S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

04/14/2018 - 04:24

హైదరాబాద్, ఏప్రిల్ 13: రాష్ట్రంలో ఇసుక మాఫియా రాజ్యమేలుతున్నదని టీ పీసీసీ ప్రధాన కార్యదర్శి డాక్టర్ శ్రవణ్ దాసోజు విమర్శించారు. రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణా రావు ఇసుకను కొల్లగొడుతూ కోట్లాది రూపాయలు గడిస్తున్నారని ఆయన శుక్రవారం విలేఖరుల సమావేశంలో విమర్శించారు.

04/14/2018 - 04:22

హైదరాబాద్, ఏప్రిల్ 13: ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీసు కమిషన్ గ్రూప్-3 పరిధిలో గ్రేడ్-4 కేటగిరీ పంచాయతీ కార్యదర్శి పోస్టుల రిక్రూట్‌మెంట్‌పై ఆంధ్రప్రదేశ్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ స్టే మంజూరు చేసింది. రెండు వారాల పాటు ఈ స్టే అమలులో ఉంటుంది. నక్కా దేవశేషు మ రో ఎనిమిది మంది అభ్యర్థులు దాఖలు చేసిన పిటిషన్‌నను జ్యుడీషియల్ సభ్డు విజయకుమార్ విచారించారు.

04/14/2018 - 04:18

హైదరాబాద్/గచ్చిబౌలి, ఏప్రిల్ 13: చదివింది ఇంజనీరింగ్ చేసేది మోసాలు. జల్సాలకు అలవాటు పడిన ఐదుగురు యువకులు ఆన్‌లైన్ మోసాలకు పాల్పడుతుండగా సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. సైబరాబాద్ కమిషనరేట్‌లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో నిందితుల వివరాలను కమిషనర్ సజ్జనార్ వెల్లడించారు.

04/14/2018 - 03:37

న్యూఢిల్లీ, ఏప్రిల్ 13: దేశంలో బాలికలపై అత్యాచారాలు, హత్యలు పెరిగిపోతున్న నేపథ్యంలో ముఖ్యంగా జమ్మూకాశ్మీర్‌లోని కథువాలో ఎనిమిదేళ్ల బాలికపై జరిగిన అమానుష లైంగిక దాడి, హత్య ఘటనను ప్రభుత్వం అత్యంత తీవ్రంగా పరిగణిస్తోంది. 12 ఏళ్ల బాలికలపై జరుగుతున్న ఇలాంటి అఘాయిత్యాలకు పాల్పడే కామాంధులకు మరణశిక్షే సరైందని కేంద్ర స్ర్తి,శిశు సంక్షేమ శాఖ మంత్రి మేనకాగాంధీ అభిప్రాయపడ్డారు.

04/14/2018 - 03:32

ఇస్లామాబాద్, ఏప్రిల్ 13: పాకిస్తాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్‌కు సుప్రీం కోర్టు శుక్రవారం పెద్ద షాక్ ఇచ్చింది. ఎన్నికల్లో పోటీ చేయకుండా షరీఫ్‌పై జీవితకాలం నిషేధం విధిస్తూ సర్వోన్నత న్యాయస్థానం తీర్పును వెలువరించింది. త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికలకు ముందు మూడు సార్లు దేశ ప్రధానిగా పనిచేసిన నవాజ్ షరీఫ్‌కు ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం చారిత్రాత్మక తీర్పును ఇచ్చింది.

04/14/2018 - 02:51

హైదరాబాద్, ఏప్రిల్ 13: బెయిల్ మంజూరు కోసం లంచం తీసుకున్న కేసులో నాంపల్లి ఒకటవ అదనపు మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి ఎస్.రాధాకృష్ణమూర్తి, న్యాయవాదులు కె.శ్రీనివాసరావు, జి.సతీష్‌కుమార్‌లను తెలంగాణ ఏసీబీ అధికారులు శుక్రవారం అరెస్టు చేశారు. అరెస్టు చేసిన అనంతరం ముగ్గురినీ ఏసీబీ కేసుల ప్రత్యేక న్యాయస్ధానం ప్రిన్సిపల్ స్పెషల్ జడ్జి ముందు హాజరు పరిచారు.

04/14/2018 - 02:56

విజయవాడ, ఏప్రిల్ 13: నవ్యాంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం ప్రపంచంలో మేలిమి పాలన, ఉత్తమ సాంకేతిక విధానాలు ఎక్కడున్నా ఆదర్శంగా తీసుకుంటామని, వాటిని రాష్ట్రానికి అన్వయించుకుంటూ అనుసరిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు. తాము సింగపూర్ నుంచి ఎంతో నేర్చుకుంటున్నామని, ఎంతో విశిష్టమైన సంస్కృతి, సంప్రదాయాలు ఉన్న భారత్ నుంచి కూడా సింగపూర్ ఎంతో నేర్చుకోవచ్చని అన్నారు.

04/14/2018 - 02:57

విజయవాడ, ఏప్రిల్ 13: అగ్రిగోల్డ్ సమస్య మళ్లీ మొదటికి వచ్చింది. ఆస్తులకంటే అప్పులు ఎక్కువగా ఉండటంతో ఈ సంస్థను స్వాధీనం చేసుకోవడానికి ఎవరూ ముందుకు రావడం లేదని భావిస్తున్నారు. అగ్రిగోల్డ్‌ను స్వాధీనం చేసుకోవడానికి జీఎస్‌ఎల్ సంస్థ వెనుకంజ వేస్తోందన్న ప్రచారం బాధితులను ఒక్కసారిగా కుంగదీసింది.

04/14/2018 - 02:59

హైదరాబాద్, ఏప్రిల్ 13: తెలంగాణ ఇంటర్మీడియట్ ప్రధమ సంవత్సరం, ద్వితీయ సంవత్సరం పరీక్ష ఫలితాలను ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి శనివారం ఉదయం బోర్డు కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో బోర్డు కార్యదర్శి డాక్టర్ ఎ అశోక్, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ సుశీల్ కుమార్, ప్రభుత్వ జూనియర్ లెక్చరర్ల సంఘం అధ్యక్షుడు డాక్టర్ మధుసూధనరెడ్డి పాల్గొన్నారు.

04/14/2018 - 03:10

హైదరాబాద్, ఏప్రిల్ 13: ‘దేశ రాజకీయాల్లో కాంగ్రెస్, బీజేపీల నేతృత్వంలోని ప్రభుత్వాల వైఫల్యమే ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటుకు కారణం’ అని టిఆర్‌ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు స్పష్టం చేశారు. దేశానికి మేలు చేసే లక్ష్యం కోసమే తప్ప చిల్లర రాజకీయాల కోసం ఫ్రంట్‌ను ఏర్పాటు చేయడం లేదని ఉద్ఘాటించారు.

Pages