S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

04/16/2018 - 01:54

హైదరాబాద్, ఏప్రిల్ 15: తెలంగాణ రాష్ట్రంలో వైద్య సేవలను ప్రజల చెంతకు తీసుకెళ్లడంలో వైద్య శాఖ ముందడుగు వేస్తోంది. ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు వైద్య పరీక్షలను నిర్వహించి మహమ్మారి రోగాలను ముందుగా కనిపెట్టేందుకు వైద్య శాఖ చేపట్టిన కసరత్తు 12 జిల్లాల్లో పూర్తయింది. ఈ పథకం కింద అంటు వ్యాధి కాని రోగాలను (నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్) గుర్తించే ప్రక్రియ చేపట్టారు.

04/16/2018 - 01:53

హైదరాబాద్, ఏప్రిల్ 15: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ రంగంలో అరుదైన రికార్డులను సొంతం చేసుకుంటోంది. 37 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే లక్ష్యంతో చేపట్టిన ఈ ప్రాజెక్టు పనుల్లో శనివారం ఒక్కరోజే 7 వేల క్యూబిక్ మీటర్ల పని జరగడం అరుదైన రికార్డుగా నిలిచింది.

04/16/2018 - 04:02

హిందూపురం, ఏప్రిల్ 15 : రాష్ట్ర విభజన హామీలను తుంగలో తొక్కుతున్న ప్రధాని నరేంద్రమోదీకి తెలుగు వారి తడాఖా ఏంటో చూపిస్తామని రాష్ట్ర జనవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, హిందూపురం ఎంపీ నిమ్మల కిష్టప్ప పేర్కొన్నారు. మోదీ ఏపీతో పెట్టుకోకు, తెలుగువారి తడాఖా ఏమో చూపిస్తాం.. ఇకనైనా విభజన హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేశారు.

04/16/2018 - 01:38

కర్నూలు, ఏప్రిల్ 15 : పొరుగు రాష్టమ్రైన కర్నాటకలో భారతీయ జనతా పార్టీ ఓటమికి తెలుగుదేశం పార్టీ తీవ్రంగా ప్రయత్నించే అవకాశం ఉంది. ఆ రాష్ట్రంలో మే 12వ తేదీ పోలింగ్ నిర్వహించనున్నారు. కర్నాటకలో ప్రధాన ప్రత్యర్థులుగా అక్కడ అధికారంలో ఉన్న కాంగ్రెస్, బీజేపీ పోటీ పడుతున్నాయి. వీరికి తోడు మాజీ ప్రధాని దేవేగౌడ నేతృత్వంలోని జనతాదళ్ సెక్యులర్ పార్టీ కూడా అధికారం దక్కించుకోవడానికి కృషి చేస్తోంది.

04/16/2018 - 01:32

విజయవాడ, ఏప్రిల్ 15: విభజన హామీల అమలు, ప్రత్యేక హోదా, తదితర అంశాల్లో రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం చేసిన అన్యాయానికి నిరసనగా ఈ నెల 20న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దీక్ష చేపట్టనున్నారు. విజయవాడ నగరంలోని ఇందిరా గాంధీ మున్సిపల్ కార్పొరేషన్ స్టేడియంలో నిరసన దీక్ష చేపట్టాలని ఆదివారం నిర్ణయించారు.

04/16/2018 - 01:31

విజయవాడ, ఏప్రిల్ 15: ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ‘ప్రత్యేక హోదా, విభజన హామీల సాధన సమితి’ ఆధ్వర్యంలో ఆరోసారిగా సోమవారం రాష్ట్ర బంద్ జరగబోతోంది. సమితి ఆధ్వర్యంలో తొలిసారిగా 2015 ఆగస్టు 11న రాష్ట్ర బంద్ జరిగింది. ఆ తరువాత అనేక సందర్భాల్లో బంద్‌లతో పాటు జాతీయ రహదారి దిగ్బంధం, రైల్‌రోకో వంటి ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు.

04/16/2018 - 01:30

కర్నూలు, ఏప్రిల్ 15: కేంద్ర ప్రభుత్వంపై యుద్ధం ప్రకటించిన తెలుగుదేశం పార్టీ ఈ నెల 20వ తేదీ ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పుట్టిన రోజున గల్లీ నుంచి ఢిల్లీ వరకూ నిరశన దీక్షలు చేపట్టనుంది. కేంద్రం రాష్ట్రానికి ఇచ్చిన హామీలను నెరవేర్చలేదన్న కారణంగా గత కొంతకాలంగా నిరసన, ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

04/16/2018 - 03:28

విశాఖపట్నం, ఏప్రిల్ 15: కాశ్మీర్‌లో చిన్నారి అసీఫాను అతికిరాతకంగా చెరచి, హత్య చేసిన నిందితులను నడిరోడ్డుపై ఉరి తీయాలంటూ విద్యార్థినులు నినదించారు. విశాఖ నగరంలో ఆదివారం ఉదయం ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ విద్యార్థినులు పెద్ద సంఖ్యలో అసిఫా హత్యోదంతంపై కదంతొక్కారు. అభంశుభం తెలియని చిన్నారిపై పైశాచికత్వానికి ఒడిగట్టిన కిరాతకులను కఠినంగా శిక్షించినప్పుడే భవిష్యత్‌లో పునరావృతం కావన్నారు.

04/16/2018 - 01:24

రాజమహేంద్రవరం, ఏప్రిల్ 15: అఖండ గోదావరి ఎడమ గట్టు వైపు దేవీపట్నం మండలం అంగుళూరు వద్ద పోలవరం పవర్‌హౌస్ మట్టి పనులు ఊపందుకున్నాయి. మట్టి పనులు ఇదే వేగంతో దాదాపు రెండు నెలల్లో పూర్తి చేసి జూన్ నెలాఖరుకల్లా కాంక్రీటు పని చేపట్టాలనే లక్ష్యంతో కార్యాచరణ చేపట్టారు. ఇటీవల కాలంలో ఏపీ జెన్కో ఎండి విజయానంద్ పనులను క్షేత్ర స్థాయిలో సమీక్షించారు.

04/15/2018 - 05:34

ముంబయి: రేపిస్టులకు మరణశిక్ష విధించాలన్న కేంద్ర మంత్రి మేనకాగాంధీ అభిప్రాయంతో ఒకప్పటికి డ్రీమ్‌గర్ల్, బీజేపీ ఎంపీ హేమమాలిని ఏకీభవించారు. 12 ఏళ్లలోపు బాలికలపై లైంగిక దాడులకు తెబడుతున్న మృగాలకు ఉరే సరైన శిక్ష అం టూ మేనకాగాంధీ శుక్రవారం ట్వీట్ చేశారు. దీని కోసం చట్టాన్ని సవరించాలని సంబంధిత అధికారులను మంత్రి ఆదేశించిన సంగతి తెలిసిందే.

Pages