S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

04/16/2018 - 04:23

కేసముద్రం, ఏప్రిల్ 15: ఓహెచ్‌ఇ వైరు తెగిపోవడంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయి ఆదివారం సాయంత్రం కాజీపేట - విజయవాడ సెక్షన్‌లో రెండు గంటల పాటు రైళ్లు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. రైల్వేవర్గాల కథనం ప్రకారం- ఖమ్మం జిల్లా గార్ల రైల్వే స్టేషన్లో ఓహెచ్‌ఇ వైరు తెగిపోవడంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దీంతో కాజీపేట-విజయవాడ సెక్షన్‌లో డౌన్‌లైన్లో రైళ్లరాకపోకలకు అంతరాయం కలిగింది.

04/16/2018 - 04:21

హైదరాబాద్, ఏప్రిల్ 15: దేశంలో పార్లమెంట్, అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు రాఘవులు అన్నారు. సీపీఎం పార్టీ 22వ మహాసభల సందర్భంగా ఆదివారం ఎంబీ భవన్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జమిలి ఎన్నికలతో రాష్ట్రాల హక్కులకు విఘాతం కలుగుతుందని అన్నారు.

04/16/2018 - 04:19

విశాఖపట్నం, ఏప్రిల్ 15: రాష్ట్రంలో పగటి ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. కోస్తాంధ్రలో పలు పట్టణాల్లో ఆదివారం పగటి ఉష్ణోగ్రతల్లో ఒకటి నుంచి రెండు డిగ్రీలు అధికంగా నమోదయ్యా యి. వేసవి ప్రభావంతోనే పగటి ఉష్ణోగ్రతల్లో స్వల్ప పెరుగుదల నమోదవుతోందని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు ఆదివారం రాత్రి తెలిపారు.

04/16/2018 - 04:18

హైదరాబాద్, ఏప్రిల్ 15: ప్రముఖ వైద్యుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రెడ్‌క్రాస్ సొసైటీ మాజీ కార్యదర్శి డాక్టర్ ఎపి రంగారావు (75) ఆదివారం మృతి చెందడం పట్ల ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఒక ప్రకటనలో సంతాపం వ్యక్తం చేసారు. పేదలకు వైద్య సేవలు అందించడానికి, ప్రభుత్వపరంగా వైద్య సేవలను విస్తరించడానికి రంగారావు జీవితాంతం కృషి చేసారని సీఎం కొనియాడారు.

04/16/2018 - 04:16

తిరుపతి, ఏప్రిల్ 15: ప్రధాని నరేంద్ర మోదీకి ఆంధ్రప్రదేశ్ పట్ల మరింత ప్రేమను కల్పించి ప్రత్యేక హోదా ఇచ్చే బుద్ధిని ప్రసాదించమని ఆ తిరుమల వేంకటేశ్వరస్వామి ని ప్రార్థించానని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్ నన్నపనే ని రాజకుమారి అన్నారు. ఆదివారం ఆమె కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.

04/16/2018 - 04:15

విజయవాడ, ఏప్రిల్ 15: ప్రకృతి అనూకూలించక పోవడంతో దిగుబడి గణనీయంగా తగ్గిపోయి ఈ ఏడాది మామిడి ధర కొండెక్కనుంది. తోటల వద్దే కాయ 10 రూపాయల ధర పలుకుతోంది. పూత, పిందె దశలో భారీగా నష్టపోవడంతో మిగిలిన పంటను కాపాడుకునేందుకు రైతులు ప్రయత్నం చేస్తున్నారు. రాష్ట్రంలో 3.7 లక్షల హెక్టార్లలో మామిడి తోటలు ఉన్నాయి. ఈ ఏడాది ప్రారంభంలో మామిడి పూత బాగా వచ్చింది. దీంతో మంచి దిగుబడి రావచ్చని రైతులు ఆశపడ్డారు.

04/16/2018 - 04:01

తిరుపతి, ఏప్రిల్ 15: వరుస సెలవుల నేపథ్యంలో శ్రీవారి దర్శనార్థం తిరుమలకు వచ్చే భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఆదివారం సాయంత్రం ఆరు గంటల వరకు 64,804 మంది స్వామివారిని దర్శించుకున్నారు. భక్తులు హుండీల్లో సమర్పించిన కానుకల ద్వారా రూ.3.49 కోట్ల ఆదాయం లభించింది. మరో 29 కంపార్టుమెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. వీరు స్వామివారిని దర్శించుకునేందుకు 10 నుండి 12 గంటల సమయం పడుతోంది.

04/16/2018 - 02:11

హైదరాబాద్, ఏప్రిల్ 15: దాదాపు పదకొండేళ్ల కిందట చార్మినార్ సమీపంలోని మక్కా మసీదులో జరిగిన బాంబు పేలుళ్ల కేసులో ఈ నెల 16 సోమవారం తీర్పు వెలువడనుంది. దీంతో నాంపల్లి కోర్టు వద్ద భారీ బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నారు. నేషనల్ ఇనె్వస్టిగేటివ్ ఏజెన్సీ (ఎన్‌ఐఏ) కోర్టు కం నాలుగో అదనపు మెట్రోపాలిటన్ సెషన్స్ కోర్టులో ఈ కేసు విచారణ కొనసాగింది.

04/16/2018 - 02:07

హైదరాబాద్, ఏప్రిల్ 15: హైదరాబాద్ రీజియన్ అంతా నిజంగా భాగ్యనగరమే. ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా, రియల్టీ, చలనచిత్ర పరిశ్రమ, వాణిజ్య, ఐటీ రంగంలో స్థబ్దత, ఆర్థిక మాంద్యం ఎదురైనా హైదరాబాద్ రీజియన్ నిజంగా సంపద నగరమే. అంతర్జాతీయ నగరంగా భాసిల్లుతున్న హైదరాబాద్ రీజియన్ ఆదాయం పన్ను వసూళ్లలో దూసుకుపోతోంది. హైదరాబాద్ రీజియన్ దేశం మొత్తం మీద ఆదాయం పన్ను వసూళ్లలో ఆరవ స్థానంలో నిలిచింది.

04/16/2018 - 02:05

వరంగల్, ఏప్రిల్ 15: ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ ప్రజలకు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు ఏమయ్యాయని, హామీలు నెరవేర్చనందుకు తెలంగాణ ప్రజలకు ముఖ్యమంత్రి క్షమాపణ చెప్పాలని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. కాంగ్రెస్‌పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన ప్రజా చైతన్య బస్సుయాత్ర మహబూబాబాద్ జిల్లాలోని డోర్నకల్ నియోజకవర్గం పరిధిలో మరిపెడ మండల కేంద్రానికి ఆదివారం చేరుకుంది.

Pages