన బంద్‌ రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతోంది. రాష్ట్ర బంద్‌కు ప్రత్యేక హోదా సాధన సమితి పిలుపునిచ్చిన ఈ బంద్‌కు టీడీపీ, బీజేపీ దూరంగా ఉన్నాయి. వైఎస్సార్‌సీపీ, వామపక్షాలతో పాటు మిగతా పార్టీలు బంద్‌కు సంపూర్ణ మద్ధతు ప్రకటించాయి. బంద్ కారణంగా ఆర్టీసీ బస్సులు. డిపోలకే పరిమితమైనాయి.

Pages